Kohli On World Cup 2027: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) సంచలన ప్రకటన చేశాడు. తన భవిష్యత్తుపై తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొని.. కీలక వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ. 2027 వరల్డ్ కప్ ( 2027 World Cup ) వరకు ఆడే విషయం పైన క్లారిటీ ఇచ్చాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) . తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ వరకు తాను క్రికెట్ ఆడతానని కూడా గుర్తు చేశాడు విరాట్ కోహ్లీ. తన నెక్స్ట్ స్టెప్పు వరల్డ్ కప్ 2027 అంటూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: IPL 2025: KKR కోట కూల్చిన ముంబై కుర్రాడు.. ఎవరీ అశ్వని కుమార్!
2027 వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆడుతానని ప్రకటన చేయడంతో…. టీమిండియా అభిమానులు అలాగే ఆయన ఫ్యాన్స్… తెగ సంబరపడిపోతున్నారు. 2027 వరల్డ్ కప్ వరకు (Kohli On World Cup 2027 ) విరాట్ కోహ్లీ ఆడితే కచ్చితంగా టీమిండియా చాంపియన్ అవుతుందని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాకు ఆడాల్సిన అవసరం ఉందని… 2027 ప్రపంచ కప్ తర్వాత ( 2027 World Cup ).. రిటైర్మెంట్ తీసుకోవాలని కోరారు.
Also Read: John Cena: కాన్సర్ బారిన పడ్డ WWE సూపర్ స్టార్ జాన్ సీనా !
ఐపీఎల్ 2025లో దూసుకు వెళ్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament ).. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Bangalore ).. దూసుకు వెళ్తోంది. గతంలో కంటే ఈసారి మెరుగైన ఆట ప్రదర్శన కనబరుస్తోంది బెంగళూరు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో ఆడిన మ్యాచ్ లన్ని గెలిచింది. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పై గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చెన్నైలోనే ఓడించింది. ఇలా వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి నాలుగు పాయింట్లు సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ). అంతేకాదు పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ లో ఉంది. ఇదే ఆట తిరుగు కొనసాగిస్తే… ఈసారి ఛాంపియన్ కావడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు.
టెస్ట్ ప్లేయర్ లాగా ఆడుతున్న విరాట్ కోహ్లీ
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament )…. విరాట్ కోహ్లీ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. టెస్ట్ ప్లేయర్ లాగా మ్యాచులు ఆడుతున్నాడని… కోహ్లీపై ఫైర్ అవుతున్నారో ఫాన్స్. ఐపీఎల్ అంటే టి20 లాగా ఆడాలని కోరుతున్నారు. కాగా మొన్న చెన్నై మ్యాచ్లో 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ.
VIRAT KOHLI AT THE 2027 WORLD CUP.
– Kohli confirms World Cup as his next big step. 🐐🇮🇳pic.twitter.com/SJExtQIHtk
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025