Honda X-ADV: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న X-ADV అడ్వెంచర్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 11.90 లక్షల ధరతో, X-ADV అడ్వెంచర్ బైక్ అట్రాక్టివ్ గా.. సౌకర్యవంతంగా కనిపిపిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు మన దేశంలో రిలీజ్చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. కస్టమర్ డెలివరీలు జూన్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.
రైడింగ్ అనుభవం..
ఎక్స్-ఏడీవీ బలమైన ట్యూబులార్ స్టీల్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి రహదారి పరిస్థితులను తట్టుకునేలా తయారుచేశారు. మెరుగైన రైడింగ్ సౌకర్యం కోసం అడ్జస్టబుల్ స్ప్రింగ్ ప్రీలోడ్‌తో ఫ్రెంట్ లో 41 ఎంఎం యుఎస్డీ ఫోర్కులు, బ్యాక్ సైడ్ మోనోషాక్ ను అమర్చారు. ఈ బైక్ 17-అంగుళాల ముందు, 15-అంగుళాల వెనుక వైర్-స్పోక్ వీల్స్ కలిగి ఉంటుంది. బైక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫ్రెంట్ లో 296 మిమీ డిస్క్‌లతో డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్-పిస్టన్ కాలిపర్, బ్యాక్ సైడ్ 240 మిమీ డిస్క్ తో సింగిల్ పిస్టన్ కాలిపర్, డ్యూయల్-ఛానల్ ఎబీఎస్‌తో సపోర్ట్ చేస్తుంది.
యూఎస్‌బీ-సీ ఛార్జర్ సౌకర్యం..
22-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌లో USB-C ఛార్జర్ సౌకర్యం కూడా ఉంటుంది. సీటు మెరుగైన ప్యాడింగ్, తక్కువ రీచ్‌తో రూపొందించారు. మెరుగైన సౌకర్యం, ప్రాప్యతను నిర్ధారిస్తుంది. కస్టమర్లు పెర్ల్ గ్లేర్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ల మధ్య ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్-ఏడీవీలో లిక్విడ్ కూల్డ్ 745 సీసీ, ట్విన్ సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది 6,250 ఆర్‌పీఎమ్ వద్ద 54 బిహెచ్ పి పవర్, 4,750 ఆర్ పిఎమ్ వద్ద 68 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.
ఫీచర్లు..
X-ADV లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 5-అంగుళాల TFT డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో రైడింగ్ సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, మరియు గ్రావెల్ వంటి రైడింగ్ మోడ్‌లు వివిధ రహదారి పరిస్థితులకు అనుగుణంగా రైడింగ్ అనుభవాన్ని సర్దుబాటు చేస్తాయి. బైక్ వెయిట్ 238 కిలోలు ఉంటుంది. 13-లీటర్ ఇంధన ట్యాంక్, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు దీనిని లాంగ్-డిస్టెన్స్ రైడింగ్‌కు అనువైనదిగా చేస్తాయి.
Also Read: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.55,000 జీతం, ఈ అర్హత ఉంటే ఎనఫ్
ఇంజన్, పని తీరు..
X-ADV లో 745 cc లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 8-వాల్వ్, SOHC ప్యారలల్ ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 58.6 హార్స్‌పవర్ (43.1 kW) ,69 Nm టార్క్‌ను 6,750 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. హోండా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఈ స్కూటర్‌కు ప్రత్యేకతనిస్తుంది. ఇది ఆటోమేటిక్ మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ ఆప్షన్లను అందిస్తుంది, రైడింగ్‌ను సులభతరం చేస్తుంది.
బైక్ ధర
భారతదేశంలో X-ADV 2025 మోడల్ ధర ఎక్స్-షోరూమ్ హర్యానాలో ₹11.90 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
Also Read: AVNL Recruitment: ఏవీఎన్‌ఎల్‌లో 1805 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే చాలు