కొన్ని వీడియోలు మనల్ని సీటు ఎడ్జ్ మీద కూర్చోబెడుతాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ కుక్క దాదాపు చావు అంచుల వరకు వెళ్లింది. యముడికి అలా షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ వచ్చేసింది. ఇంతకీ ఆ కుక్క చేసిన ఘనకార్యం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..
తాజాగా 𝙎𝘼𝙍𝘾𝘼𝙎𝙌𝙊 అనే ఎక్స్ అకౌంట్ నుంచి ‘డాగేష్ భాయ్ కి స్పీడ్’ అంటూ ఓ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోలో రెండు కుక్కలు ప్లాట్ ఫారమ్ మీది నుంచి వెళ్తుంటాయి. ఎదురుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అత్యంత వేగంతో దూసుకొస్తుంది. అదే సమయంలో ప్లాట్ ఫారమ్ మీద ఉన్న డాగ్ ఒక్కసారిగా పట్టాల మీదికి దూకి వందేభారత్ రైలును తప్పించుకుని అవతలి వైపుకు వెళ్తుంది. క్షణ కాలంలో చావు నుంచి తప్పించుకుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. నిజానికి వందేభారత్ పక్క ట్రాక్ నుంచి కూడా మరో రైలు వచ్చింది. క్షణాల్లో వందేభారత్ తో పాటు మరో రైలును దాటుకుని కుక్క అవతలి వైపుకు సేఫ్ గా వెళ్లిపోవడాన్ని చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Dogesh bhai ki Speed 💀 pic.twitter.com/P0OzQfzNo1
— 𝙎𝘼𝙍𝘾𝘼𝙎𝙌𝙊 (@sarcasqo) September 16, 2025
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది సీరియస్ గా కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “బహుశ ఇది ఏఐ వీడియోలా అనిపిస్తోంది. ఏ కుక్క కూడా అంతలా రిస్క్ తీసుకోవాలి అనుకోదు” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “ఈ కుక్క వందేభారత్ రైలును దాటింది ఒకే. అవతలి వైపు రైలును ఎలా దాటింది?” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇక మరో వ్యక్తి ఫన్నీగా “డాగేష్ ఇలాగే ఉంటాడు. ఖత్రోన్ కే ఖిలాడి” అని రాసుకొచ్చాడు. “ఈ కుక్క ఆత్మహత్య చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే భయపడి బయటకు పారిపోయింది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ప్లాట్ ఫారమ్ మీద నిలబడి ఉన్న ఎవరో మూర్ఖుడు దానిని వెంబడించి ఉండాలి. లేకపోతే, ఏ కుక్క కూడా అలా పరిగెత్తదు. ఎందుకంటే అవి తెలివైన జీవులు. ఆ వ్యక్తి ఎవరో గమనించి అతడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. బోలెడు వ్యూస్ తో పాటు కామెంట్స్ పొందుతోంది. “జంతువులు మెరుపు వేగంతో చావు నుంచి బయటపడుతాయి అనేందుకు ఇదో ఉదాహారణ” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Read Also: వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!