E-Paper
Advertisement

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్
Advertisement

Solo Trip Destinations| ఎప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యులతోనే ప్రయాణం చేయాలనే నియమం లేదు. ఒక్కోసారి మనకు మనమే తోడుగా కొత్త ప్రదేశాలను చూడటం కూడా ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. నచ్చిన చోటుకు వెళ్లడం, ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడం, ప్రకృతి అందాలను మనసారా చూడటం.. ఇవన్నీ సోలో ట్రావెలింగ్‌లో లభించే మధురమైన అనుభవాలు. అయితే, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి ప్రయాణానికి భారత్‌లో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మరి మీ తదుపరి సోలో ట్రిప్ కోసం ఎంచుకోదగిన ఏడు అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఉదయ్‌పూర్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ అందమైన సరస్సులు, రాజభవనాలు, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఒంటరిగా ప్రయాణించే వారు సిటీ ప్యాలెస్, పిచోలా సరస్సు సందర్శించవచ్చు. స్థానిక మార్కెట్లు, కేఫ్‌లు, పురాతన ఆలయాలు కూడా చూడవచ్చు.

రాజస అనుభూతి కోసం జైపూర్

Advertisement

పింక్ సిటీగా పేరొందిన జైపూర్ సోలో ట్రావెలర్స్‌కు మంచి ఆప్షన్. ఇక్కడ హవా మహల్, అమెర్ కోట వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. స్థానిక మార్కెట్లలో షాపింగ్ చేస్తూ రాజస్థానీ వంటకాలు ఎంజాయ్ చేయండి. అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్యటనకు అనుకూలమైన సమయం.

ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు మున్నార్

కేరళలోని మున్నార్ పచ్చని టీ తోటలు, కొండలు, జలపాతాలకు ప్రసిద్ధి. ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి ఇది మంచి గమ్యస్థానం. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హోమ్‌స్టేలలో బస చేయడానికి సౌలభ్యం ఉంది.

హిమాలయ అందాలు చూసేందుకు సిక్కిం

Advertisement

సిక్కిం పర్వతాలు, బౌద్ధ మఠాలు, అందమైన ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. గ్యాంగ్‌టక్‌లోని స్థానిక మార్కెట్లు, మఠాలు సందర్శించడానికి మంచి ట్రావెల్ డెస్టినేషన్స్. మార్చి నుంచి మే, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పర్యటనకు అనుకూలమైన సమయం. మారుమూల ప్రాంతాలకు వెళ్లేముందు అనుమతులు, రహదారి పరిస్థితులు తెలుసుకోవాలి.

పచ్చని ప్రకృతిని ఆస్వాదించడానికి మేఘాలయ

జలపాతాలు, పచ్చని కొండలు, ప్రకృతి అందాలను ఇష్టపడేవారికి మేఘాలయ చక్కని ఎంపిక. షిల్లాంగ్, చిరపుంజి, లివింగ్ రూట్ బ్రిడ్జిలను సందర్శించవచ్చు. డావ్కీలో స్వచ్ఛమైన నీటిలో బోటింగ్ చేయవచ్చు. వర్షాలు, వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి.

Also Read: పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

ప్రశాంతంగా గడపడానికి పుదుచ్చేరి

ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారికి పుదుచ్చేరి మంచి గమ్యస్థానం. ఇక్కడ ఫ్రెంచ్ తరహా భవనాలు, అందమైన వీధులు, బీచ్‌లు ఆకట్టుకుంటాయి. వైట్ టౌన్, ప్రొమెనేడ్ బీచ్, ఆరోవిల్ ప్రాంతాలు చూసేందుకు అద్భుతంగా ఉంటాయి.

రిషికేశ్‌లో మనశ్శాంతి

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఆధ్యాత్మికత, యోగా, సాహస క్రీడలకు ప్రసిద్ధి. ఇక్కడ గంగా హారతి చూడవచ్చు. యోగా, ధ్యానం కూడా చేయండి. సరైన సీజన్‌లో వెళితే రివర్ రాఫ్టింగ్ కూడా ఆస్వాదించవచ్చు.

Also Read: ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా? ఈ 4 తప్పులు చేస్తే ప్రమాదమే

సోలో ట్రిప్‌కు వెళ్లేముందు ఈ జాగ్రత్తలు పాటించండి

  •  ప్రయాణానికి ముందే ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోండి.
  •  మంచి రేటింగ్స్ ఉన్న హోటల్స్ ఎంచుకోండి.
  •  మీ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకోండి.
  •  రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి.
  •  అత్యవసర ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోండి.
  •  స్థానిక ప్రయాణ సూచనలు, భద్రతా మార్గదర్శకాలు పాటించండి.

Related News

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

అరకు రైల్వే మార్గం వెనుక ఆసక్తికర కథ.. మన కోసం కాదు, జపాన్ కోసం నిర్మించారా?

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?

పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

కిటికీలో నుంచి చూస్తే స్వర్గమే.. జీవింతంలో ఒక్కసారైన చూడాల్సిన 5 అద్భుతమైన రైలు మార్గాలు!

రాత్రి అయితే చాలు.. ఈ ప్రదేశాలు మరో ప్రపంచంలా మారిపోతాయి!

Big Stories

Advertisement
×