E-Paper
Advertisement

గంటకు 320 కిలో మీటర్ల వేగం.. సముద్రం కింద బుల్లెట్ రైలు ప్రయాణం!

గంటకు 320 కిలో మీటర్ల వేగం.. సముద్రం కింద బుల్లెట్ రైలు ప్రయాణం!
Advertisement

India’s First Undersea Bullet Train Tunnel: భారత్ లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ఈ హైస్పీడ్ రైలు మార్గంలో.. ఓ ప్రత్యేకమైన సొరంగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. థానే క్రీక్ సముద్ర జలాల కింద సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలోనే తొలి సముద్రగర్భ రైలు సొరంగంగా నిలవనుంది.

21 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగం

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో మహారాష్ట్ర పరిధిలో సుమారు 21 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. థానే క్రీక్ కింద ఉండే 7 కిలోమీటర్ల భాగం ఈ నిర్మాణంలో కీలకమైనది. ఈ సొరంగం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) నుంచి థానేలోని షిల్ఫాటా ప్రాంతాన్ని కలుపుతుంది. సొరంగం నిర్మాణంలో ఆధునిక టన్నెల్ బోరింగ్ మెషీన్లను (TBM) ఉపయోగిస్తున్నారు. సుమారు 16 కిలోమీటర్ల మేర తవ్వకాలు ఈ యంత్రాల ద్వారా చేపడుతున్నారు. కఠినమైన కొండ ప్రాంతాల్లో తవ్వకాల కోసం ఆస్ట్రియన్ టన్నెలింగ్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు.

సముద్ర మట్టానికి 25 నుంచి 55 మీటర్ల లోతులో..

Advertisement

ఈ సొరంగాన్ని భూమి, సముద్ర మట్టానికి సుమారు 25 నుంచి 55 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. విక్రోలి నుంచి BKC వైపు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఘన్సోలి సమీపంలోని సావ్లి నుంచి విక్రోలి వైపు కూడా పనులు కొనసాగుతున్నాయి. సొరంగం లోపల రెండు సమాంతర రైలు ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. 2025 సెప్టెంబర్‌లో ఘన్సోలి-షిల్ఫాటా మధ్య 4.8 కిలోమీటర్ల సొరంగం నిర్మాణంలో ఇంజనీర్లు కీలక పురోగతి సాధించారు. ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు నిర్మాణానికి సవాలుగా మారినప్పటికీ పనులు కొనసాగుతున్నాయి.

బుల్లెట్ రైలు ప్రారంభం ఎప్పుడు?

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మొదటి విభాగాన్ని 2027లో ప్రారంభించే అవకాశం ఉంది. 2027 మే లేదంటే జూన్‌లో రైలు ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, త్వరలో రైల్వే నుంచి లాంచ్ డేట్ అధికారిక ప్రకటన రానుంది. ఈ కారిడార్‌లో ముంబై BKC, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి లాంటి 12 స్టేషన్లు ఉంటాయి.

గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

Advertisement

జపాన్‌కు చెందిన షింకన్సెన్ సాంకేతికతతో ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రైళ్లు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించారు. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణ సమయం సుమారు 2 గంటల 7 నిమిషాలకు తగ్గనుంది.

Read Also: బెంగళూరు నుంచి గోవాకు కొత్త వందే భారత్.. ప్రారంభం ఎప్పుడంటే?

Tags

Related News

వారణాసి-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. సోమవారం నుంచే రెగ్యులర్ సర్వీసులు!

మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా? ఈ కొత్త రూల్ తెలిస్తే షాక్ అవుతారు!

భారత బుల్లెట్ రైలుకు స్క్వీజ్ టెస్ట్.. ప్రమాదం జరిగినా బోగీలు చెక్కుచెదరవా?

ఎండలు మండినా తరగని జలకళ.. దేవరకొండ కోటలో వింత కోనేరు!

NH 65 To NH 365B.. నల్లగొండ మీదుగా ఇన్ని హైవేలున్నాయా?

భారత్‌లోనే విదేశీ అందాలు.. ఈ 5 ప్రదేశాలను చూస్తే స్విట్జర్లాండ్ వెళ్లినట్లే ఫీలవుతారు!

మారనున్న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌ రూపురేఖలు.. రూ.197 కోట్లతో అభివృద్ధి పనులు!

Big Stories

Advertisement
×