E-Paper
Advertisement

సమంతకు కవల పిల్లలా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

సమంతకు కవల పిల్లలా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సమంత (Samantha)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఒకవైపు హీరోయిన్ గా , మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru)తో ఏడడుగులు వేసిన సమంత.. తన సినిమా ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్ లో తాను గర్భవతి అన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

“#9 ది ఫైనల్ ల్యాప్”..

గర్భం దాల్చినప్పటి నుంచి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒకవైపు జిమ్ వర్కౌట్స్ తో మరొకవైపు తన బిజినెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. మరొకవైపు సోనీ విఝూలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ ‘ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అలా బిజీబిజీగా గడిపేస్తున్న ఈమె ఇటీవల తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను గర్భం దాల్చిన మొదటి నెల నుండి 9వ నెల వరకు వర్కౌట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. “#9 ది ఫైనల్ ల్యాప్” అంటూ క్యాప్షన్ జోడించింది.

ఒక్క కామెంట్ తో సోషల్ మీడియాలో అనుమానాలు రేకెత్తించిన హీరోయిన్..

Advertisement

ఇలాంటి సమయంలో సమంత పెట్టిన పోస్ట్ కంటే ఆమె పోస్ట్ కి ప్రముఖ హీరోయిన్ కృతి కర్బంద (Kriti kharbanda) చేసిన కామెంట్ వైరల్ గా మారింది. తీన్మార్ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కృతి కర్బంద సమంత వర్కౌట్ వీడియోకి..”సెండింగ్ ఆల్ 3 ఆఫ్ యు సో మచ్ లవ్”.. అంటే “మీ ముగ్గురికి ఎంతో ప్రేమను పంపుతున్నాను” అంటూ ఒక కామెంట్ షేర్ చేసింది. అయితే కృతి కర్భంద చేసిన కామెంట్ ను బట్టి చూస్తే మరి ఇక్కడ ఆ ముగ్గురు ఎవరు? ఎందుకు ఆమె ఇలా కామెంట్ చేశారు అంటూ నెటిజన్స్ చర్చిస్తున్నారు. అంతేకాదు సమంత కవల పిల్లలకి జన్మనివ్వబోతోందా? అంటూ ఊహాగానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే?

Advertisement

మరి అసలు విషయం ఏమిటి? అంటే.. సాధారణంగా ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటే తల్లిదండ్రులతో పాటు పుట్టే బిడ్డకి కలిపి శుభాకాంక్షలు చెబుతారన్న విషయం తెలిసిందే. ఇక ఆ కోణంలోనే కృతి కర్భంద ఈ కామెంట్ చేసి ఉండొచ్చు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం.. లేదు ఇక్కడ ఈ పోస్ట్ లో కనిపిస్తున్నది సమంత మాత్రమే కదా.. ఆమె భర్త రాజ్ ఇక్కడ కనిపించడం లేదు.. అలాంటప్పుడు సమంతకు మాత్రమే పెట్టిన కామెంట్లో ఆల్ 3ఆఫ్ యు అని ఎందుకు పేర్కొన్నారు. అంటే సమంత కడుపులో ఉన్నది ఇద్దరు పిల్లలా అనే అనుమానాలు, గాసిప్స్ మొదలయ్యాయి. మరికొంతమంది ఏమో సమంతకు అత్యంత సన్నిహితమైన వారికి మాత్రమే తెలిసిన ఆ గుడ్ న్యూస్ ను కృతికర్బంధ ఇలా పొరపాటున కామెంట్ రూపంలో బయటపెట్టేసారా?అంటూ కూడా చర్చించుకుంటున్నారు.

also read:చిరు చేతుల మీదుగా ఆర్‌సీ17 గ్రాండ్ ప్రారంభం.. సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్!

ఘనంగా సీమంతం వేడుకలు..

ఇక ఇప్పటికే కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సీమంతం వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్న ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మరి కృతి కర్బంద చేసిన ఆ ఆల్ త్రీ ఆఫ్ లవ్ కామెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి నిజంగానే కవలలు జన్మించబోతున్నారా? లేక అది సాధారణ మాటల సందర్భమా? అన్నది తెలియాలి అంటే స్వయంగా సమంత స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

చిరు చేతుల మీదుగా ఆర్‌సీ17 గ్రాండ్ ప్రారంభం.. సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్!

ఆకట్టుకుంటున్న సూర్య ‘ సీన్’ తెలుగు ట్రైలర్..ఎలా ఉందంటే?

వెంకీ మామకు షాక్.. ఆదర్శ కుటుంబం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

పెయింటింగ్‌లా పాలక్ తివారీ.. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాలో రచ్చ!

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్

అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటున్న హెబ్బా!

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

Big Stories

Advertisement
×