Indian Railways: సుదూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా BEML తయారు చేసిన సెమీ హైస్పీడ్ వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ కంప్లీట్ చేశారు. రైల్వే బోర్డు త్వరలో స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చే తుది మార్గాన్ని ప్రకటించనుంది. ముంబై సెంట్రల్ నుంచి మొదలుకొని అహ్మదాబాద్ వరకు వందేభారత్ స్లీపర్ రైలు తుది ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఉదయం 7.29 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయల్దేరిన ఈ రైలు మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబై సెంట్రల్ కు చేరుకుంది.
తుది పరీక్షల తర్వాతే రైల్వేకు అప్పగింత
వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన అన్ని పరీక్షలను పూర్తి చేసిన తర్వాతే రెగ్యులర్ సర్వీస్ కోసం భారతీయ రైల్వే సంస్థకు అప్పగిస్తారు. గత కొన్ని రోజులుగా ఈ రైలుకు సంబంధించి పలు ట్రయలర్స్ కొనసాగాయి. ఈ రైలు రీసెంట్ గా గరిష్టంగా గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. జనవరి 2న రాజస్థాన్ లోని కోటా- లాబన్ మధ్య గంటలకు 180 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంది. కోటా-నాగ్డా, రోహల్ ఖుర్ద్- చౌ మహ్లా సెక్షన్లలో వరుసగా గంటకు 170, 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. వచ్చే వారం ఈ రైలు అన్ని పరీక్షల్లో పాసైనట్లు రైల్వే అధికారులు సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రైల్వే బోర్డు దానిని ఏ రూట్ లో అందుబాటులోకి తీసుకురావాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు
వందేభారత్ స్లీపర్ రైలు ఆస్టెనిటిక్ స్టెయిన్ లెస్ స్టీల్ రూపొందించబడింది. ప్రయాణీకుల భద్రత కోసం క్రాష్ సేఫ్టీని కలిగి ఉంది. GFRP ప్యానెల్లతో హైక్లాస్ ఇంటీరియర్స్ ను కలిగి ఉంది. ఎరో డైనమిక్ బయటి భాగాన్ని కలిగి ఉంది. మాడ్యులర్ ప్యాంట్రీతో పాటు EN 45545 ఫైర్ రెసటిస్టెన్స్ ను కలిగి ఉంది. దివ్యాంగ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్త్ లు, టాయిలెట్లు ఉన్నాయి. ఆటోమేటిక్ బయటి డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ తలుపులను ఏర్పాటు చేశారు. బయో టాయిలెట్స్, డ్రైవింగ్ సిబ్బంది కోసం టాయిలెట్ ఏర్పాటు చేశారు. 1 క్లాస్ AC కార్ లో వేడి నీటితో షవర్ ఏర్పాటు చేశారు. USB ఛార్జింగ్ తో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్ మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. విశాలమైన లగేజ్ రూమ్, అటెండర్ల కోసం 38 ప్రత్యేక సీట్లు ఉన్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు లో సీట్ల ఏర్పాటు ఎలా ఉంటుందంటే?
వందేభారత్ స్లీపర్ రైలులో 16 కోచ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 11 AC-3 టైర్ కోచ్‌లు, 4 AC-2 టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ AC కోచ్ ఉంటాయి. ఇవన్నీ టైప్ A, C పరికరాల కోసం ఛార్జింగ్ పోర్టులు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ సిస్టమ్, ల్యాప్ టాప్ ఛార్జింగ్ సెటప్ లాంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటాయి. ఫస్ట్ AC కోచ్ లో 24 సీట్లు ఉండగా, సెకెండ్ AC కోచ్‌లలో ఒక్కోదాంట్లో 48 సీట్లు ఉన్నాయి. థర్డ్ AC కోచ్ లలో, ఐదింట్లో 67 సీట్లు, మరో నాలుగింటిలో 55 సీట్లు ఉన్నాయి.
Read Also: ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా టికెట్ తీసుకొని ఎక్కేయొచ్చు!