E-Paper
Advertisement

Railway Routes: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాలు.. ఏమాత్రం తేడా వచ్చినా గోవిందా!

Railway Routes: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాలు.. ఏమాత్రం తేడా వచ్చినా గోవిందా!
Advertisement

Dangerous Railway Routes: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైల్వే మార్గాలున్నాయి. వాటిలో కొన్ని ఆహ్లాదాన్ని అందించేవి కాగా, మరికొన్ని భయం పుట్టించేలా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన టాప్ 5 రైల్వే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ట్రెన్ ఎ లాస్ న్యూబ్స్, అర్జెంటీనా

Advertisement

ఈ రైలు అర్జెంటీనాలోని సాల్టా,  చిలీలోని పోల్వోరిల్లో ను కలుపుతుంది. సుమారు 217 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఏకంగా 27 సంవత్సరాలు పట్టింది. 1948లో ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు మొదలు అయ్యింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రైల్వే సేవలు మొదలయ్యాయి. ఈ రైల్వే లైన్ సముద్ర మట్టానికి ఏకంగా 4200 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ రైలు 29 బ్రిడ్జిలు, 21 సొరంగాలు దాటుకుంటూ సుమారు 16గంటల పాటు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

⦿వైట్ పాస్ & యుకోన్, అమెరికా

Advertisement

ఈ రైల్వే మార్గాన్ని 20 శాతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. బంగారు ఖనిజాన్ని తరలించేందుకు ఈ రైల్వే మార్గాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత 1982లో మూసేశారు. 1988 తర్వాత మళ్లీ ఈ రైల్వే రూట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం   స్కగ్వే నుంచి కార్ క్రాస్ వరకూ 67 కిలో మీటర్ల మేర రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో వెళ్లాలంటే భయంతో వణికిపోతారు.

⦿ చెన్నై- రామేశ్వరం, భారత్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాల్లో భారత్ కు చెందిన చెన్నై-రామేశ్వరం రూట్ ఒకటి. చెన్నై-రామేశ్వరం రైల్వే మార్గంలో సుమారు 2.3 కిలో మీటర్లు సముద్రం మీది నుంచి జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ రూట్ లో ప్రయాణించాలంటే చాలా ధైర్యం కావాలి. సముద్రం ఆటు పోట్ల సమయంలో అలలు రైల్లో వెళ్లే వారిని తడిపేస్తుంటాయి. తీవ్రమైన గాలులు వీస్తున్న సమయంలో ఈ వంతెనపై రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఈ బ్రిడ్జి మీద వెళ్లే సమయంలో ప్రయాణీకులు భయపడతారు.

Read Also: కాశ్మీర్ లోయ కోసం స్పెషల్ ట్రైన్ సెట్లు, ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

⦿ కురండా రైల్వే, ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ లోని కైర్న్ స్, కురండా ను కలుపుతూ 34 కిలో మీటర్ల మేర రైల్వే మార్గం ఉంటుంది. ఈ రూట్ లో ఏకంగా 15 సొరంగాలు, 40 బ్రిడ్జిలు, సుమారు 100 మూల మలుపులు ఉంటాయి. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది.

Read Also: దేశంలో పట్టాలెక్కిన తొలి రైలు ఇదే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందంటే?

⦿ డెవిల్స్ నోస్, ఈక్వెడార్

ఈక్వెడార్ లోని  డెవిల్స్ నోస్ రైల్వే రూట్ ను ప్రపంచంలోని అత్యంత భయంకరమైన రైల్వే రూట్లలో ఒకదానిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రూట్ సుమారు 12 కిలో మీటర్ల మేర విస్తరించి  ఉన్నది. ఈ రైల్వే ట్రాక్ ఏకంగా సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో నిర్మించారు.

Read Also: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు పోయినట్టే, దేశంలోనే భయంకరమైన ఘోస్ట్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×