OTT Movie : ఓటీటీలో ఎన్నోరకాల స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు చాలా విచిత్రం గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక మహిళ భర్తను వదిలి కుక్కను ప్రేమిస్తుంది. చివరికి ఈ రిలేషన్ ఏమౌతుంది అనేది మూవీ స్టోరీ లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime Video) లో
1977లో విడుదలైన ఈ స్పానిష్ డ్రామా మూవీ పేరు ‘ది క్రియేచర్’ (The Creature). దీనికి ఎలోయ్ డి లా ఇగ్లేసియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ లో ప్రధాన పాత్రలలో అనా బెలెన్, జువాన్ డియాగో నటించారు. ఈ సినిమా ఒక బూర్జువా గృహిణి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్తతో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టి, ఒక నల్లటి జర్మన్ షెపర్డ్ కుక్క పట్ల ప్రేమను ఎంచుకుంటుంది. ఈ మూవీ జూఫిలియా అనే అంశాన్ని బహిరంగంగా చర్చించడం ద్వారా గుర్తింపు పొందింది. ఈ స్టోరీ అప్పటి స్పానిష్ సినిమాలో కొత్తదనంగా అనిపించింది.స్పెయిన్‌లో అప్పటి రాజకీయ వాతావరణంలో, ఈ మూవీ చాలా సంచలనాత్మకంగా గుర్తింపు పొందింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మార్కోస్, క్రిస్టినా అనే దంపతులకు వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా వీళ్ళకి పిల్లలు లేనందున కొంత ఒత్తిడిలో ఉంటారు. క్రిస్టినా ఊహించని విధంగా ఒక రోజు గర్భవతి అవుతుంది, దీంతో ఆ దంపతులు ఎంతో సంతోషిస్తారు. అయితే, ఆమె గర్భం దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో, ఒక నల్లటి జర్మన్ షెపర్డ్ కుక్క ఆమెపై దాడి చేస్తుంది. ఈ షాక్ కారణంగా ఆమెకు గర్భస్రావం అవుతుంది. ఇక ఆమె కోలుకోలేని దుఃఖంలో మునిగిపోతుంది. ఆమె భర్త మార్కోస్, ఆమెకు ఈ విషాదాన్ని మరచిపోయేలా చేయడానికి, వారు గతంలో హనీమూన్ గడిపిన బీచ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ క్రిస్టినా ఒక స్నేహపూర్వకమైన నల్లటి జర్మన్ షెపర్డ్ కుక్కను చూస్తుంది. దానితో సమయం గడుపుతూ ఉంటుంది. కోల్పోయిన బిడ్డకు ఆమె పెట్టాలనుకున్న బ్రూనో అనే పేరును ఆ కుక్కకు పెడుతుంది.
మెల్లగా ఆమె ఈ కుక్క పట్ల ఒక అసాధారణమైన ఆప్యాయతను పెంచుకుంటుంది.ఇది ఆమె భర్తతో ఉన్న సంబంధాన్ని మరింత దిగజారుస్తుంది. ఒక రోజు మార్కోస్ ఇంటికి వచ్చినప్పుడు, క్రిస్టినా తన వివాహ దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె కుక్కతో పడుకుని ఉన్నట్లు చూస్తాడు మార్కోస్. అప్పుడు ఆమె కుక్కతో శారీరక సంబంధం కలిగి ఉందని చెప్పకనే చెప్తుంది. ఈ పరిణామాలు వారి వివాహాన్ని ఒక సంక్షోభ స్థితికి తీసుకెళ్తాయి, చివరికి క్రిస్టినా తన భర్త, కుక్క మధ్య ఒకరిని ఎన్నుకోవలసి వస్తుంది. క్రిస్టినా చివరికి ఎవరిని ఎంచుకుంటుంది? ఎవరితో సంసారం చేస్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ‘ది క్రియేచర్’ (The Creature) అనే ఈ మూవీని చూడండి.