Online Travel Fraud: ప్రస్తుత కాలంలో అనేక మంది కూడా తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ కావడంతో అనేక మంది కూడా ఆన్ లైన్లో ఒక్క క్లిక్‌తో హోటల్ బుకింగ్, ట్రావెల్ ప్యాకేజీ, దర్శన టిక్కెట్లను ఈజీగా బుక్ చేసుకుంటున్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పలువురు మోసగాళ్లు ఛాన్స్‌గా మార్చుకుంటున్నారు.
ఫేక్ యాత్రా పోర్టల్స్
ఎలాగంటే మీరు ఆలయ దర్శనం లేదా టూర్ బస్సు, ట్రైన్ వంటి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం చూసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ వెబ్‌సైట్ల ట్రెండ్ వచ్చేస్తుంది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ మోసాలపై అలర్ట్ చేసింది. మొబైల్ యాప్‌లు, ఫేక్ యాత్రా పోర్టల్స్, అర్థంలేని ఆఫర్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నయని తెలిపింది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.
మోసం ఎలా జరుగుతోంది?
సైబర్ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీలు, గూగుల్ యాడ్స్ ద్వారా యాత్రికులను మోసం చేస్తున్నారు. వారు ప్రొఫెషనల్‌గా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లను తయారు చేసి అనేక మందిని చీట్ చేస్తూ మనీ లాగేస్తున్నారు. ఇప్పటికే కేదార్‌నాథ్, చార్ ధామ్ యాత్రలకు హెలికాప్టర్ బుకింగ్, హోటల్ బుకింగ్, క్యాబ్ సేవలు, హాలిడే ప్యాకేజీలు వంటి ఆకర్షణీయ ఆఫర్‌లను తయారు చేసి పలువురిని చీట్ చేశారు. ఈ క్రమంలో యాత్రికులు, టూర్లకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచనలు చేసింది.
Read Also: Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 …
ఈ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా?
అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. ఉదాహరణకు, కేదార్‌నాథ్ హెలికాప్టర్ బుకింగ్ కోసం IRCTC అధికారిక పోర్టల్ లేదా సోమనాథ్ గెస్ట్ హౌస్ బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ ఉపయోగించాలి. బుక్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. అధికారిక వెబ్ సైట్ అని తెలుసుకున్న తర్వాత మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలి.
లింక్‌లపై క్లిక్
వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే తెలియని లింక్‌లపై క్లిక్ చేయోద్దు. సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయోద్దు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఆఫర్ల పేరుతో వచ్చే యాడ్స్ చూసి క్లిక్ చేయకూడదు. ముందుగా వెబ్‌సైట్ URL తనిఖీ చేయాలి. HTTPS భద్రత, సరైన స్పెల్లింగ్ ఉందో లేదో చూసుకోవాలి. మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే, నేషనల్ సైబర్ క్రైమ్ కేంద్రానికి ఫిర్యాదు చేయాలి.
సురక్షితంగా ప్లాన్ చేసుకోండి
సైబర్ మోసాలు పొంచి ఉన్న నేపథ్యంలో తీర్థయాత్ర లేదా పర్యాటక బుకింగ్ చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దీంతోపాటు ఆఫర్ల పేరుతో కాల్స్ చేసినా లేదా సందేశాలు పంపించినా కూడా అవి నిజమేనా కాదా అని అధికారిక వెబ్ సైట్ మాత్రమే ఓపెన్ చేసి తెలుసుకోండి. వారు పంపించే లింకులను మాత్రం అస్సలు ఓపెన్ చేయోద్దు. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది ఫేక్ ప్రకటనలు చూసి మోసపోయారు. కాబట్టి అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించి, మీ డబ్బు, సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోండి.