BigTV English

Oldest Railway Stations: దేశంలో అత్యంత పురాతన రైల్వే స్టేషన్లు ఇవే.. భారత్ లో ఫస్ట్ స్టేషన్ ను ఎక్కడ నిర్మించారంటే?

Oldest Railway Stations: దేశంలో అత్యంత పురాతన రైల్వే స్టేషన్లు ఇవే.. భారత్ లో ఫస్ట్ స్టేషన్ ను ఎక్కడ నిర్మించారంటే?

Oldest Railway Stations Of India:  భారతీయ రైల్వే వ్యవస్థకు సుమారు రెండు శతాబ్దాల చరిత్ర ఉన్నది. 18వ శతాబ్దంలోనే భారత్ లో రైల్వే నిర్మాణం మొదలయ్యింది. 1853లో బ్రిటిషర్లు గ్రేట్ ఇండియన్ పెన్సులా రైల్వేను స్థాపించారు. బొంబాయి-థానే నడుమ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో తొలి రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఇంతకీ దేశంలో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఏది? ఏ సంవత్సరంలో నిర్మించారు? దేశంలో అత్యంత పురాతనమైన రైల్వే స్టేషన్లు ఏవి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ ఛత్రపతి శివాజీ టెర్మినల్

దేశంలో తొలి రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్. బ్రిటిషర్లు 1853లో దీనిని విక్టోరియా టెర్మినల్ పేరుతో నిర్మించారు. దేశంలో అత్యంత పురాతనమైన రూల్వే స్టేషన్ ఇది. తొలుత దీనికి బోరి బందర్ రైల్వే స్టేషన్ అనే పేరు పెట్టారు. కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం 1887లో ప్రారంభమై 1888 మేలో పూర్తి అయ్యింది. దీనిని ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ నిర్మించారు. ఈ నిర్మాణం ఇటాలియన్, ఇండియన్ శైలిలో కొనసాగింది. ఈ స్టేషన్ నిర్మాణంలో ఇటాలియన్ పాలరాయిని ఉపయోగించారు.


⦿ హౌరా జంక్షన్

ఇది పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఉంది. దీనిని 1854లో గుడిసె మాదిరిగా నిర్మించారు. ఒకే ప్లాట్‌ ఫారమ్ తో ఎర్ర ఇటుకలతో ఏర్పాటు చేశారు. 1900- 1911 మధ్య కాలంలో పునర్నిర్మించారు. ఇందులో రోమనెస్క్, మూరిష్ నిర్మాణ శైలులు ఉన్నాయి. కొత్త భవనాన్ని హాల్సే రికార్డో నిర్మించారు.

⦿ రాయపురం రైల్వే స్టేషన్

రాయ పురం రైల్వే స్టేషన్ తమిళనాడులోని చెన్నైలో ఉంది. రైల్వే స్టేషన్ నిర్మాణం 1853లో ప్రారంభమై జూన్ 1856లో పూర్తయింది. నిర్మాణం పూర్తయిన ఒక నెల తర్వాత సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ స్టేషన్ విక్టోరియన్ గోతిక్ వాస్తు ప్రకారం నిర్మించారు.

⦿ కాన్పూర్ సెంట్రల్

కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. దీనిని 1859లో నిర్మించారు. దీని నిర్మాణం తర్వాతే అలహాబాద్‌కు మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది.  ఇండో-సార్సెనిక్ వాస్తు శిల్పం ప్రకారం దీనిని నిర్మించారు.

⦿ అలహాబాద్ జంక్షన్

ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను గతంలో అలహాబాద్ జంక్షన్ గా పిలిచేవాళ్లు. దీని నిర్మాణం 1855లో ప్రారంభమై 1859లో పూర్తయింది. 1882లో జంక్షన్ సమీపంలో ఒక వర్క్‌ షాప్ ను కూడా నిర్మించారు.

⦿వడోదర జంక్షన్

వడోదర జంక్షన్ 1861లో మహారాజా ఖండేరావు నిర్మించారు. ఇది గుజరాత్‌ లోని వడోదర సయాజిగంజ్‌ లో ఉంది. 1954లో దీన్ని పునర్నిర్మించారు. కొత్త భవనం బయోఫిలిక్ డిజైన్‌ను కలిగి ఉంది.

⦿ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్

పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ 1864లో చాందిని చౌక్ సమీపంలో రెండు చిన్న ప్లాట్‌ ఫారమ్‌ లతో నిర్మించారు. 1903లో ఎర్రకోట మాదిరిగానే పునర్నిర్మించారు. రెండు అంతస్తుల భవనంలో ఎత్తైన వాల్టెడ్ పైకప్పులు, తోరణాలు వంటి గోతిక్ లక్షణాలను కలిగి ఉంది.

⦿మద్రాస్ సెంట్రల్

ఇది తమిళనాడు  చెన్నైలోని పెరియమెట్‌ లో ఉంది. దీనిని 1862- 1873 మధ్యలో నిర్మించారు. దీనిని జార్జ్ హార్డింగ్ ఈ స్టేషన్ ను నిర్మించారు. ఇది నాలుగు ప్లాట్‌ ఫారమ్‌ లను కలిగి ఉంది. 136 అడుగుల ఎత్తులో, నాలుగు వైపులు కనిపించే క్లాక్ ను ఏర్పాటు చేశారు. ఇది ప్రతి పావుగంటకు ఒకసారి గంటలు మోగుతాయి.

⦿ ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్

ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలోని రాకబ్‌గంజ్‌లో ఉంది. దీనిని 1873లో నిర్మించారు.

⦿ఝాన్సీ జంక్షన్

ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉంది. దీనిని 1880ల చివరలో నిర్మించారు. రెండు అంతస్తుల స్టేషన్ భవనంలో బ్రిటీష్ నిర్మాణ శైలిని కలిగి ఉంది.

Read Also: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాలు.. ఏమాత్రం తేడా వచ్చినా గోవిందా!

Related News

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

Big Stories

×