E-Paper
Advertisement

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్‌ ఎప్పుడంటే?

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్‌ ఎప్పుడంటే?
Advertisement

India Bullet Train Update: భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడుతోంది. దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైలు కారిడార్‌లో ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత గుజరాత్‌ లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మార్గంలో ఈ టెస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

50 కిలోమీటర్ల మార్గంలో తొలి పరీక్షలు

దేశంలో నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు కారిడార్‌లో సూరత్-బిలిమోరా మార్గం ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2027 మేలో ఈ మార్గంలో హైస్పీడ్ రైళ్లను నడిపి పరీక్షించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. ఇక రైళ్ల రాకపోకలను నియంత్రించే సిగ్నలింగ్ వ్యవస్థలను 2027 జనవరి నాటికి రెడీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ట్రయల్ రన్స్ కు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.

గంటకు 240 కి.మీకి పైగా వేగం..

Advertisement

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో వేగంతో పాటు ప్రయాణికుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గంటకు 240 కిలోమీటర్లకు పైగా వేగంతో రైళ్లను నడపాలంటే స్పెషల్ ఇంజనీరింగ్ పారామీటర్స్ అవసరమని రైల్వేమంత్రి తెలిపారు. ముఖ్యంగా రెండు హైస్పీడ్ రైళ్లు ఎదురెదురుగా లేదంటే ఒకదానికొకటి సమీపంగా ప్రయాణించే సమయంలో గాలి ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ప్రభావం రైలు బోగీలతో పాటు పట్టాలు, ఇతర రైల్వే నిర్మాణాలపై కూడా పడుతుంది. అందుకే ట్రయల్ రన్స్ సమయంలో స్పీడ్, ఎయిర్ ప్రెషర్, రైళ్ల పనితీరు లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

2027 చివరలో ఫస్ట్ బుల్లెట్ రైలు సర్వీసులు

ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ప్రయాణికుల సర్వీసులను 2027 చివరి క్వార్టర్ లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నవంబర్ 20న మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే, ఇందుకోసం ట్రయల్ రన్స్, టెక్నికల్ టెస్టులు, సేఫ్టీ చెకింగ్స్ కీలకం కానున్నాయి.

మరింత వేగంగా ముంబై-అహ్మదాబాద్‌ ప్రయాణం

Advertisement

ముంబై, అహ్మదాబాద్ దేశంలోని కీలక ఫైనాన్షియల్ నగరాలు. ఈ సిటీస్ మధ్య ప్రయాణ సమయం ఈ బుల్లెట్ రైలుతో భారగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ కారిడార్‌ లో అత్యాధునిక హైస్పీడ్ రైళ్ల కోసం స్పెషల్ ట్రాక్స్, ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!

Tags

Related News

ఇయర్ ఎండ్ హాలీడేకు ఫస్ట్ ఛాయిస్.. ఢిల్లీని వెనక్కి నెట్టిన సౌత్ సిటీ!

పులి vs సింహం.. ముఖాముఖి పోరులో పైచేయి దేనిది? నిపుణుల ఆసక్తికర విశ్లేషణ!

టికెట్లపై 20% డిస్కౌంట్.. ఇండియన్ ట్రావెలర్స్ కు ఎతిహాద్ అదిరిపోయే ఆఫర్!

ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!

వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!

వందే భారత్‌ సహా అన్ని రైళ్లలో ఫ్రీ జర్నీ.. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి అంటే?

గాల్లోనే కలకలం.. విమాన తలుపు తెరిచేందుకు ప్రయాణికుడి, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో భయానక క్షణాలు!

Big Stories

Advertisement
×