భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. వాటికి వేల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. దేవ భూమిగా పిలిచే ఇండియాలో ఎక్కడ చూసినా ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. కొన్నిసార్లు మన పరిసర ప్రాంతాల్లోనే అద్భుతమైన ఆలయాలు ఉన్నా, వాటి గురించి తెలుసుకోలేకపోతాం. అలాంటి వాటిలో ఓ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఆలయానికి ఏకంగా 3800 ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయం అంతా రాళ్ల మధ్యలోనే ఉంటుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? అందులో కొలువైన దేవతలు ఎవరు? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
3800 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ లోనే ఉంది. శ్రీ ఆది లక్ష్మి అలివేలుమంగ సమేత వేంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఫ్యాబ్ సిటీ రోడ్, తుక్కుగూడలో ఉంటుంది. ఆర్టిఫీయల్ లా కాకుండా ఈ ఆలయం, నేచురల్ గా పెద్ద పెద్ద బండల నడుమ, గుహ లోపల ఉంటుంది. వేల ఏళ్ల క్రితమే ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆదిలక్ష్మీ, అలివేలు మంగ స్వయంభూగా వెలిసినట్లు భక్తులు విశ్వసిస్తారు. భక్తులు గుహలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. రాళ్ల మధ్యలో నుంచి లోపలికి వెళ్లాలి. దేవుడు ముందుగా భక్తులకు అద్దంలో కనిపిస్తాడు. కానీ, ఎడమవైను వెళ్లి దర్శించుకోవాల్సి ఉంటుంది.
ఆలయం పక్కనే మరో గుహ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ పూర్తిగా మట్టితో కూడుకుపోయి ఉంది. భక్తులు ఆ మట్టిన తవ్వినప్పుడు అక్కడ శివుడు, విఘ్నేశ్వరుడు, నంది స్వయంభూగా వెలిసినట్లు చెప్తారు, అప్పటి నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగింది. అంతేకాదు, భక్తులు ఇక్కడ సమస్త దేవతలు కొలువై ఉన్నట్లు నమ్ముతారు. అందుకే దీనిని దేవతల గుట్ట అనిపిలుస్తారు.
Read Also: మరో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించిన IRCTC, ‘పవిత్ర కాశీ’ ప్యాకేజీ పేరుతో 4 పుణ్యక్షేత్రాల దర్శనం!
ఇక ఈ మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల కోసం ఇక్కడ ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఇప్పుడిప్పుడే ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఆలయంలో భక్తులకు మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఎంట్రెన్స్ కూడా చక్కగా నిర్మిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఫ్రీగా ఉన్న సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించండి. శ్రీవారి ఆశీస్సులు పొందండి.
Read Also: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..