BigTV English

IND Vs Pak Ceasefire Secrets: ఆ 48 గంటలు జరిగిన హైడ్రామా ఏంటి? కాల్పుల ఒప్పందం సీక్రెట్ ఇదేనా.!

IND Vs Pak Ceasefire Secrets: ఆ 48 గంటలు జరిగిన హైడ్రామా ఏంటి? కాల్పుల ఒప్పందం సీక్రెట్ ఇదేనా.!

IND Vs Pak Ceasefire Secrets: టెలిగ్రాఫ్‌ వంటి అంతర్జాతీయ పత్రికలు పాక్ చైనా పీఎల్ 15 సాయంతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల అంతు చూస్తోందన్న కథనాలు వెల్లు వెత్తుతున్న వేళ.. భారత్ మొత్తం గేమ్ ప్లాన్ ఛేంజ్ చేసిందా? అంటే అవుననే తెలుస్తోంది. అక్కడా ఇక్కడా కొట్టడం ఎందుకు ఏకంగా పాక్ వీక్నెస్ మీదే దెబ్బ కొడితే.. దాని ద్వారా మొత్తం మారిపోతుందన్న ఎత్తుగడ వేసిందా? అణుకోణంలో పీచమణిచిందా? అంటే అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయ్.


యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియో..

ఏ ఉగ్రవాద చర్యనైనా.. యుద్ధ చర్యగానే పరిగణిస్తామన్న భారత్మే పదవ తారీఖు. సాయంత్రం. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో.. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కి, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి ఫోన్ చేశారు. ఈ కాల్ సారాంశమేంటంటే.. పాకిస్థాన్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని. ఇది బయట ప్రపంచానికి అనెక్స్ పెక్టెడ్ కాల్. కానీ భారత్ కి కాదు. ఎందుకంటే భారత్ ఈ కాల్ ని ముందుగానే ఊహించింది. యుద్ధంలో ఎప్పటికప్పుడు మార్చే వ్యూహాలతో ఆధిపత్యం సాధించడమే అసలు సిసలు విజేత. ఇలా ఎవరు చేస్తారో.. వారే యుద్ధాన్ని, యుద్ధం జరుగుతున్న భూమ్యాకాశాలను తమ ఆధీనంలోకి తీసుకోగలుగుతారు. ఈ సిద్ధాంతం బాగా వంటబట్టించుకున్న భారత్ ఈ దిశగా వేసిన అడుగులు సత్ఫలితాలను ఇచ్చాయి.


ఖచ్చితమైన భారత్ దాడులతో పాక్‌కి షాక్

మే 10న భారత్ పాకిస్థాన్ వైమానిక స్తావరాలపై చేసిన ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు.. పాక్ దిమ్మ తిరిగేలా చేయడం మాత్రమే కాదు.. అంచనాలను తారు మారు చేసేసింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరుగుతున్న ఈ పోరుకు మేజర్ టర్నింగ్ పాయింట్ ఇదే. భారత క్షిపణులు పాక్ కీలకమైన రన్ వేలను తుడిచిపెట్టింది. అంతే కాదు దాని అణ్వాయుధశాల దగ్గరకు కూడా అంతే సమాన వేగంతో దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా ఇస్లామాబాద్ గుండెల్లో అణుబాంబు పేలింది. పక్కా సమన్వయంతో జరిగిన ఈ దాడులు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడో ఉన్న లైటు వెలిగినట్టు.. ఇక్కడ పాక్ అణ్వాయుధ శాల దగ్గర చేసిన భారత దాడులు అమెరికాను ఉలిక్కి పడేలా చేశాయి. పాకిస్థాన్ తన సైనిక చర్యలన్నిటినీ నిలిపివేయాల్సిందిగా అమెరికా నుంచి డైరెక్షన్స్ అందాయి.

