E-Paper
Advertisement

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!
Advertisement

TTD Donation Benefits: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కోరుకుంటారు. కొందరు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే, మరికొందరు కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి భారీ మొత్తంలో విరాళాలు అందించే దాతలకు ప్రత్యేక దర్శనాలు, వసతి, ప్రసాదాలతో పాటు మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తారు. విరాళం ఇచ్చే అమౌంట్ ను బట్టి ఈ సౌకర్యాలు మారుతుంటాయి. రూ.5 లక్షల నుంచి రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే వారికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందాం.

రూ.5 లక్షల విరాళంగా ఇస్తే..   

TTDకి రూ.5 లక్షలు విరాళంగా అందించే దాతలకు సంవత్సరానికి ఒకసారి ఐదుగురికి సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే, ఒక రోజు ఉచిత వసతి కల్పిస్తారు. దీనికి అదనంగా ఆరు లడ్డూలు, మహాప్రసాదం, దుపట్టా అందిస్తారు. విరాళానికి సంబంధించిన నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

రూ.10 లక్షలు విరాళంగా ఇస్తే..

Advertisement

రూ.10 లక్షల విరాళం అందించే దాతలకు మరిన్ని ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. మూడు రోజుల పాటు ఐదుగురికి VIP, సుపథం దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. మూడు రోజుల వసతి సౌకర్యంతో పాటు 10 లడ్డూలు, మహాప్రసాదం అందిస్తారు. గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మెడలియన్‌ను కూడా బహూకరిస్తారు.

రూ.25 లక్షల విరాళంతో ప్రత్యేక వసతి!

రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చే దాతలకు మూడు రోజుల పాటు VIP దర్శన సౌకర్యం కల్పిస్తారు. ప్రత్యేక వసతి సదుపాయంతో పాటు 20 లడ్డూలు, మహాప్రసాదం అందిస్తారు. అంతేకాకుండా 5 గ్రాముల బంగారు డాలర్, వెండి మెడలియన్‌ను బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంటుంది.

రూ.1 కోటి విరాళం ఇస్తే జీవితకాల VIP బ్రేక్ దర్శనం

Advertisement

TTDకి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళం అందించే దాతలకు అత్యంత ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించే విధానం ఉంది. ఇందులో జీవితకాలం ప్రత్యేక దర్శనాల సౌకర్యం, VIP బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ, సుపథం దర్శనం లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే VIP సూట్ వసతి, బంగారు డాలర్, వెండి నాణెం, వేద ఆశీర్వచనం, ప్రత్యేక సత్కారం లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.

దాతలు ఈ విషయాలు తెలుసుకోవాలి!

ఈ ప్రత్యేక సౌకర్యాలు పొందాలనుకునే దాతలు 20 రోజుల ముందుగానే TTD అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అటు సంస్థల తరఫున విరాళాలు అందించే సందర్భంలో ఈ సౌకర్యాలు 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

Read Also: తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే వీఐపీ దర్శనం!

Tags

Related News

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల తేదీలు వచ్చేశాయ్!

తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే వీఐపీ దర్శనం!

ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

ఆహా అనిపించేలా వందేభారత్ ప్రయాణం.. అంజి ఖాడ్ బ్రిడ్జిపై అద్భుత వీడియో వైరల్!

రన్నింగ్ ట్రైన్ లో హారతి వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!

ఇయర్ ఎండ్ హాలీడేకు ఫస్ట్ ఛాయిస్.. ఢిల్లీని వెనక్కి నెట్టిన సౌత్ సిటీ!

Big Stories

Advertisement
×