TGSRTC Md Sajjanar About Zero Ticket: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కానీ, రకరకాల సాకులు చూపించి బస్సు కండక్టర్లు మహిళల నుంచి టికెట్ల కోసం డబ్బులు వసూళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాన్ని ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
అప్పట్లో ఆధార్, ఓటర్ ఐడీతో ఉచిత ప్రయాణం
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన కొత్తలో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సహా ప్రభుత్వం జారీ చేసిన ఏ గుర్తింపు కార్డు ఉన్నా జీరో టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, కేవలం ఆధార్ కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని కండక్టర్లు మెలికపెట్టారు. అంతేకాదు, ఆ ఆధార్ కార్డు కూడా అప్ డేట్ అయి ఉండాలని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అప్ డేట్ ఆధార్ లేని వారిలో కొందరిని బస్సులు దింపారు. మరికొంత మంది నుంచి టికెట్ కోసం డబ్బులు వసూళు చేశారు. ఇదే విషయాన్ని తాజాగా ఓ నెటిజన్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఆధార్ అప్ డేట్ అయి ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు.
జీరో టికెట్ గురించి సజ్జనార్ ఏం చెప్పారంటే?
రీసెంట్ గా ముదావత్ రమేష్ నాయక్ అనే వ్యక్తి… ఉచిత బస్సు ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ ను ఓ ప్రశ్న అడిగారు. “తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు ఉండే సరిపోతుందా? కచ్చితంగా ఆధార్ అప్ డేట్ కావాలా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ఆధార్ ఒక్కటే కాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇతర గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించి జీరో టికెట్ ను తీసుకోవచ్చు. మహిలక్ష్మి- మహిళలకు ఉచిత రవాణా సదుపాయం స్కీమ్ అమలుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదు” అని వెల్లడించారు.
Plz @TSRTC తెలంగాణాలో మహాలక్ష్మి పథకంలో బాగంగా మహిళలకు '0' టికెట్ కోసం ఆధార్ ఉంటే చాల..? ఖచ్చితంగా అప్డేట్ ఆధార్ కావాలా..?
Plz Conform @SajjanarVC Sir
— Mudavath Ramesh Nayak (@RameshMudavath5) May 8, 2025
సో, ఇక మీదట మహిళలు బస్సు ప్రయాణం చేసే సమయంలో ఏ కండక్టర్ అయినా, ఓటర్ ఐడీ చెల్లదు. ఆధార్ అప్ డేట్ ఉండాలని చెప్తే, సజ్జానార్ చెప్పిన విషయాన్ని చెప్పేయండి. అప్పుడు మాట మాట్లాడకుండా జీరో టికెట్ ఇస్తారు. అప్పటికీ ఇవ్వలేదంటే.. సంబంధిత డిపోలో కంప్లైంట్ చేస్తే, సదరు కండక్టర్ మీద చర్యలు తీసుకుంటారు.
Read Also: రైలుకు వేలాడుతూ మహిళల ప్రయాణం, నెట్టింట వీడియో వైరల్!