కశ్మీర్‌టు గుజరాత్ పాక్ 15 దాడులు

పాక్ కి చెందిన క్షిపణి, డ్రోన్ దాడులు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ 15 జాతీయ వైమానిక స్థావరాలను టార్గెట్ చేసుకున్న కొన్ని గంటల తర్వాత.. భారత్ నుంచి ఈ దిమ్మ తిరిగే రియాక్షన్ వచ్చింది. 16 మంది పౌరులను చంపి.. మతపరమైన నిర్మాణాలను దెబ్బ తీసిన పాక్ దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. అలాగని అది మాటల రూపంలో ఉండకూడదు. ఖచ్చితమైన టార్గెట్లను ఎంపిక చేసి మరీ కొట్టాలి. మీరు మా సాధారణ స్థావరాలపై కొడితే.. మేం మీ అసాధారణ ప్రాంతాలపై దాడులు చేస్తామన్న సందేశం ఇవ్వాలి. అన్నంత పని చేసి.. ఆ దిశగా ఫలితం రాబట్టాలన్న నిర్ణయం తీస్కుంది భారత్. ఆ వెంటనే పాకిస్థాన్ కు ఎక్కడ విపరీతమైన హాని కలుగుతుందో ఆ ఏరియాను గుర్తించి మరీ తనదైన మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.

సియాల్‌కోట్‌లోని కీలక వైమానిక స్థావారాలపైనా అటాక్

ఈ ఆపరేషన్ ఎంతో సెటిల్డ్ గా ప్లాన్ చేసింది భారత్. ఇక్కడ అసలు వ్యూహం ఏంటంటే.. షాకింగ్ అటాక్ చేయాలి. కానీ ఆ విషయం పాక్ కి గానీ దాని వెనక చేరి గేమ్ ప్లాన్ చేస్తున్న చైనాకు గానీ కనీసం తెలీకూడదు. అలా దెబ్బ కొట్టాలి. అందులో భాగంగా భారత వైమానిక దళం.. పాకిస్థాన్ లోని 11 సైనిక స్థావరాలపై గురి పెట్టింది. ఈ లక్ష్యాల్లో రఫీకి, మురిద్, నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్ తో పాటు.. సియాల్‌కోట్‌లలోని కీలకమైన వైమానిక స్థావరాలనూ టార్గెట్ చేసింది భారత్.

భారత్ పాకిస్థాన్ ని నష్టపరిచిన మాట నిజమేనా? ఆధారాలేంటని చూస్తే.. అందుకు ఇదిగో ఈ ఉపగ్రహ ఛాయా చిత్రాలే సాక్ష్యం. భారత దాడుల్లో పేలిపోయిన హ్యాంగర్లు, దెబ్బ తిన్న ఎయిర్ స్ట్రిప్ లు కనిపించాయి. రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో రన్ వేపై భారీ గుంత ఏర్పడింది. ఇక పస్రూర్, చునియన్, అరిఫ్వాలాలో పాక్ వైమానిక రక్షణ రాడార్లు సైతం దెబ్బ తిన్నాయని తేటతెల్లమైంది. కేవలం దాడి చేయడం మాత్రమే కాకుండా.. ఆ నష్టం తాలూకూ ఉపగ్రహ చిత్రాలను సైతం తీసి చూపించింది భారత సైన్యం.

C-130 హెర్క్యులస్, IL-78 మిడ్-ఎయిర్ రీఫ్యూయలర్లు ఉండేది ఇక్కడే

ఈ దాడుల్లోని అసలు వ్యూహం ఏంటంటే రావల్పిండి దగ్గర్లోని చక్లాలాలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి. ఈ స్థావరం పాకిస్థాన్ రవాణా స్క్వాడ్రాన్లకు నిలయం. అంతే కాదు లాజిస్టికల్ ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలకు కీలకం. ఇక్కడే పాక్.. C-130 హెర్క్యులస్, IL-78 మిడ్-ఎయిర్ రీఫ్యూయలర్లు వంటి విమానాలను ఉంచింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. నూర్ ఖాన్ పాక్ అణ్వాయుధ సామాగ్రి పర్వవేక్షించే సంస్థ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉంటుంది.

కర్ణీ కొండల కింద పాక్ అణు నిల్వలు..

