Flight Safety Tips: ప్రపంచంలో విమాన ప్రయాణం అత్యంత భద్రమైన రవాణా మార్గాల్లో ఒకటి. కానీ ఒక్కోసారి అనుకోని విధంగా జరిగే విమాన ప్రమాదాలు పెద్ద విషాదకారణంగా మారతాయి. తాజాగా జరిగిన అహ్మదాబాద్ AI – 171 విమాన ప్రమాదం మనందరికీ ఒక గట్టిపాఠం చెబుతోంది. గగనంలో నిశ్శబ్దంగా ఎగిరే విమానం ఒక్కసారిగా భూమిని తాకి, మంటల్లో మునిగితే.. ప్రయాణికులకు ఎంతటి విషాదం కలుగుతుందో ఊహించడమే కష్టం. అయితే, ఈలాంటి ప్రమాదాల్లో కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణాలను రక్షించుకునే అవకాశం పెరుగుతుంది.
విమానం ఎక్కే ముందు తెలుసుకోవలసినవి
ప్రయాణించే ముందు విమానంలో ఉన్న ఎమర్జెన్సీ గైడ్, సీటు వెనుక ఉన్న సేఫ్టీ కార్డ్ ని పూర్తిగా చదవడం అలవాటు చేసుకోండి. మీ సీటు నుంచి అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో గుర్తుంచుకోండి. ఏ పక్కన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో, అక్కడి దిశను ముందుగానే గమనించండి.
బెల్ట్ విషయంలో అలసత్వం వద్దు
విమానం టేకాఫ్, ల్యాండింగ్, లేదా తుపానుల సమయంలో సీట్ బెల్ట్ ఫాస్టెన్ సూచన వస్తుంది. కానీ చాలా మంది ప్రయాణికులు దీన్ని సీరియస్‌గా తీసుకోరు. అయితే విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యే సమయంలో బెల్ట్ ధరించకపోతే ప్రయాణికుడు ముందు సీటును ఢీకొని తీవ్ర గాయాలపాలవుతాడు. అందుకే విమానం పూర్తిగా ఆగే వరకు బెల్ట్ ధరించాలి.
సీటు ఎంపిక కూడా కీలకం
ప్రమాదాల సమయంలో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకే ఎక్కువగా ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయన్నది కొన్ని అధ్యయనాల ద్వారా తేలింది. ముఖ్యంగా విమానం రెక్కల వెనుకభాగంలో కూర్చోవడం సురక్షితమని నిపుణుల అభిప్రాయం.
షూ, దుస్తుల ఎంపిక
విమాన ప్రయాణానికి వెళ్తూ హైహీల్స్, కాటన్ డ్రస్సులు, గ్లామరస్ వేర్ కంటే స్కిన్‌ను కవర్ చేసే బూట్లు, పూర్తిచొక్కాలు, దట్టమైన ఫ్యాబ్రిక్ ఉన్న దుస్తులు వేసుకోవడం మంచిది. ప్రమాదం జరిగినప్పుడు మంటలు, గాజు ముక్కలు, లోహపు భాగాల నుంచి రక్షణ అవసరం.
బ్రేస్ పోజిషన్ నేర్చుకోవాలి
ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పైలట్ ఇచ్చే సూచనల్లో ముఖ్యమైనది బ్రేస్ పోజిషన్. ఇది మీరు ముందుగా తలను మొండెం మధ్య పెట్టి చేతులతో తల కప్పుకోవడం. ఇది శరీరంపై గాయాల తీవ్రత తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆక్సిజన్ మాస్క్ వాడే విధానం తెలుసుకోవాలి
విమాన కేబిన్ ప్రెషర్ తగ్గినప్పుడు ఆక్సిజన్ మాస్క్ బయటకు వస్తుంది. చాలా మంది భయంతో గందరగోళానికి గురవుతారు. కానీ ముందుగా మాస్క్ తీసుకుని మీ ముక్కుపై సరిగ్గా పెట్టాలి. పిల్లలు ఉంటే ముందుగా మీరు మాస్క్ పెట్టుకుని, తర్వాత వారిని సహాయపడాలి.
లైట్ బ్యాగ్, ఇల్లు గుర్తుంచుకోండి
ప్రమాద సమయంలో వెనక్కి వెళ్లి మీ లగేజీ తీసుకోవడం పెద్ద తప్పు. ప్రతీ సెకను విలువైనది. అందుకే చేతిలోని చిన్న పర్సే తీసుకోవడం మంచిది. విమానం లోపల ఎమర్జెన్సీ లైట్స్ ఎటు చూపుతున్నాయో గమనించి, అదే దిశగా బయటకు రావాలి.
Also Read: Ahmedabad air crash: విమానం క్రాష్ రహస్యాలు? అహ్మదాబాద్ లో అసలేం జరిగింది?
మంటలు అయితే ఎలా?
విమానంలో మంటలు చెలరేగితే, మీ ముఖాన్ని గుడ్డతో కప్పుకోవాలి. తక్కువగా వంగి నడవాలి. పొగ ఎక్కువగా పైభాగంలో ఉంటుంది కాబట్టి, నేలకికి దగ్గరగా ఉండటం శ్వాసకోశానికి కష్టాన్ని తగ్గిస్తుంది.
తప్పనిసరిగా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టాలి
ప్రమాద సమయంలో మీ మొబైల్ ఫోన్ జీపీఎస్ ద్వారా ఎమర్జెన్సీ సర్వీసులు మీను ట్రాక్ చేయవచ్చు. కనీసం ఫోన్‌ను శక్తిమంతంగా flight mode లో వేసి దాచుకోండి. దానివల్ల బాధితుల ప్రొఫైల్, ఫోటో, స్థానం తదితర సమాచారం బయటపడే అవకాశం ఉంటుంది.
మొదటి 90 సెకన్లు.. గోల్డెన్ టైం
విమాన ప్రమాదంలో బయటపడే వారికి అత్యంత కీలకమైన సమయం.. మొదటి 90 సెకన్లు. ఈ టైంలో హడావుడి కాకుండా ముందు తెలివిగా స్పందించిన వారు గట్టిగా బయటపడతారు. అందుకే ముందుగానే మానసికంగా సిద్దంగా ఉండటం అవసరం. విమాన ప్రమాదం అనేది ఎవ్వరూ కోరుకోనిది. కానీ ప్రమాదం సంభవించే అవకాశం 0.00001% అయినా ఉండే పరిస్థితుల్లో, మనం ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలు మన ప్రాణాలను కాపాడగలవు. AI-171 విమాన ప్రమాదం నిండా విషాదంగా ముగిసినా, అది మనకు ముందు జాగ్రత్తల విలువను గుర్తుచేస్తోంది. ప్రాణాలకు రక్షణ ముందుగా మన చేతుల్లోనే ఉంది!