E-Paper

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అసలు పేరు ఏంటో తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అసలు పేరు ఏంటో తెలుసా?  ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
Advertisement

Vande Bharat Original Name: భారతీయ రైల్వేలో అత్యాధునిక, అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ఒకటి. అధునాతన సౌకర్యాలు, ఆకర్షణీయమైన డిజైన్, వేగవంతమైన ప్రయాణంతో ఈ రైలు దేశ వ్యాప్తంగా ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ రైలుకు మొదట వందే భారత్ అనే పేరుతో పిలిచేవాళ్లు కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ రైలును తొలి రోజుల్లో ఏమని పిలిచే వారంటే..

వందేభారత్ అసలు పేరు ‘ట్రైన్ 18’

ఈ రైలును తొలిసారి అభివృద్ధి చేసినప్పుడు దీనికి ‘ట్రైన్ 18’ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు 2018లో రూపుదిద్దుకుని పూర్తికావడంతో ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత 2019 జనవరిలో అధికారిక ప్రారంభానికి ముందు దీనికి ‘వందే భారత్ ఎక్స్‌ ప్రెస్’ అనే కొత్త పేరు పెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే పేరుతో అందుబాటులోకి వచ్చింది.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ గురించి..

Advertisement

వందే భారత్ స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో భారతీయ రైల్వే పలు ఆధునిక రైళ్ల కోసం విదేశీ సాంకేతికతపై ఆధారపడేవి. కానీ, ఈ ప్రాజెక్టును పూర్తిగా దేశీయ సాంకేతికతో తయారు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీనిని రూపొందించారు.  ఈ రైలును తయారు చేసిన వేగం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా కొత్త రైలు ప్రాజెక్టులు పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ట్రైన్ 18ను కేవలం 18 నెలల్లోనే తయారు చేశారు. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో నిర్మించారు. భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వందేభారత్ పితామహుడు ఎవరంటే?

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రూపకర్త భారతీయ రైల్వే మాజీ అధికారి సుధాంశు మణి. ఆయన చెన్నైలోని ICF జనరల్ మేనేజ ర్‌గా పనిచేసిన సమయంలో ఈ ప్రాజెక్టును లీడ్ చేశారు. అందుకే చాలా మంది ఆయనను  వందే భారత్ పితామహుడు  అని పిలుస్తారు. నిజానికి భారత్ విదేశాల నుంచి సెమీ హై-స్పీడ్ రైళ్లను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించింది. కానీ, ఆ ప్రణాళికలు ముందుకు సాగకపోవడంతో స్వదేశీ రైలును తయారు చేయాలనే నిర్ణయం తీసుకుంది. అదే నిర్ణయం ట్రైన్ 18 పుట్టుకకు కారణమైంది.  వందే భారత్‌ లో మరో ప్రత్యేకత ఏమిటంటే దీనికి ప్రత్యేకంగా ఇంజిన్ అవసరం ఉండదు. ఇది ఆటోమేటిక్ రైలు. అంటే, కోచ్‌ల లోనే పవర్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది.  రైలు వేగంగా కదలడం, త్వరగా వేగం పెంచుకోవడం సాధ్యమవుతుంది.  పరీక్షల సమయంలో వందే భారత్ గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే, ప్రస్తుతం మార్గాన్ని బట్టి తక్కువ వేగంతో నడుస్తోంది. అయినప్పటికీ ఇది భారతదేశంలో తయారైన అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

Advertisement

Read Also: వందే భారత్ స్లీపర్‌ లో ఫస్ట్ ఏసీ కోచ్.. దీని ముందు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ కూడా దిగదుడుపే!

Related News

వందే భారత్ స్లీపర్‌ లో ఫస్ట్ ఏసీ కోచ్.. దీని ముందు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ కూడా దిగదుడుపే!

వారెవ్వా వందే భారత్.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయాణం అంటూ విదేశీ యువతుల ప్రశంసలు!

అంతరిక్షం నుంచే బుల్లెట్ రైళ్ల కంట్రోల్.. చైనా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

తిరుపతి To రామేశ్వరం.. ఒకే ట్రిప్‌ లో 5 పుణ్యక్షేత్రాల దర్శనం!

స్వదేశీ బుల్లెట్ రైలు వస్తోంది.. 2027లో పరుగులు.. స్పీడ్ ఎంతో తెలుసా?

దేశ వ్యాప్తంగా 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!

ఒకే ట్రిప్‌ లో 8 పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC అదిరిపోయే టూర్ ప్లాన్!

Big Stories

×