పాకిస్థాన్ ఇంతగా కాళ్లబేరానికి రావడానికి గల కారణం భారత్ ఎక్కడ పాక్ అణ్వాయుధమనే ఆయువు పట్టు మీద గురి చూసి కొడుతుందో అన్న భయమే. ఈ దిశగా న్యూయార్క్ టైమ్ ఒక కథనం రాసి అసలు విషయం బయట పెట్టింది. ఇక ఉపగ్రహ ఛాయా చిత్రాలు సైతం.. సర్గోధ లోని పాక్ వైమానిక స్థావరం రన్వే పై దాడి జరిగినట్టు చూపడంతో.. ప్రపంచమంతా ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఈ స్థావరం కర్ణీ కొండల కిందున్న భూగర్భ అణు నిల్వలుగల ప్రదేశాలతో అనుసంధానమై ఉంటుంది. నూర్ ఖాన్, సర్గోధాపై జరిగిన దాడులు కేవలం ప్రతీకార దాడులు మాత్రమే కాదు. ఇందులో ఒక వ్యూహం ఉంది. ఇక్కడగాని పాక్ ని ఇరుకున పెట్టగలిగితే.. మొత్తం వార్ గేమ్ ఛేంజ్ అయిపోతుందన్న విషయం భారత్ కి బాగా తెలుసు.. అందులో భాగంగానే భారత్ ఈ దిశగా పాక్ ని దెబ్బ తీసింది. అదే రోజు పాక్ ప్రధాని షెహబాజ్ దేశ అణ్వాయుధాలకు సంబంధించిన నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ తర్వాత ఈ సమావేశం జరిగిన విషయం తిరస్కరించినా.. ఇక్కడ భారత్ చేసిన దాడులైతే.. పాక్ సైనిక పాలనా యంత్రాంగం మొత్తాన్ని ఒణికించాయి. ఈ విషయంలో భారత్ విజయం సాధించినట్టే లెక్క.

పాక్ అణ్వాయుధ స్థావరాలపై దాడిని క్రాస్ చెక్ చేసిన యూఎస్

ఎప్పుడైతే.. భారత్, పాక్ అణ్వాయుధ శాలను లక్ష్యం చేసుకుందో.. వాషింగ్టన్ డీసీ ఉలిక్కి పడింది. వెంటనే ట్రంప్ పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. తమ నిఘా వ్యవస్థ ద్వారా క్రాస్ చెక్ చేశారు. విషయం నిజమని రూఢీ అయ్యింది. దీంతో.. హాట్ లైన్స్ ఆన్ చేశారు. పాక్ ప్యానిక్ సిట్యువేషన్ ని గుర్తించి భారత్ కి ఫోన్ చేశారు. మరీ ముఖ్యంగా గతంలో ఈ విషయం తమకు సంబంధం లేదన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత ప్రధానికి ఫోన్ చేసి.. తీవ్రత తగ్గించాలని, పాక్ తో నేరుగా చర్చలు జరపాలని కోరారు. ఇంతలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడారు.

వారు కాల్పులు జరపకుంటే మేమూ జరపమని భారత్ రియాక్షన్

ఈ కాల్పుల తర్వాత భారత్ నుంచి వచ్చిన స్పందన ఏంటంటే.. వారు కాల్పులు జరపకుంటే మేము కూడా జరపమని మన విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తర్వాత పాకిస్థాన్ డీజీ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్.. భారత్ డీజీని సంప్రదించి.. కాల్పుల విరమణ కోరారు. పాక్ నుంచి ఈ రియాక్షన్ రావడానికి ప్రధాన కారణం. భారత్ పాక్ కీలక వైమానిక స్థావరాలపై దాడి చేయడం. ఈ స్థావరాలు పాక్ అణ్వాయుధ నిల్వలకు దగ్గరగా ఉండటం.. ఇదే అత్యంత కీలకం. ఇక్కడే పాక్ ఇరకాటంలో పడి తమ పోరాటం ఆపాల్సి వచ్చింది. మరో మార్గం లేక.. వెంటనే దారికి రావల్సి వచ్చింది. దీంతో భారత్ అధిపత్యంలోకి వచ్చింది.

