E-Paper
Advertisement

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
Advertisement

India’s First Bullet Train: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత బుల్లెట్ రైలు ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయ్యింది. తొలి హైస్పీడ్ రైలు సర్వీసు 2027లో ప్రారంభం కానుంది. తొలుత గుజరాత్‌లోని సూరత్ నుంచి వాపి మధ్య ఈ రైలు పరుగులు తీయబోతోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు కారిడార్‌ లో భాగంగా ఈ సర్వీసులను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

సూరత్-వాపి మధ్య తొలి రైలు పరుగులు

మొదట సూరత్-బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మార్గంలో బుల్లెట్ రైలును ప్రారంభించాలని భావించారు. అయితే, తాజాగా ఈ మార్గాన్ని వాపి వరకు పొడిగించారు. దీంతో తొలి దశలో సుమారు 100 కిలోమీటర్ల మేర రైలు పరుగులు పెట్టనుంది. ఈ మార్గంలో సూరత్, బిలిమోరా, వాపి స్టేషన్లు ఉంటాయి. మొత్తం 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి నగరాలు ఈ రూట్ తో లింక్ కానున్నాయి.

భారత్‌లోనే తయారవుతున్న బుల్లెట్ రైలు

Advertisement

ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి రైళ్లను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. BEML సంస్థ బెంగళూరులోని ప్లాంట్‌లో B28 పేరుతో ఎనిమిది కోచ్‌ల రైలు సెట్లను రూపొందిస్తోంది. మొత్తం రెండు రైలు సెట్ల తయారీకి కాంట్రాక్టు ఇచ్చారు. ఈ రైలు సుమారు 557 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఇందులో ఏడు స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం రిక్లైనింగ్ సీట్లు, ఛార్జింగ్ పాయింట్లు, విశాలమైన కిటికీలు, లగేజీ స్టోరేజ్ లాంటి  సదుపాయాలు కల్పించనున్నారు.

గంటకు 280 కిలోమీటర్ల వేగం!

B28 రైలును గంటకు గరిష్టంగా 280 కిలోమీటర్ల వేగంతో పరీక్షించేలా రూపొందిస్తున్నారు. ఆపరేషనల్ వేగాన్ని గంటకు 249 కిలోమీటర్లుగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. రైలు తయారీ, టెస్టింగ్ పూర్తయిన తర్వాత 2027 మే-జూన్ సమయంలో ట్రాక్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది.

ఇప్పటికే పూర్తయిన కీలక పనులు

Advertisement

ముంబై-అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2026 సెప్టెంబర్ నాటికి 456 కిలోమీటర్ల పిల్లర్ల నిర్మాణం, 371 కిలోమీటర్ల వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి. 9,300కు పైగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది స్టేషన్లలో సివిల్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. రీసెంట్ గా సూరత్-బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మేర ఓవర్‌ హెడ్ విద్యుత్ వ్యవస్థకు విద్యుత్ సరఫరాను కూడా ప్రారంభించారు.

ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల్లో!

పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణ సమయం సుమారు 1 గంట 58 నిమిషాలకు తగ్గనుంది. రానున్న రోజుల్లో ఈ రూట్ లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని రైల్వ భావిస్తోంది.

Read Also: అరకు రైల్వే మార్గం వెనుక ఆసక్తికర కథ.. మన కోసం కాదు, జపాన్ కోసం నిర్మించారా?

Tags

Related News

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

అరకు రైల్వే మార్గం వెనుక ఆసక్తికర కథ.. మన కోసం కాదు, జపాన్ కోసం నిర్మించారా?

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?

పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

కిటికీలో నుంచి చూస్తే స్వర్గమే.. జీవింతంలో ఒక్కసారైన చూడాల్సిన 5 అద్భుతమైన రైలు మార్గాలు!

రాత్రి అయితే చాలు.. ఈ ప్రదేశాలు మరో ప్రపంచంలా మారిపోతాయి!

రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు? దీని వెనుక మ్యాజిక్ ఏంటి? ఓతూరి తెలుసుకుంటే పోలా!

Big Stories

Advertisement
×