South Central Railway Kumbh Mela Special Trains: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో పెద్ద మొత్తంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ నేపథ్యంలో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ కు వెళ్తుండటంతో.. మరో నాలుగు ప్రత్యేక రైళ్లను అనౌన్స్ చేసింది. ఈ రైళ్లు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ధన్ పూర్ వరకు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
మహా కుంభమేళా ప్రత్యేక రైళ్ల వివరాలు
తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిన రైళ్లు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి. చర్లపల్లి నుంచి ధన్ పూర్, ధన్ పూర్ నుంచి చర్లపల్లి మధ్య నడవనున్నాయి.
⦿ ట్రైన్ నెంబర్ 07079 ఫిబ్రవరి 5వ చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
⦿ ట్రైన్ నెంబర్ 07080 ఫిబ్రవరి 7న ధన్ పూర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుతుంది.
⦿ రైలు నెంబర్ 07077 ఫిబ్రవరి 7వ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరనుంది. మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు ధన్ పూర్ కు చేరుతుంది.
⦿ రైలు నెంబర్ 07078 ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకోనుంది.
#KumbhRailSeva2025 #MahaKumbh2025 @drmsecunderabad pic.twitter.com/NwnwWYZ2dC
— South Central Railway (@SCRailwayIndia) January 29, 2025
Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, మౌని అమావాస్య వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు!
ఈ ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
చర్లపల్లి నుంచి రెండు రైళ్లు, ధన్ పూర్ నుంచి మరో రెండు రైళ్లు అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుతాయి. అటు ఇతర రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో కూడా ఆగుతాయని అధికారులు తెలిపారు. బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్ పూర్, జబల్ పూర్, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగరాజ్, మీర్జాపూర్, బక్సర్, ఆగ్రా సహా పలు స్టేషన్లలో ఈ రైళ్లు హాల్టింగ్ తీసుకుంటాయి. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో 2A, 3A, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయన్నారు. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ అధికారులు సూచించారు.
Read Also: ఢిల్లీ నుంచి ఒక్క రోజులో చుట్టేసే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
Read Also: దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏక బిగిన ఎన్ని కిలో మీటర్లు నడుస్తాయంటే?