Dhanush VS Nayanthara: నయనతార (Nayanthara) చాలాకాలంగా సౌత్ భాషల్లో సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. అందుకే అసలు తను లేడీ సూపర్ స్టార్ ఎలా అయ్యింది, తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కున్న కష్టాలు ఏంటి, రిలేషన్‌షిప్స్ వల్ల తను ఎన్ని కష్టాలు పడింది.. లాంటివి చెప్తూ ఒక డాక్యుమెంటరీ విడుదలయ్యింది. అదే ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్’ (Nayanthara Beyond The Fairytale). ఇందులో తను నటించిన ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ మేకింగ్ సీన్‌ను ఉపయోగించినందుకు ధనుష్ తనపై కేసు ఫైల్ చేశాడు. గత కొంతకాలంగా మద్రాసు హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. ధనుష్ కేసును రిజెక్ట్ చేయాలంటూ నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన మరో కేసును తాజాగా హైకోర్ట్ రద్దు చేసింది.
ధనుష్ పకడ్బందీ ప్లాన్
‘నానుమ్ రౌడీ ధాన్’ మేకింగ్ వీడియోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు నయనతారపై, నెట్‌ఫ్లిక్స్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేశాడు ధనుష్. ఈ కేసుపై నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా సెపరేట్‌గా పోరాటం మొదలుపెట్టింది. ధనుష్ పిటీషన్‌ను రిజెక్ట్ చేయాలంటే నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్ దాఖలు చేసింది. కానీ నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్‌ను మద్రాస్ హైకోర్ట్ తాజాగా రిజెక్ట్ చేసింది. తదుపరి విచారణనను ఫిబ్రవరీ 5కు వాయిదా వేసింది. అసలైతే నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు సంబంధించిన ఆఫీస్ ముంబాయ్‌లో ఉంది. అంటే అది మద్రాస్ హైకోర్టు పరిధిలోకి రాదు. అందుకే దానిపై కూడా సెపరేట్‌గా ఒక దరఖాస్తును ఫైల్ చేశాడు ధనుష్.
నెట్‌ఫ్లిక్స్ వాదన
ధనుష్ (Dhanush) దరఖాస్తుకు వ్యతిరేకంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) పోరాటం మొదలుపెట్టింది. నయనతార డాక్యుమెంటరీలో చూపించిన ఫుటేజ్ 2020కు చెందినది అని, దానికి సంబంధించిన కాపీరైట్ జాగ్రత్తలను మేకర్స్ తీసుకోలేదని పూర్తి బాధ్యతను వారిపైనే తోసేసింది నెట్‌ఫ్లిక్స్. పైగా డాక్యుమెంటరీ విడుదలయిన వారం రోజుల తర్వాత ధనుష్.. ఈ ఫిర్యాదును ఫైల్ చేశాడని గుర్తుచేసింది. అందుకే అసలు ధనుష్ చేసిన ఫిర్యాదుకు అర్థం లేదని, ఈ కేసును కొట్టిపారేయాలని నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్‌లో పేర్కొంది. దానికి ధనుష్ తరపున లాయర్ పీఎస్ రామన్ తన తరపున వాదనలు వినిపించారు. ఒక సినిమా సెట్‌లో జరిగే ఏ విషయం అయినా ఆ సినిమాకు డబ్బులు పెట్టేవారికే చెందుతుందని వాదించారు.
Also Read: తెలుగు తెరపై రణబీర్ కపూర్.. ఆ మెగా హీరోతో మల్టీ స్టారర్.?
స్వయంగా నయన్ సంతకం
కేసు ఎప్పుడు ఫైల్ చేసినా కూడా ఆ డాక్యుమెంటరీలో చూపించిన సన్నివేశం మాత్రం ధనుష్ సినిమాకు సంబంధించే అని తన తరపున లాయర్ అన్నారు. అంతే కాకుండా ట్రైలర్ విడుదల అవ్వగానే మేకర్స్‌కు ఈమెయిల్ పంపామని బయటపెట్టారు. అసలు డాక్యుమెంటరీలో తన సినిమాకు సంబంధించిన ఏ సీన్ ఉందో తెలియదు కాబట్టి అది విడుదల అయ్యేవరకు కేసు ఫైల్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాలో నయనతార గెటప్, కాస్ట్యూమ్‌ను ఎక్కడ ఉపయోగించినా అది కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని నయన్ స్వయంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసిందని తెలిపారు. అలా ధనుష్ తరపున వాదనలు ధృడంగా ఉండడంతో నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్‌ను మద్రాస్ హైకోర్టు రిజెక్ట్ చేసింది.