భారత్ పాక్.. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం పై ఇటు సాధారణ ప్రజలే కాదు అటు ప్రతిపక్ష నేతలకు కూడా ఒక అనుమానం. ఇందులో ట్రంప్ సర్కార్ అంతగా ఇన్వాల్వ్ కావల్సినంత అవసరమేంటి? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఆ నలభై ఎనిమిది గంటల పాటు పాక్ అనుభవించిన అణు భయం మొత్తాన్ని పరిశీలించాల్సిందేనా? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. అదేమిటో ఒక సునిశిత పరిశీలన.. మీ కోసం!

1999 నుంచీ.. భారత్- పాక్ మధ్య అణు భయం

ఒక్క F-16 కూల్చినా దాని ప్రభావం తీవ్రమన్న భావనభారత్ పాక్ మధ్య జరిగే యుద్ధం అణ్వాయుధ యుద్ధంగా మారుతుందన్న భయం ఈనాటిది కాదు. ఇది 1999లో బిల్ క్లింటన్ హయాం నుంచీ ఉంది. ఇది కేవలం వైమానిక దాడులతో సరిపోయేది కాదు. భారత్ కూడా సరిగ్గా దీన్నే సెంటర్ పాయింట్ గా చేసుకుని తన దాడులు చేసింది. పాకిస్థాన్ తన వైమానిక రక్షణ సదుపాయాలను పరిరక్షించుకోడానికి పాక్ భారత భూభాగంలోకి 300 నుంచి 400 డ్రోన్లను పంపిందని తెలిసిన రూబియో, వాన్స్ దిద్దుబాటు చర్యలకు దిగారని మొదట తెలిసింది. కానీ, వారి స్పందనకు అసలు కారణం లేటుగా తెలిసి వచ్చిందీ ప్రపంచానికి. భారత్ నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై దాడులు జరపటమే అసలు కారణం. ఎందుకంటే ఈ ప్రాంతం పక్కనే పాకిస్థాన్ అణు నిల్వలు దాగి ఉండటం ఆందోళనకరం.

సుమారు 170 అణ్వాయుధాలు ఇక్కడ నిల్వ?

నూర్ ఖాన్ వైమానిక స్థావరం.. రెండు రకాలుగా పాకిస్తాన్ కి అత్యంత కీలకమైనది. పాకిస్థాన్ రవాణా కేంద్రాల్లో ఎంతో ముఖ్యమైనది ఈ వైమానిక స్థావరం. గాలిలో ఇంధనం నింపడానికి కూడా వీలున్న స్థావరమిది. ఇక అణ్వాయుధ నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ హెడ్డాఫీస్ ఇక్కడికి దగ్గరగా ఉండటం మరో కీలకాంశం. దాదాపు 170 అణ్వాయుధాలు ఈ ప్రాంతంలో నిల్వ ఉన్నాయని అంటారు. ఈ ఒక్క స్థావరం కానీ పొరబాటున పేలితే.. పాక్ పట్టణాలకు పట్టణాలు కొట్టుకు పోతాయి. పాకిస్థాన్ ఉనికి ఏకంగా ప్రమాదంలో పడుతుంది. ఈ అణుధూళి భారత దేశానికి కూడా హానికరమే. అంతే కాదు భారత్- పాక్ మధ్య జరిగే అణు యుద్ధం ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో ఇప్పటికే ఎన్నో వార్ జర్నల్స్ గణాంకాలతో సహా అంచనా వేశాయి. మన యుద్ధ నిపుణులు చెప్పేదాన్ని బట్టీ చూస్తే.. ఈ అణు విస్ఫోటనం కొన్ని వందల ఏళ్ల పాటు.. పాకిస్థాన్ భూభాగాన్ని జనావాసానికి దూరమయ్యేలా చేస్తుంది. ఇంతటి విపత్తు దాగిన ప్రాంతమిది.

