భారత్ తో బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉంది ఇరాన్. అందమైన ఆ దేశం వేల ఏళ్ల నాగరికతను కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే నాగరికత మొదలైన తొలి దేశాలలో ఇరాన్ ఒకటి. పర్షియాతో ప్రత్యేక సంబంధాలతో పాటు చారిత్రక అనుబంధాన్ని పంచుకున్నది భారత్. శతాబ్దాల సంబంధాలను కలిగి ఉన్న ఇరాన్ కరెన్సీ విలువతో పోల్చితే భారతీయ కరెన్సీ విలువ 500 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మార్చి నాటికి మన 1 రూపాయి.. దాదాపు 481 ఇరానియన్ రియాల్స్ కు సమానం. ఏడాది క్రితం ఈ విలువ 507 రియాల్స్ కంటే ఎక్కువగా ఉండేది. అంటే రూ.1,000 ఉన్న వ్యక్తి ఇరాన్‌లో ఒక రోజు హాయిగా గడపవచ్చు. చక్కటి ఫుడ్, మంచి వసతి, సందర్శనా స్థలాలను చూడటంతో పాటు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇండియన్ పర్యాటకులు రూ. 10,000తో సుమారు 10 రోజుల పాటు ఇరాన్ లో లగ్జరీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడి 5 స్టార్ హోటళలు ఒక రోజుకు రూ. 7,000 వరకు ఛార్జ్ చేస్తాయి. మీడియం రేజ్ హోటళ్లు ఒక రోజుకు రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు అందుబాటులో ఉంటాయి. భారతీయ పర్యాటకులు ఇరాన్ లో తక్కువ ఖర్చుతో హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
అమెరికా ఆంక్షలతో ఇరాన్ కు ఆర్థిక ఇబ్బందులు
ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి దారులలో ఇరాన్ ఒకటిగా కొనసాగుతున్నది. అయినప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అందుకు కారణం అమెరికా. ప్రపంచ వ్యాప్తంగా చమురును విక్రయించే సామర్థ్యాన్ని అమెరికా పరిమితం చేసింది. సంవత్సరాలుగా ఇదే తీరు కొనసాగడంతో ఇరానియన్ రియాల్ విలువలో భారీగా పడిపోయింది. 1798లో తొలిసారి రియాల్ ప్రవేశపెట్టబడింది. 1825లో తాత్కాలికంగా నిలిపివేయబడింది. 2012 నుంచి రియాల్ విలువ గణనీయంగా పడిపోయింది. 2018తో పోల్చితే 2020 వరకు వచ్చే సరికి రియాల్ విలువను దాదాపు ఐదు రెట్లు కోల్పోయింది. ద్రవ్యోల్బణం పెరగడంతో, ఇరాన్ లో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. స్థానికులకు నిత్యవసర వస్తువులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు
2022లో ఇరాన్ ద్రవ్యోల్బణం రేటు 42.4 శాతానికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉన్న టాప్ 10 దేశాలలో ఒకటి కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగానికి కారణం అయ్యింది. అదే సమయంలో చాలా మంది ఇరానియన్లు ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చితే స్వయం ఉపాధి పొందేందుకు ఇష్టపడ్డారు. ఇప్పటికీ అక్కడి జనాభాలో 27.5 శాతం మంది మాత్రమే సాధారణ ఉపాధిలో ఉన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పుడు పేదరికంలో జీవిస్తున్నారు. అవినీతి కూడా ఇరాన్ లో తీవ్రమైన సమస్యగా కొనసాగుతోంది.
కఠినమైన కరెన్సీ నిబంధనలు
ఇరాన్ లో విదేశీ కరెన్సీపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ పై కఠినమైన వైఖరి అవలంభిస్తోంది. ఇరాన్‌లోయుఎస్ డాలర్లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. డాలర్లతో ఎవరైనా పట్టుబడితే జైలు శిక్షతో సహా కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డాలర్ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి, ఇరాన్ ఇప్పుడు భారతదేశంతో సహా అనేక దేశాలతో స్థానిక కరెన్సీలలో వ్యాపారం నిర్వహిస్తుంది.
Read Also: మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఆ రోజే ఎందుకు జరుపుతారో తెలుసా?