Goa Summer Vacation: దేశంలోని పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం గోవా. అద్భుతమైన బీచ్ లు, ఆహ్లాదరపరిచే బోట్ రైడ్స్, ప్రకృతి అందాలు ఆహా అనిపిస్తాయి. పార్టీలకు వెళ్ళేవారైనా, ప్రకృతి ప్రేమికులైనా, ప్రశాంతతను కోరుకునేవారైనా గోవాలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, విమానం, రైలు, బస్సు ద్వారా గోవాకు ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం..
⦿విమాన ప్రయాణం
హైదరాబాద్ నుంచి గోవాకు: హైదరాబాద్ నుంచి సుమారు 2 గంటల్లో గోవాకు చేరుకునే అవకాశం ఉంటుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో, స్పైస్ జెట్, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాల ద్వారా దబోలిమ్ లోని గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు.
వైజాగ్ నుంచి గోవాకు: విశాఖ నుంచి గోవాకు వెళ్లడానికి నేరుగా విమానాలు లేవు. హైదరాబాద్ లేదంటే బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి గోవాకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఇండిగో, ఎయిర్ ఇండియా ద్వారా గోవాకు వెళ్లొచ్చు.
విజయవాడ నుంచి గోవాకు: విజయవాడ నుంచి కూడా నేరుగా గోవాకు విమానాలు లేవు. హైదరాబాద్ లేదంటే బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా గోవాకు వెళ్లొచ్చు. ప్రయాణ సమయం సుమారు 4 గంటలు ఉంటుంది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు అందుబాటులో ఉంటాయి.
⦿ రైలు ప్రయాణం
హైదరాబాద్ నుంచి గోవాకు: వాస్కో డ గామా ఎక్స్ ప్రెస్, హైదరాబాద్–వాస్కో ఎక్స్ ప్రెస్ ద్వారా హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి రైలు ఎక్కవచ్చు. జర్నీకి సుమారు 15 నుంచి 17 గంటల సమయం పడుతుంది. ఈ రైళ్ల ద్వారా మడ్గావ్ లేదంటే వాస్కో డ గామా స్టేషన్ కు చేరుకోవచ్చు. వీకెండ్స్ లో వెళ్లాలంటే ఏసీ లేదంటే స్లీపర్ క్లాసులో టికెట్ ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
వైజాగ్ నుంచి గోవాకు: నేరుగా రైలు సౌకర్యం లేదు వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వచ్చి అక్కడి నుంచి గోవాకు వెళ్లవచ్చు. లేదంటే వైజాగ్ నుంచి హుబ్లీకి వెళ్లి అక్కడి నుంచి గోవాకు బయల్దేరవచ్చు. ప్రయాణ సమయం సుమారు 20 గంటలు పడుతుంది.
విజయవాడ నుంచి గోవాకు: విజయవాడ నుంచి నేరుగా గోవాకు రైలు లేదు. కానీ, హైదరాబాద్ కు వచ్చి అక్కడి నుంచి గోవాకు వెళ్లవచ్చు. లేదంటే, గుంతకల్, హుబ్లీ నుంచి కూడా గోవాకు చేరుకోవచ్చు. ప్రయాణ సమయం సుమారు 18 గంటల వరకు పట్టే అవకాశం ఉంది.
⦿ బస్సు ప్రయాణం
హైదరాబాద్ నుంచి గోవాకు: సుమారు 15 గంటల సమయం పడుతుంది. VRL, SRS, ఆరెంజ్ ట్రావెల్స్, KSRTC బస్సుల్లో వెళ్లవచ్చు. AC స్లీపర్, నాన్-AC స్లీపర్, వోల్వో బస్సులలో వెళ్లే అవకాశం ఉంది. టికెట ధర సుమారు రూ. 800 నుంచి 1500 ఉంటుంది.
వైజాగ్, విజయవాడ నుంచి గోవాకు: నేరుగా బస్సులు అందుబాటులో లేవు. హైదరాబాద్ లేదంటే బెంగళూరుకు వెళ్లి బస్సులు మారాల్సి ఉంటుంది. ప్రయాణ సమయం సుమారు 20 గంటలకు పైగా పడుతుంది.
⦿ సొంత కారులో వెళ్లాలంటే?
హైదరాబాద్ నుంచి గోవాకు: సుమారు 660 కిలో మీటర్ల దూరం ఉంటుంది. 12 గంటల పాటు ప్రయాణ సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి రాయచూర్, బాగల్ కోట్, బెల్గాం మీదుగా గోవాకు చేరుకోవచ్చు.
విశాఖ నుంచి గోవాకు: సుమారు 1000 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 20 గంటలు పడుతుంది. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ మీదుగా గోవాకు వెళ్లవచ్చు.
విజయవాడ నుంచి గోవాకు: సుమారు 900 కిలో మీటర్ల దూరం ఉంటుంది. విజవాడ నుంచి బయల్దేరి హైదరాబాద్ మీదుగా గోవాకు వెళ్లవచ్చు.
Read Also: విమానం ఎక్కాలా? ఈ టైమ్ లో టికెట్లు చాలా చీప్ గా దొరికేస్తాయ్!