E-Paper
Advertisement

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!
Advertisement

Seattle Airport: అమెరికాలోని సియాటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న విమానం వెలుపల ఇమిగ్రేషన్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. విమానం ఎక్కే వంతెన (జెట్ బ్రిడ్జి) పైకి ఒక్కసారిగా దూసుకొచ్చిన అధికారులు.. ఇద్దరు ప్రయాణికులను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మాస్క్ లు ధరించి ఉండటంతో ఏం జరుగుతుందో అర్ధంకాక ఇతర ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దీంతో లాస్ ఏంజెల్స్ వెళ్లాల్సిన సదరు అలస్కా ఎయిర్ లైన్స్ విమానం ఆలస్యంగా బయలు దేరింది.

అసలేం జరిగిందంటే?

అలస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లోకి ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సాధారణ దుస్తుల్లో ముసుగులు ధరించిన అధికారులు.. జెట్ బ్రిడ్జిపైకి వచ్చి ఓ మగ వ్యక్తితో పాటు మహిళను బలవంతంగా తీసుకెళ్లడం ప్రారంభించారు. ఆ సమయంలో సదరు మహిళ అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డ దృశ్యాలు వైరల్ గా మారాయి. చుట్టూ లగేజీ బ్యాగులతో నిల్చున్న ప్రయాణికులకు తన బాధను పంచుకుంటూ ఆమె ఆవేదనకు గురయ్యారు. ‘నా తండ్రిని తీసుకెళ్తున్నారు. ఆయనకి వర్క్ పర్మిట్ ఉంది’ అంటూ బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వీడియోలో చూడవచ్చు.

Advertisement

అధికారుల వివరణ ఇదే

ఈ ఘటనపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) విభాగం స్పందించింది. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా నివసిస్తున్న ఓ మెక్సికో జాతీయుడ్ని పట్టుకునేందుకు తాము ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే అతడ్ని చెక్ చేస్తున్న క్రమంలో ఆయన పక్కనే ఉన్న సోఫియా హెర్నాండెజ్ మెజియా (కూతురు) అనే మహిళ అధికారులపై వేడి కాఫీ చల్లిందని ఆరోపించింది. విచారణలో ఆమె కూడా మెక్సికోకు చెందిన అక్రమ వలసదారురాలని.. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటోందని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఐసీఈ వివరణ ఇచ్చింది. కాగా, ఫెడరల్ అధికారిపై దాడి చేసినందుకు సదరు మహిళపై కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ పోర్టు అధికారుల అభ్యంతరం

Advertisement

ఈ ఆకస్మిక దాడిపై అలస్కా ఎయిర్‌లైన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇలా వ్యవహరించారని సంస్థ పేర్కొంది. ఈ ఘటన తమ సిబ్బందిని, ప్రయాణికులను ఎంతో కలవరపాటుకు గురిచేసిందని పేర్కొంది. ప్రయాణికులను గౌరవంగా చూసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. బాధిత వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించారా? లేదా? అనే దానిని తాము కూడా పరిశీలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: కాంగ్రెస్‌లో సిరాజ్ చిచ్చు.. సొంత పార్టీ నేతకే.. ఎంపీ ముంతాజ్ పటేల్ చురకలు!

వాషింగ్టన్ గవర్నర్ తీవ్ర ఆగ్రహం..

ఈ ఘటనపై వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐసీఈ అధికారుల తీరు అత్యంత అమానుషమని.. ఆ వీడియో చూస్తుంటేనే భయమేస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ విభాగాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మానవత్వంతో కూడిన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ కావాలని అన్నారు. అంతేకాకుండా సదరు అధికారులు జెట్ బ్రిడ్జిలోకి ఎలా ప్రవేశించారనే దానిపై కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. పోలీసు, అధికారులు డ్యూటీలో ఉండగా మాస్క్ ధరించకూడదంటూ తాను మార్చిలోనే చట్టం చేశానని.. దానిని పూర్తిగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!

Tags

Related News

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

అరకు రైల్వే మార్గం వెనుక ఆసక్తికర కథ.. మన కోసం కాదు, జపాన్ కోసం నిర్మించారా?

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?

పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

కిటికీలో నుంచి చూస్తే స్వర్గమే.. జీవింతంలో ఒక్కసారైన చూడాల్సిన 5 అద్భుతమైన రైలు మార్గాలు!

Big Stories

Advertisement
×