40 మంది పాక్ సైనికులు, 100కి పైగా ఉగ్రవాదులు హతం

ఏప్రిల్ 22 రెండున ఉగ్రవాదులు మతాన్ని గుర్తించి మరీ చేసిన ఈ ఉగ్రదాడి ఎంతో ప్రమాదకరమైనది.. దీని ప్రతీకారంగా మొదలైన ఆపరేషన్ సిందూర్.. ఒక వేళ అణు యుద్ధంగా మారితే.. ఆ నష్టం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదానికి జరిగిన నష్టం అపారమైనది. మన హిందూ పర్యాటకులను 26 మందిని బలి తీసుకున్న పాపానికి ఇప్పటికే పాకిస్థాన్ 40 మంది సైనికులు, వందకు పైగా ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకున్నారు. ఆరోజున ఉగ్రవాదులు వెళ్లి మీ మోడీకి చెప్పుకోండన్న మాటకు భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. మనకు జరిగిన ఈ ప్రాణ నష్టం.. పాకిస్థాన్ కి కేవలం ఉగ్రవాదుల ప్రాణాలు తీయడంతో మాత్రమే సరిపోలేదు. వేల కోట్లలో స్టాక్ నష్టం సంభవించింది. ఐఎంఎఫ్ పాకిస్థాన్ కోసం ఎంత బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించినా.. ఆ నష్టం భరించరానిది. ఈ నష్టాన్ని నాలుగు అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల ముందు బిచ్చమెత్తుకుని ఎలాగోలా పూడ్చుకోవచ్చుగానీ.. అణు నష్టం సంభవిస్తే మాత్రం.. ఏకంగా ఆ దేశ ఉనికికే ప్రమాదకరం.

అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని పాక్ సంకేతం

ఈ విషయం గుర్తించిన పాకిస్థాన్ వెంటనే భారత్ తో రాజీకి దారి వెతికింది. తమ దగ్గర సాధారణ ఆయుధాలు అయిపోయాయనీ.. అణ్వాయుధాలు మాత్రమే మిగిలి ఉన్నాయన్న ఇండైరెక్ట్ మెసేజ్ పాస్ చేసింది. ఈ మెసేజ్ లోని లోతు పాతులను పసిగట్టిన అమెరికా తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇటు పాకిస్థాన్ ప్రధాని కూడా అణ్వాయుధ నిర్వహణ బాధ్యతలను చూసే నేషనల్ కమాండ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. నలుగురు సీనియర్ మంత్రులు, ఇతర సైనికాధికారులతో ఈ సమావేశం జరిగింది.

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసేలా తీర్మానం

2 వేల సంవత్సరంలో ఏర్పడ్డ.. ఈ సంస్థకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే అణ్వాయుధాలు ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించేవి కావు. కానీ దీని ప్రభావం మాత్రం ఎంతో తీవ్రతరం. వీరిని సమావేశమయ్యేలా చేసింది మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. కారణమేంటంటే.. భారత్ చేసిన దాడుల కారణంగా పాక్ అణ్వాయుధ నిల్వలకు ప్రమాదం జరిగితే.. అసలుకే మోసం వస్తుంది. దేశానికి దేశమే కాలగర్భంలో కలిసిపోతుందన్న ఆందోళన కొద్దీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ సమావేశం ద్వారా వీరు తీసుకున్న తొలి నిర్ణయం.. భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం. అమెరికాను ఇన్వాల్వ్ చేసైనా సరే ఈ దిశగా పయనించడం.

అణ్వాయుధ శక్తుల ఢీ కొట్టుకోవడంతో ప్రమాదకరం-వాన్స్

భారత్ పాక్ అణ్వాయుధశాలకు దగ్గరగా చేసిన దాడులపై పెంటగాన్ లోనూ చర్చలు సాగాయి. ఇక ఇస్లామాబాద్ ని ఢిల్లీని కలిపే సమయం ఆసన్నమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేవలం ఈ రెండు దేశాలు చేసే బహిరంగ ప్రకటనలతో సరిపోదు. ఇటు భారత్ ని అటు పాక్ ని వారి వారి దగ్గర దేశాల ద్వారా చెప్పించి మరీ ఈ దాడులకు ఇక్కడితో స్వస్థి పలకాలని నిర్ణయించింది అమెరికా. దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైమానిక దాడుల వరకూ అయితే పర్లేదు కానీ, అణు శక్తులు ఢీకొట్టుకునే వరకూ పరిస్థితి రావడం ఆందోళన కరంగా చబుతారు ఉపాధ్యక్షుడు వాన్స్. ఇందుకోసమే తాము రంగంలోకి దిగామనీ.. ఆయా శక్తుల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరచడమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఒక మీడియా సంస్థతో చెప్పారు ఉపాధ్యక్షుడు వాన్స్.

