E-Paper
Advertisement

భక్తులు ఇచ్చే విరాళాలతో ఇన్ని సేవలా? టీటీడీ గురించి ఆసక్తికర విషయాలు!

భక్తులు ఇచ్చే విరాళాలతో ఇన్ని సేవలా? టీటీడీ గురించి ఆసక్తికర విషయాలు!
Advertisement

TTD Donations: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ ఆలయం గురించి మాట్లాడే ముందు, ఆ సంస్థ ద్వారా ఎంతమంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ అంటే.. కేవలం తిరుమల ఆలయ నిర్వహణ, భక్తుల దర్శన ఏర్పాట్లు మాత్రమే కాదు. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక,  సామాజిక రంగాల్లోనూ ఈ సంస్థ తన సేవలను అందిస్తోంది. ముఖ్యంగా టీటీడీకి వచ్చే నిధుల్లో భక్తులు సమర్పించే విరాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. సామాన్య భక్తులు సైతం తమ కష్టార్జితంలో కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా స్వామి వారికి సమర్పిస్తుంటారు. ఆ విరాళాలను పలు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తోంది. ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది.

విద్యారంగంలో టీటీడీ సేవలు

టీటీడీ విద్యారంగానికి కీలక ప్రాధాన్యత ఇస్తోంది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్నినేరుగా నిర్వహించడంతో పాటు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU), పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) లాంటి విద్యాసంస్థలకు ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాకుండా, డిగ్రీ, పీజీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, సంస్కృత కళాశాలలు, ఆయుర్వేదం, పాలిటెక్నిక్, సంగీతం, నృత్యం, యోగా లాంటి పలు కోర్సులకు సంబంధించిన విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఎంతోమంది విద్యార్థులకు విద్యావకాశాలు లభిస్తున్నాయి.

పేద విద్యార్థులకు విద్య

Advertisement

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి, తిరుమల, వెల్లూరు సహా పలు ప్రాంతాల్లో పాఠశాలలు పనిచేస్తున్నాయి. సాధారణ పాఠశాలలతో పాటు వేద విద్య, సంస్కృత విద్యను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. వినికిడి, మాట సంబంధిత వైకల్యాలు ఉన్న పిల్లల కోసం తిరుపతి, వరంగల్, భీమవరం లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలలను కూడా నిర్వహిస్తోంది. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్య అందించే ప్రయత్నం చేస్తోంది.

వైద్య రంగంలోనూ ఎన్నో సేవలు

వైద్య సేవల విషయంలోనూ టీటీడీ కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్వీఐఎంఎస్ (SVIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బర్డ్ (BIRRD) ఆర్థోపెడిక్ ఆసుపత్రి, తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, తిరుపతి సెంట్రల్ ఆసుపత్రి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి లాంటి సంస్థల ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. వీటితో పాటు 15కు పైగా డిస్పెన్సరీలు, యాత్రికుల మెడికల్ సెంటర్స్ ను నడుపుతోంది. టీటీడీ నిర్వహిస్తున్న విద్యా, వైద్య సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులు, రోగులు, పేద కుటుంబాలు, సామాన్య ప్రజలు లాభం పొందుతున్నారు.

Advertisement

Read Also: శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

Tags

Related News

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల తేదీలు వచ్చేశాయ్!

తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే వీఐపీ దర్శనం!

ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

ఆహా అనిపించేలా వందేభారత్ ప్రయాణం.. అంజి ఖాడ్ బ్రిడ్జిపై అద్భుత వీడియో వైరల్!

రన్నింగ్ ట్రైన్ లో హారతి వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!

Big Stories

Advertisement
×