BIG TV LIVE Originals: భారతీయ రైల్వే ప్రయాణీకులు ఈజీగా టికెట్లు బుక్ చేసుకునే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైల్వే వాలెట్ ద్వారా సులభంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తాజాగా భారతీయ రైల్వే సరికొత్త ఆల్ ఇన్ వన్ యాప్ స్వరైల్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా అన్ని రైల్వే సేవలను పొందే అవకాశం ఉంది. పీఎన్ఆర్ స్టేటస్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ సేవలు లభిస్తాయి. అయితే, ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ నుంచి స్వరైల్ యాప్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉందా? అనే అని వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ఇంతకీ సాధ్యం అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ అంటే ఏంటి?
ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ అనేది రైల్వే యాప్ ఐఆర్‌సీటీసీ డిజిటల్ పర్స్ లాంటిది. యుపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఈ వాలెట్ కు డబ్బులు యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతిసారి చెల్లింపు వివరాలను నమోదు చేయకుండా రైలు టికెట్లు త్వరగా బుక్ చేసుకునేందుకు సాయపడుతుంది. ఈ యాప్ అత్యంత సురక్షితమైనది. వేగవంతమైనది. ఈ వాలెట్ ఐఆర్‌సీటీసీతో పాటు స్వరైల్ లో పని చేస్తుంది.
స్వరైల్ యాప్ ప్రత్యేకత ఏంటి?
స్వరైల్ అనేది ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్. ఇది అన్ని రకాల రైల్వే సేవలను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా రిజర్వ్ చేయబడిన, రిజర్వ్ చేయని రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లాట్ ఫారమ్ టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు టికెట్ క్యాన్సిలేషన్, కంప్లైంట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది.
ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ ను స్వరైల్ యాప్ కు బదిలీ చేయొచ్చా?
ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ నుంచి స్వరైల్ కు డబ్బును బదిలీ చేయల్సిన అవసరం లేదు. స్వరైల్ యాప్ లోకి ఐఆర్‌సీటీసీ ఐడీతో లాగిన్ అయితే, అదే ఇ-వాలెట్ ఇందులోనూ ఉయోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ లోని బ్యాలెన్స్ స్వరైల్ వ్యాలెట్ లోనూ కనిపిస్తుంది. మీరు టికెట్లు బుక్ చేసుకోవడానికి లేదంటే యాప్ లోని ఇతర సేవలు పొందేందుకు ఈ డబ్బులను వాడుకోవచ్చు.
స్వరైల్ లో ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ ని ఎలా ఉపయోగించాలి?
⦿ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదంటే యాపిల్ యాప్ స్టోర్ నుంచి స్వరైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
⦿ ఐఆర్‌సీటీసీ అకౌండ్ వివరాలతో స్వరైల్ యాప్ లోకి సైన్ ఇన్ కావాలి.
⦿ మీరు ప్రయాణించాల్సిన రైలును ఎంచుకుని, ప్రయాణీకుల వివరాలను యాడ్ చేసుకోవాలి.
⦿ ఆ తర్వాత చెల్లింపు పేజీకి వెళ్లి ఐఆర్‌సీటీసీ వాలెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ ఒకవేళ మీ ఈ వాలెట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉండే యుపిఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
⦿ ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కు, మరొక వాలెట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడానికి అవకాశం లేదు. ఈ వ్యాలెట్ లోని డబ్బులను స్వరైల్ తో పాటు ఐఆర్‌సీటీసీ సేవలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: భారతీయ రైల్వే మరో ఘనత, అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను ప్రారంభించిన ప్రధాని!