First Indian 9,000 HP Electric Locomotive: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తోంది. ఇండియన్ రైల్వే చరిత్రలో తొలిసారి అత్యంత పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్ అందుబాటులోకి వచ్చింది. గుజరాత్ లోని దాహోద్ రోలింగ్ స్టాక్ వర్క్ షాప్ లో భారత రైల్వేకు చెందిన తొలి 9,000 HP లోకోమోటివ్ ఇంజిన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీనిని తయారు చేశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ లోకోమోటివ్ మాన్యుఫాక్చరింగ్ షాప్ అంతటా కలియతిరిగి రైలు ఇంజిన్ల తయారీ విధానాన్ని పరిశీలించారు.
దాహోద్ మాన్యుఫాక్చరింగ్ షాప్ ప్రత్యేకతలు
⦿ ఈ 9,000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్ (EF-9K) సిమెన్స్ మొబిలిటీ, ఇండియన్ రైల్వే సహకారంతో రూపొందించబడింది.
⦿ ఈ లోకో మోటివ్ 4,600 టన్నుల సరుకును రవాణా చేసే శక్తిని కలిగి ఉంది. దీని గరిష్ట వేగం 120 కి.మీ/గం కాగా, సగటు వేగం 75 కి.మీ/గం.
⦿ రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఎనర్జీ ఎఫిషియెంట్, పర్యావరణ అనుకూల రైల్వే ఆపరేషన్లకు సపోర్ట్ చేస్తుంది.
⦿ ఈ లోకోమోటివ్‌లు దేశీయ అవసరాలతో పాటు విదేశీ ఎగుమతుల కోసం తమారు చేయబడుతాయి.
9,000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ల ఉత్పత్తి:
దాహోద్ ఫ్యాక్టరీలో సంవత్సరానికి 120 లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యాన్ని 150కి పెంచే అవకాశం ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో 1,200 లోకోమోటివ్‌లను తయారు చేయడమే లక్ష్యం పెట్టుకుంది.
Some more pictures from the Rolling Stock Workshop in Dahod pic.twitter.com/HiOhxMhBfW
— Narendra Modi (@narendramodi) May 26, 2025
Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే ఇన్ని ఆఫర్లు అందిస్తుందా? అస్సలు తెలియదే!
మాన్యుఫాక్చరింగ్ షాప్ అభివృద్ధి:
⦿ 2022 ఏప్రిల్ 20న ప్రధానమంత్రి మోడీ ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు.
⦿2024లో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది.
⦿2025 మార్చి 1న సిమెన్స్ ఇండియా మొదటి 9,000 HP లోకోమోటివ్ ప్రోటోటైప్ (EF-9K)ను ప్రదర్శించింది.
⦿ 2025 మే 26న అధికారికంగా ప్రధాని మోడీ అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్ ఇంజిన్ ను ప్రారంభించారు.
⦿ ఈ లోకోమోటివ్ ఇండియన్ రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లలో వేగవంతమైన, సురక్షితమైన రవాణాకు సాయపడుతుంది.
⦿ ఈ లోకోమోటివ్‌లు పునరుత్పాదక బ్రేకింగ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి . అంటే బ్రేకులు వేయడం ద్వారా విత్యుత్ ను తయారు చేసుకోగలుగుతాయి.
⦿ దాహోద్ రైల్వే ఉత్పత్తి కేంద్రం 10,000 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుంది.
⦿ ఈ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.24,000 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు ఇచ్చింది. భారతీయ రైల్వేకు ఈ లోకో మోటివ్ తయారీ సంస్థ కొత్త జవసత్వాలను అందించబోతోంది. సరుకు రవాణాలో ఇక్కడ తయారైన లోకోమోటివ్ లు కీలక పాత్ర పోషించనున్నాయి.
Read Also: దేశంలో అత్యంత అందమైన 10 రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!