Indian Railways: భారతీయ రైల్వే మరో మైల్ స్టోన్ అందుకోబోతోంది. జమ్మూకాశ్మీర్ తో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడుకున్న రైల్వే లైన్ గా ఈ ప్రాజెక్టు గుర్తింపు తెచ్చుకుంది. కాశ్మీర్, దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య రైలు కార్యకలాపాలను మరింతగా మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ రైల్వే లింక్ ను ప్రారంభించనుంది. మొత్తంగా 5 వందేభారత్ స్లీపర్ రైళ్లతో పాటు ఓ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.
రైళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు
జమ్మూకాశ్మీర్ వెళ్లే రైల్వే ప్రయాణీకుల ఎయిర్ పోర్టు తరహాలో చెకింగ్స్ నిర్వహించనున్నారు. ప్రయాణీకులు, రైళ్ల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రైల్వే భద్రతా అధికారులు నిర్ణయించారు. జనవరి 5న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గంలోని కత్రా-రియాసి సెక్షన్ లో తుది రైల్వే ట్రయల్స్ జరగనున్నాయి. వచ్చే నెల నుండి కాశ్మీర్ లోయకు రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోడీ USBRL ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అదే సమయంలో న్యూఢిల్లీ-శ్రీనగర్ స్లీపర్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
కత్రా-రియాసి సెక్షన్‌లో కార్గో లోడెడ్ రైలు ట్రయల్ రన్
ఇక తాజాగా కత్రా-రియాసి సెక్షన్‌లో కార్గో లోడెడ్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. అంచనాలకు అనుగుణంగా రైలు పరుగులు తీసినట్లు అధికారులు గుర్తించారు. “వచ్చే నెలలో USBRL ప్రాజెక్టు మీదుగా రైలు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాం. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే కనెక్టివిటీ పూర్తవుతుంది” అని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: వందేభారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్, పట్టాలు ఎక్కేది అప్పుడేనా?
జనవరి 26 నుంచి రైల్వే సేవలు ప్రారంభం
దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు జనవరి 26న ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. ప్రధాని మోడీ ఈ రైలును న్యూఢిల్లీలో ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. అటు USBRL ప్రాజెక్టు కూడా అదే రోజు ప్రారంభం కానున్నది. ముందుగా USBRL ప్రాజెక్టు ఓపెన్ చేసిన తర్వాత, వందేభారత్ స్లీపర్ రైలు సేవలను ప్రారంభించనున్నారు. USBRL ప్రాజెక్టుకు సున్నితమైన ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న నేపథ్యంలో భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణీకులతో పాటు వారి వెంట ఉన్న లగేజీని అధికారులు క్షుణంగా తనికీ చేయనున్నారు. ఆయా రైల్వే స్టేషన్లలో విమానాశ్రయం తరహాలో చెకింగ్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక వందేభారత్ స్లీపర్ రైలు జమ్మూకాశ్మీర్ లోని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకుసాగనుంది. రైలు చక్రాలు, బ్రేకులతో పాటు పట్టాలపై మంచు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని తొలగించుకుని వెళ్లేలా హీటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. పలు రకాల భద్రతా ఫీచర్లను ఇందులో ఇన్ స్టాల్ చేశారు.
Read Also: కేబుల్ బ్రిడ్జిపై రైలు.. చరిత్రలో ఇదే తొలిసారి, వీడియో చూస్తే మైండ్ బ్లాకే!