BigTV English

Travel Abroad: వీసా లేకుండానే విదేశాలకు ట్రిప్..! ఎలా వెళ్లాలో తెలుసా?

Travel Abroad: వీసా లేకుండానే విదేశాలకు ట్రిప్..! ఎలా వెళ్లాలో తెలుసా?

Travel Abroad: ఇండియా నుంచి దేశాలకు వెళ్లాలి అనుకునే వారికి వీసా అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనే చెప్పాలి. వీసా కోసం ఎన్నో తంటాలు పడాల్సి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏం లాభం? వీసా రాకపోవడం వల్ల విదేశాలకు వెళ్లాలనే కల కలగానే మిగిలిపోతుంది. అయితే విదేశాలకు వీసా లేకపోయిన వెళ్లొచ్చు అని తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. విమానం ఎక్కకుండానే ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లే మార్గం ఉందని తెలుసా?


రోడ్డు మార్గం ద్వారా కూడా కూడా విదేశాలకు వెళ్లొచ్చని తెలుసా? ఇండియా నుంచి ఆసియా, యూరప్‌లోని చాలా దేశాలకు రోడ్డు ద్వారా ప్రయాణం చేయొచ్చు. ఈ రోడ్ ట్రిప్ సాహసం, సరదా, ప్రకృతి అందాలతో నిండిన అద్భుత అనుభవాన్ని ఇస్తుంది. ఇండియా నుంచి రోడ్డు మీద విదేశాలకు వెళ్లే కొన్ని ఆసక్తికరమైన రూట్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ రూట్
ఈ రోడ్డు మార్గం ఇండియా నుంచి ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లడానికి చాలా ఫేమస్. దీన్ని ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ ట్రైలేటరల్ హైవే అంటారు. ఈ రూట్ మణిపూర్‌లోని మోరే నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మయన్మార్‌లోని తము, కాలేవా, మాండలే నగరాల గుండా థాయ్‌లాండ్‌లోని మే సోట్‌కు చేరొచ్చు. ఈ రూట్ దాదాపు 3,200 కిలోమీటర్లు ఉంటుంది. మయన్మార్‌లో రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, అడవులు, పర్వతాలు, స్థానిక గ్రామాలు చూస్తూ వెళ్తే చాలా మంచి అనుభూతి లభిస్తుంది. థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్, చియాంగ్ మాయ్ లాంటి నగరాలు చూడొచ్చు. ఈ రూట్‌లో వెళ్లాలంటే వెహికల్ పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే వీసా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీసాను కూడా వెంట తీసుకెళ్లడం మంచిది.


ఇండియా-నేపాల్-చైనా రూట్
ఇండియా నుంచి నేపాల్ ద్వారా చైనాకు వెళ్లే రోడ్డు మార్గం మరో బెస్ట్ ఆప్షన్. ఉత్తరప్రదేశ్‌లోని రక్సాల్ లేదా బీహార్‌లోని సోనౌలి బోర్డర్ నుంచి నేపాల్‌లోకి వెళ్లొచ్చు. నేపాల్‌లో కాట్మండు, పోఖరా లాంటి ప్లేస్‌లు చూస్తూ, అక్కడ నుంచి టిబెట్‌లోని కైలాస మానససరోవర యాత్రకు కూడా వెళ్లొచ్చు. ఈ రూట్‌లో హిమాలయాల అందాలు, బౌద్ధ సంస్కృతి, శాంతమైన వాతావరణం చూస్తే మనసు పరవశమవుతుంది. కానీ, ఈ రూట్‌లో వెళ్లాలంటే చైనా వీసా, టిబెట్ ట్రావెల్ పర్మిట్ కావాలి. రోడ్లు ఎత్తులో ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇండియా-బంగ్లాదేశ్-భూటాన్ రూట్
ఈ రూట్‌లో ఇండియా నుంచి బంగ్లాదేశ్ ద్వారా భూటాన్‌కు వెళ్లొచ్చు. పశ్చిమ బెంగాల్‌లోని ఫుల్‌బారి లేదా డావ్కీ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్‌లోకి వెళ్లి, ఢాకా, చిట్టగాంగ్ చూడొచ్చు. అక్కడ నుంచి భూటాన్‌లోని పరో, థింపూ లాంటి ప్లేస్‌లకు చేరొచ్చు. ఈ రూట్‌లో పచ్చని పొలాలు, నదులు, స్థానిక సంస్కృతులు ప్రయాణాన్ని మర్చిపోలేనిదిగా చేస్తాయి. ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే బంగ్లాదేశ్, భూటాన్ వీసాలు, బోర్డర్ పర్మిషన్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ALSO READ: ఈ ఆలయాలకు వాళ్లు పొరపాటున కూడా వెళ్లకూడదు..

ఇండియా-పాకిస్థాన్-ఇరాన్-టర్కీ రూట్
ఈ రూట్ కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. కానీ, అడ్వెంచర్ లవర్స్‌కి ఇది సూపర్ ఆప్షన్. పంజాబ్‌లోని అట్టారీ-వాఘా బోర్డర్ నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్లి, లాహోర్, ఇస్లామాబాద్ గుండా ఇరాన్‌లోని జాహెదాన్‌కు చేరుకోవచ్చు. అక్కడ నుంచి టర్కీకి దగ్గర్లో ఉండే టెహరాన్, ఇస్తాంబుల్ వరకు వెళ్లొచ్చు. ఈ రూట్‌లో హిస్టారికల్ ప్లేస్‌లు, డిఫరెంట్ కల్చర్స్, ఎడారి వ్యూస్ కనిపిస్తాయి. కానీ, ఈ రూట్‌లో సెక్యూరిటీ ఇష్యూస్ అధికంగానే ఉంటాయి. వీసా రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి.

ఇవి మస్ట్
రోడ్డు మీద విదేశాలకు వెళ్లాలంటే మంచి ప్లానింగ్ కావాలి. సరైన డాక్యుమెంట్లు, వీసాలు, వాహన పర్మిట్‌లు, రోడ్ మ్యాప్‌లు, జీపీఎస్, ఎమర్జెన్సీ మందులు, లోకల్ కరెన్సీ వంటివి వెంట తీసుకెళ్లాలి. అలాగే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి వాహనం పరిస్థితి బాగుండేలా చూసుకోవాలి. స్థానిక ఆచారాలు, భాషల గురించి కొంచెం తెలుసుకుంటే ప్రయాణం మరింత ఈజీ అవుతుంది.

Related News

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Metro Warning: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Big Stories

×