E-Paper

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !
Advertisement

Ravi Shastri:   కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) కుమారుడు, ఐసీసీ బాస్ జై షా ( Jay Shah) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంచెలు అంచెలుగా… ఎదిగిన ఆయన, ఐసీసీ చైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు. మొదట బీసీసీఐ పదవులను, అనుభవించిన జై షా… ఇప్పుడు ఐసీసీని ఏలుతున్నారు. అయితే, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జై షాకు పదవులు దక్కాయని, దీని వెనక అమిత్ షా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే, ఈ ఆరోపణలను టీమిడియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కొట్టి పారేశారు. అందరూ అనుకున్నట్లుగా అమిత్ షా వల్ల, జై షాకు పదవులు రాలేదని… దీని వెనుక కఠోర శ్రమ ఉందని రవి శాస్త్రి (Ravi Shastri) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత కాళ్లపై ఐసీసీ బాస్ జై షా నిలబడ్డారని.. ఎంతో కష్టపడితే తప్ప ఆయనకు ఈ పదవులు రాలేదని తెలిపారు. కష్టం ఫలితంగానే ఇప్పుడు పెద్ద పదవులు ఆయనకు దక్కాయని వివరించారు. దీంతో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

అమిత్ షా బెదిరిస్తే, జై షాకు ప‌దవులు రాలేదు

Advertisement

ఐసీసీ (ICC) చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జై షా పైన ( Jay Shah) చాలా మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అమిత్ షా లేకపోతే అతనికి ఈ పదవులు వచ్చేవి కావని ఆడుకుంటూ ఉంటారు. అసలు క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాను ఐసీసీ చైర్మన్ ఎలా చేశారని కూడా చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్లందరికీ కౌంటర్ ఇస్తూ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఎవరిని బెదిరించి, జై షాకు పదవులు ఇప్పించలేదని రవి శాస్త్రి ( Ravi shastri) క్లారిటీ ఇచ్చారు.

ఐసీసీ బాస్ జై షా చాలా కష్టపడి పదవులను దక్కించుకున్నారని వెల్లడించారు. అందుకే ఈ స్థాయి వరకు ఎదిగారని పేర్కొన్నారు. బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్ అయి, టీమిండియా కు ఎన్నో విజయాలను అందించడానికి వెల్లడించారు. అప్పట్లో జై షా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు టీమిండియా మంచి స్థాయిలో ఉందని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయ్యే వరకు జై షా… ఐసీసీ చైర్మన్ గా కొనసాగనున్నాడు.

Advertisement

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

 

Related News

పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

Kris Srikkanth: వైభ‌వ్ టెస్టులు ఆడితే, జ‌నాలు టీవీలకే అతుక్కుపోతారు

రేపే ట్రై సిరీస్ ఫైన‌ల్స్‌..వైభ‌వ్ దెబ్బ‌కు లంక ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డ‌వ‌డం గ్యారెంటీ

బాబ‌ర్ ఆజంకు CA కంపెనీ కోట్ల‌ల్లో ఆఫ‌ర్..ఆసియాలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్ !

శ్రీశాంత్ కూతురు న‌న్ను ప‌చ్చిబూతులు తిట్టింది..హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నం !

Aqib Javed: మంత్ర దండం వేసి, పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే బాగు చేయ‌లేం

Kris Srikkanth: పాక్ ప్లేయ‌ర్లు క్రికెట్ మానేసి, ఇంట్లో మూల‌కు కూర్చోవ‌డం బెస్ట్

Big Stories

×