Indian Railway Jobs: కొన్ని రైల్వే ఉద్యోగాలకు మెడికల్ టెస్టులు అనేవి తప్పనిసరి చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మెడికల్ టెస్టులో పాసైతేనే ఉద్యోగాని అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఆయా రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ ను ఫాలో అవుతారు. ఇంతకీ ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్వే మెడికల్ స్టాండర్డ్స్
రైల్వేలో సాధారణంగా A1, A2, A3, B1, B2 అనే మెడికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఇంతకీ A1, A2, A3, B1, B2 అంటే ఏంటి? అనేదాని గురించి తెలుసుకుందాం..
⦿ A1: రైల్వే ఉద్యోగాల్లో ఇది చాలా కీలకమైన మెడికల్ టెస్ట్. ఈ టెస్ట్ ప్రకారం 6/6 కంటి చూపు ఉండాలి. ఎలాంటి కళ్లజోడు ఉపయోగించకూడదు. సాధారణ వ్యక్తి 6 మీటర్ల దూరంలో ఉన్న ఒక దృశ్యాన్ని చూస్తే, వీరు కూడా అంతే దూరంలో ఉన్న దృశ్యాన్ని స్పష్టంగా చూడాలి. ఇందుకు కళ్లజోడు ఉపయోగించకూడదు. నియర్ విజన్ అనేది 0.6 వరకు ఉండాలి.
⦿ A2: దీని ప్రకారం 6/9 కంటి చూపు కలిగి ఉండాలి. అంటే ఒక సాధారణ వ్యక్తి 9 మీటర్ల దూరంలోని వస్తువును స్పష్టంగా చూస్తే, మీరు కనీసం 6 మీటర్లు, అంతకంటే ఎక్కువ చూడాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ కు కూడా అద్దాలు ఉండకూడదు. నియర్ విజన్ 0.6 వరకు ఉండాలి.
⦿ A3: ఈ టెస్టు ప్రకారం 6/9 లేదంటే 6/12 ఉండాలి. ఈ రెండు కంటి పరీక్షలకు సంబంధించి గ్లాసెస్ ఉన్నా, లేకున్నా ఫర్వాలేదు. నియర్ విజన్ 0.6 వరకు ఉండాలి.
⦿ B1: ఈ టెస్టు ప్రకారం 6/9 లేదంటే 6/12 ఉండాలి. ఈ రెండు కంటి పరీక్షలకు సంబంధించి గ్లాసెస్ ఉన్నా, లేకున్నా ఫర్వాలేదు. కానీ, ఇందులో లెన్స్ అనేవి వేరుగా ఉంటాయి. నియర్ విజన్ 0.6 వరకు ఉండాలి.
⦿ B2: ఈ టెస్టు ప్రకారం 6/9 లేదంటే 6/12 ఉండాలి. ఈ రెండు కంటి పరీక్షలకు సంబంధించి గ్లాసెస్ ఉన్నా, లేకున్నా ఫర్వాలేదు. కానీ, ఇందులో లెన్స్ అనేవి + OR – 4D ఉంటాయి. నియర్ విజన్ 0.6 వరకు ఉండాలి.
ఈ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం రైల్వేలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షల్లో నూటికి 99 శాతం మంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉందంటారు నిపుణులు. అతి తక్కువ మంది ఈ టెస్టులలో ఫెయిల్ అవుతారని వెల్లడించారు.
Read Also: ఢిల్లీ నుంచి ఒక్క రోజులో చుట్టేసే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
కళ్లజోడు ఉంటే రైల్వే ఉద్యోగాలు రావా?
ఇక కళ్ల జోడు ఉంటే ఉద్యోగాలు రావు అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, కొన్ని ఉద్యోగాలకు A1, A2 మెడికల్ స్టాండర్డ్స్ ను ఫాలో అవుతారు. అలాంటి ఉద్యోగాలకు కచ్చితంగా కళ్లజోడు అనేది ఉండకూడదు. మిగతా మెడికల్ స్టాండర్డ్ ఉద్యోగాలకు కళ్లజోడు ఉన్నా ఫర్వాలేదంటున్నారు రైల్వే నిపుణులు.
Read Also: హైదరాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ న్యూస్!