UPSC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్ అని చెప్పవచ్చు. వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, వెకెన్సీలు, వయస్సు, దరఖాస్తు ప్రక్రియ, ఉద్యోగ ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 213 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 213
పోస్టులు – వెకెన్సీలు:
అడిషినల్ గవర్నమెంట్ అడ్వొకేట్: 5 పోస్టులు
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ : 16 పోస్టులు
అడిషనల్ లీగల్ అడ్వైజర్: 2 పోస్టులు
అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వొకేట్: 1 పోస్టులు
డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్: 2 పోస్టులు
డిప్యూటీ లీగల్ అడ్వైజర్: 12 పోస్టులు
లెక్చరర్ (ఉర్దూ) : 15 పోస్టులు
మెడికల్ ఆఫీసర్: 125 పోస్టులు
అకౌంట్స్ ఆఫీసర్: 32 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్: 3 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిగ్రీ (లా), పీజీ (ఉర్దూ), బీఈడీ, ఎంబీబీఎస్ పాసై ఉంటే సరిపోతుదుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకంటారు.
ముఖ్యమైన డేట్స్:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 13
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 2
వయస్సు: జనరల్ అభ్యర్థులకు 50 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 53 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 ఏళ్లు ఉండాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 56 ఏళ్లు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.25 ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://upsc.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది.
ALSO READ: Indian Railway Jobs: రైల్వేలో భారీగా పారా మెడికల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్