BigTV English

Preity Zinta: ప్రీతి జింటాకు అసలైన మగాళ్లు దొరికారు.. యానిమల్ గ్యాంగ్ ను మించి

Preity Zinta: ప్రీతి జింటాకు అసలైన మగాళ్లు దొరికారు.. యానిమల్ గ్యాంగ్ ను మించి

Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఈసారి ప్లే ఆఫ్స్ కు కూడా వెళ్ళింది పంజాబ్ కింగ్స్. 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్ కు పంజాబ్ కింగ్స్ వెళ్లడం జరిగింది. దీనికి ముఖ్య కారణం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును ముందుండి నడిపించాడు. ఈ దెబ్బకు పంజాబ్ కింగ్స్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చింది.


Also Read: Arshdeep Singh Private Chat: అర్ష్‌దీప్ ప్రైవేట్ చాట్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రీతి జింటా

పంజాబ్ జట్టులో యానిమల్ టీం


సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ సినిమా తరహాలోనే పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు తయారైందని సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. యానిమల్ సినిమాలో.. హీరో పక్కన కొంతమంది పంజాబ్ టీం పనిచేస్తుంది. హీరోకు ఆపద వస్తే చాలు… ఆ పంజాబ్ టీం బరిలోకి దిగి విలన్ లను చంపేస్తుంది. యానిమల్ సినిమాలో ఆ పంజాబ్ టీం ఇంట్రడ్యూస్ అయిన తర్వాతనే సినిమాకు మంచి హైట్ వస్తుంది. హీరో సోదరులే వాళ్లు కావడం విశేషం. హీరో ఒక్క మాట చెప్పగానే రంగంలోకి దిగి విలన్లను చెడుగుడు ఆడుకుంటారు.

ఇక ఇప్పుడు… పంజాబ్ జట్టుకు కూడా యానిమల్ టీం లాగానే శ్రేయస్ అయ్యర్ బృందం తయారైందని పోస్ట్లు పెడుతున్నారు. యానిమల్ సినిమాలోని పంజాబ్ బృందం తరహా లో ఐపిఎల్ జట్లపై పంజాబ్ టీం విరుచుకు పడుతుందని.. పోస్టులు పెడుతున్నారు. ప్రీతి జింటా జట్టును కాపాడేందుకు అనుక్షణం… శ్రేయస్ అయ్యర్ టీం కష్టపడుతోందని పేర్కొంటున్నారు. అందుకే పంజాబ్ కింగ్స్ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చిందని చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే మొదటిసారి ఛాంపియన్గా పంజాబ్ కింగ్స్ నిలవడం గ్యారంటీ అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Shashank Singh: ప్రీతీ జింటాకు శశాంక్ బిగ్ ట్రీట్.. 2 రోజుల ముందే చెప్పి మరీ

పాయింట్లు పట్టికలో పంజాబ్ కింగ్స్ నెంబర్ వన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు అలాగే నాలుగు పరాజయాలను చవిచూసింది. ఈ నేపథ్యంలోనే 19 పాయింట్స్ దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఇవాళ లక్నో వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే… గుజరాత్ ను వెనక్కి నెట్టే ఛాన్స్ ఉంటుంది. రన్ రేట్ మెరుగ్గా ఉంటే మొదటి స్థానానికి కూడా వెళ్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అంటే కచ్చితంగా క్వాలిఫైయర్లో పంజాబ్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ బెంగళూరు ఓడిపోతే గుజరాత్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×