పహెల్గాం దాడికి సంబంధించిన లష్కరే తోయిబా దాని ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుంది భారత్. తాము ఈ దిశగా మాత్రమే తమ ఆపరేషన్ సిందూర్ ప్లాన్ చేశామని కూడా ప్రకటించింది. కానీ ఇలాంటి విషయాలలో కనీస పరిజ్ఞానం, పరిపాలనా నీతి లేని పాకిస్థాన్ కట్టు తప్పింది. భారత్ కి సంబంధించిన పౌర నివాసాలు, ప్రార్ధనాలయాలను టార్గెట్ చేసింది. టర్కీ, చైనా దేశాల ద్వారా దిగుమతి చేసుకున్న డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఒళ్లు మండిన భారత సైన్యం.. తమ ఆపరేషన్ పరిధి విస్తరించింది. పాక్ ని కీలెరిగి వాత పెట్టాలన్న దృఢనిశ్చయానికి వచ్చి ఆ దిశగా తన దాడులను ముమ్మరం చేసింది.

డైరెక్ట్‌గా మోడీకే ఫోన్ చేయాలని నిర్ణయించిన వాన్స్

రెండు వారాల ముందే వాన్స్ తన భారత పర్యటన ముగించుకుని వచ్చారు. ఆయన సతీమణి ఉష భారతీయ మూలాలున్నవారు. ఈ బంధుత్వం కొద్దీ వాన్స్ చొరవ తీసుకుని డైరెక్ట్ మోడీకే ఫోన్ చేయాలని నిర్ణయించారు. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా రూపాంతరం చెందితే.. హింస మరింత పెరిగే అవకాశముందని తదుపరి చర్యలకు ఉపక్రమించింది యూఎస్. అందులో భాగంగా వాన్స్ మోడీకి చెప్పాల్సినదంతా చెప్పారు. మోడీ అంతా విన్నారు కానీ.. దేశవాసుల డిమాండ్లను బట్టీ తన నిర్ణయాలను ప్రకటించారు.

Also Read: భారత్ బాంబులు ఫర్ సెల్..

ఇటు మార్క్ రూబియో సైతం జనరల్ మునీర్ తో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన అనుభవజ్ఞుడు కావడంతో.. వ్యవహారం సులభతరమైంది. గత పాతికేళ్లుగా వైట్ హౌస్ పాక్ తో వ్యవహరించిన తీరునుబట్టీ చూస్తే అక్కడి సైన్యానికి ఒక దిక్సూచిగా పని చేస్తూనే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గత జనవరిలో రూబియో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ విదేశాంగ మంత్రి దార్ ని సైతం కలిశారు. ఆ పరిచయాలతో వారిని శాంతిప చేసే బాధ్యతలను తీసుకున్నారు. నిరంతర సంభాషణలు జరిపి కాల్పుల విరమణకు ఎట్టకేలకు ఒప్పించారు.

మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకంగా 48 గంటలు

ఈ మొత్తం వ్యవహారంలో 48 గంటలు అత్యంత కీలకంగా పని చేశాయి. అమెరికా నుంచి జాతీయ భద్రతా సలహాదారు కూడా అయిన రూబియో, ఉపాధ్యక్షుడు వాన్స్ ఇవురూకీలకంగా పనిచేశారు. ఎట్టకేలకు భారత్- పాక్ మధ్య కాల్పుల ఒప్పందం జరగటంతో పలువురు వీరి కృషిని అభినందిస్తున్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన ట్రంప్ కి తన కృతజ్ఞతలు చెప్పారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×