Food Safety Raids: చూడ్డానికి నక్షత్ర హోటల్.. సామాన్యులు వెళ్తే బిల్లులతో జేబులకు చిల్లు.. మరి బిల్లుకు తగ్గట్టు క్వాలిటీ వుంటుందా? అంత సీను లేదు. మాల్ మసాల అని లొట్లలేసుకుంటే గుండె జారీ గల్లంతవ్వాల్సిందే.
కిచెన్ లోపల ఎలుకలు, బొద్దింకలు!
స్టార్ హోటళ్లు.. ఎప్పుడూ సందడి వుండే రెస్టారెంట్లు .. దేవుళ్ల పేరు పెట్టుకున్న హోటళ్లను చెక్ చేసిన టీజీ సేప్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కిచెన్‌లో కన్పించిన సీన్లు అవి. కుళ్లిన కూరగాయలు.. ఎలుకలు కొరి..బల్లులు, బొద్దింకలు బొర్లిన పప్పులు.. శ్మశానం నుంచి డంప్ చేసుకున్నారా అన్పించేలా ఎముకలు.. ఎందెందు వెదికినా క్లీన్ లైన్స్ మచ్చుకైనా లేవు. జవహర్ నగర్ మినీ డంప్ యార్డ్‌ను తలిపించే ఇలాంటి కంపు సీన్లే.
22 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
గోల్కొండ, చార్మినార్ జోన్ లో ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్‌లు ఏకకాలంలో 22 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. హైజెనిక్ లేదు..క్లీన్‌లైన్స్ లేవు.. దాదాపు అన్నీ హోటళ్లలో ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితులే కన్పించాయి.
14 హోటళ్లు క్లోజ్!
అపరిశుభ్రత కిచెన్.. కాలం చెల్లిన సరుకులతో కస్టమర్ల ఆరోగ్యంతో చెలగామాడుతున్న 14 హాటళ్లను గుర్తించారు. వెంటనే బిజినెస్ ఆపేయాలని ఆదేశించడం సహా లైసెన్స్‌లు రద్దు చేశారు. ఇక ఇంజిన్ బౌలిలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ,, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్ , శాలిబండలోని పిస్తా హౌస్ రెస్టారెంట్ , టోలిచౌక్‌లోని ఇంపిరీయల్ మల్లీకుజిన్ రెస్టారరెంట్, చార్మినార్‌లోని సబ్జీ హోటల్, సంతోష్‌నగర్‌లోని స్వీకార్ హోటల్, చార్మినార్‌లోకి మండి AT 36, లక్డీకపూల్‌లోని తైబా బేకరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్లీన్ లైన్స్ పాటించకపోవడం మాత్రమే కాదు కల్తీ సరుకులు వాడుతున్నట్టు గుర్తించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.
దేవుళ్ల పేర్లు… కల్తీ తిండ్లు!
కౌంటర్ దగ్గర దేవుళ్ల ఫోటో.. లచ్చిందేవి లెక్క QR కోడ్.. ఫ్రంట్ ఆఫీస్ సూపర్ నీట్.. బిల్లులు లాగుడు బరాబరే. మరి ప్రజారోగ్యంతో చెలగాట మాడే ఈ కక్కుర్తి ఎందుకు? భక్తి సంగతి సరే..దేవుడే ద్యావుడా అని హడలిపోయే ఈ దాష్టీకాలేంటి? ఇంత నిర్లజ్జగా.. నిర్భయంగా కస్టమర్లకు చెత్త తిండి పెట్టే ఈ బరితెగింపు ఎవరి అండతో?
Also Read: తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను గండం.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!