రైల్వే రంగం రోజు రోజుకు మరింత ముందడుగు వేస్తోంది. ఇప్పటికే అత్యాధునిక బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రాగా, కెనడాలో రూపొందిన ఎలక్ట్రిక్ రైలు ఏకంగా వెయ్యి కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. బుల్లెట్ రైలు కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించే రైలును.. ట్రాన్స్‌పాడ్ అనే కెనడియన్ స్టార్టప్ ఇటీవల ఫ్లక్స్‌జెట్‌ను ఆవిష్కరించింది. ఇది విమానం, రైలు మధ్య హైబ్రిడ్ గా రూపొందించారు. ఈ రైలు గంటలకు 621 మైళ్ల( సుమారు 1000 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే సగటు ప్రైవేట్ జెట్ కంటే వేగంగా ఉంటుంది. హై-స్పీడ్ రైలు కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.
ఈ రైలు ప్రత్యేకత ఏంటి?
ట్రాన్స్‌పాడ్ రూపొందించిన ‘వీలెన్స్ ఫ్లక్స్’ అనే ఈ రైలు కాంటాక్ట్ లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ ను కలిగి ఉంటుంది. ఇది పట్టాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఏరోడైనమిక్, ప్రొపల్షన్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. వాక్యూమ్ ట్యూబ్ సెటప్ లో అయస్కాంత శక్తి ద్వారా పైకి లేపబడిన పాడ్ జెట్ కంటే వేగంగా ప్రయాణిస్తుంది.
ఒకేసారి 54 మంది ప్రయాణం
ఇక వీలెన్స్ ఫ్లక్స్ 54 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్తుంది. దీనికి నాలుగు లగేజ్ రాక్‌లు కూడా అమర్చబడి ఉంటాయి. 10 టన్నుల వరకు సరుకును రవాణా చేయగలవు. ఇది రోడ్లు, హైవేలలో రద్దీని తగ్గించడానికి ట్రాన్స్ పాడ్ లైన్ అని పిలువబడే ప్రత్యేక ట్యూబ్ సిస్టమ్ లో ప్రయాణిస్తుంది. ట్రాన్స్ పాడ్ లైన్ కీలక ప్రదేశాలు, ప్రధాన నగరాల్లో స్టేషన్లను కలిగి ఉంటుంది. ప్రతి రెండు నిమిషాలకు పాడ్‌లు బయలుదేరుతాయని భావిస్తున్నారు. ప్రయాణీకుల టికెట్ ధర విమాన టికెట్ కంటే సుమారు 44 శాతం తక్కువగా ఉంటుందని అంచనా.
వీలెన్స్ ఫ్లక్స్ ఎన్ని లాభాలో..
వీలెన్స్ ఫ్లక్స్ 621 mph వేగంతో ప్రయాణించగలదు. ఈ ప్రాజెక్ట్ 1, 40,000 ఉద్యోగాలను క్రియేట్ చేయనుంది. ఈ రైలు ఏడాదికి CO2 ఉద్గారాలను దాదాపు 6, 36,000 టన్నులు తగ్గిస్తుందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ కంపెనీ ఇటీవల టొరంటోలో జరిగిన ఒక కార్యక్రమంలో దాని ఆవిష్కరించింది. డెమో మోడల్ దాని గైడ్ వేలో టేకాఫ్, ల్యాండింగ్ విధానాన్ని ప్రదర్శించింది. ప్రపంచ రైల్వే రంగంలో ఈ రైలు సరికొత్త మైల్ స్టోన్ గా నిలువనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
జర్మనీలో హైడ్రోజన్ సెల్ పవర్డ్ ప్యాసింజర్ రైళ్లు ప్రారంభం
అటు జర్మనీ ఈ వారంలో ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్ సెల్ పవర్డ్ ప్యాసింజర్ రైళ్ల సముదాయాన్ని ప్రారంభించింది. ఫ్రెంచ్ పవర్ టు ట్రాన్స్‌పోర్ట్ సంస్థ, ఇంజనీరింగ్ సంస్థ ఆల్‌స్టోమ్ 14 కొరాడియా ఐలింట్ హైడ్రోజన్ రైళ్లతో కూడిన కొత్త సముదాయాన్ని నిర్మించింది. ప్రతి కొత్త లోకోమోటివ్ దాని ఇంజిన్‌కు శక్తినివ్వడానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగిస్తాయి. ఇవి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించనుంది. ఆల్ స్టోమ్ రైళ్లు హైడ్రోజన్ సెల్స్ మీద నడుస్తున్నందున, సంవత్సరానికి 422,000 గ్యాలన్ల కంటే ఎక్కువ డీజిల్ ఇంధనాన్ని ఆదా చేయనున్నాయి. CO2 ఉద్గారాలను 460 టన్నుల వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
Read Also: 4 రోజులు.. 9 రాష్ట్రాలు…దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా?