Best Cars Under 5 Lakh : మీది చిన్న కుటుంబమా? భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు కలిసి బైకు మీద ప్రయాణం చేయడం కష్టంగా ఫీలవుతున్నారా? అయితే, చిన్న కుటుంబానికి సరిపడే చిన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రూ. 5 లక్షల్లోపు పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే! వీటీలో మీకు నచ్చిన కారును సెలెక్ట్ చేసుకోండి!
⦿ మారుతి సుజుకి ఆల్టో K10
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చిన్న కార్లలో బెస్ట్ కారు మారుతి సుజుకి ఆల్టో K10. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేవరెట్. తక్కువ ధర, చక్కటి మైలేజ్ అందిస్తుంది. పెట్రలో మాన్యువల్ కారు లీటరుకు 24.39 కిలో మీటర్ల మైలేజీ లభిస్తుంది. ఆటో మేటిక్ కారు లీటరుకు 24.90 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. CNG వెర్షన్ కేజీకి 33.85 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక ఈ కారు ధర విషయాన్ని పరిశీలిస్తే ఎక్స్-షోరూమ్ లో రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల వరకు ఉంటుంది.
⦿ MG కామెట్ EV
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV. ఈ కారు ఒక పూర్తి ఛార్జింగ్ మీద 230 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తుంది. 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ కోసం సుమారు 3.5 గంటల సమయం పడుతుంది. MG BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) ప్లాన్ కింద ఈ కారు( ఎక్స్-షోరూమ్) ధర రూ. 4.99 లక్షలు. సబ్ స్క్రిప్షన్ లేకుండా, ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.98 లక్షలుగా నిర్ణయించింది తయారీ సంస్థ. ప్రస్తుతం దేశంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV.
⦿ రెనాల్ట్ క్విడ్
తక్కువ ధరలో లభించే కార్లలో రెనాల్ట్ క్విడ్ స్టైలిష్, ప్రాక్టికల్ హ్యాచ్ బ్యాక్ ఒకటి. రెనాల్ట్ క్విడ్ బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.69 లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.44 లక్షలు. రూ. 5 లక్షల లోపు, మీరు RXE 1.0L, RXL(O) 1.0L, RXL(O) నైట్ & డే ఎడిషన్ వేరియంట్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ కారు మైలేజీ వివరాలను పరిశీలిస్తే… ఈ కారు లీటరుకు 21 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది.
తక్కువ ధరలో ఫ్యామిలీకి సరిపడే చిన్న కార్లు కొనాలనుకునే వారికి ఈ మూడు కార్లు బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. వీటిలో మీకు నచ్చిన కారును కొనుగోలు చేసుకోవచ్చు. తక్కువ ధరే కాదు, మంచి మైలేజీ కూడా వస్తున్న నేపథ్యంలో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లుగా వీటిని పరిగణించవచ్చు. ఈ మూడు కార్లలో ఎలక్ట్రిక్, పెట్రోల్, CNG వేరియంట్స్ ఉన్నాయి. ఎవరికి ఏ కేటగిరీ నచ్చితే, దానిని తీసుకోచ్చు. ఇంకెందుకు ఆలస్యం నచ్చింది కొనుగోలు చేయండి. మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా, జాలీగా జర్నీ చేసేయండి!
Read Also : స్ట్రీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు.. ప్రపంచాన్ని ఏలబోతున్న ఎలన్ మస్క్ రోబో ట్యాక్సీలు !