చాలా మంది ప్రయాణీకులు రిజర్వేషన్లు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా రిజర్వేషన్లు లేకుండా సేవలను పొందేందుకు వీలు కల్పించేలా కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులు ఉన్న మార్గాల్లో ఈ రైళ్లు సేవలు అందిస్తాయి. ఈ రైళ్లలో వెళ్లాలి అనుకునే వాళ్లు బోర్డింగ్ స్టేషన్ లో జనరల్ టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. UTS యాప్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రైళ్లలో జనరల్, చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.
కొత్త రైళ్లు, షెడ్యూల్ వివరాలు
IRCTC తాజాగా తీసుకొచ్చిన 10 కొత్త రైళ్లు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతాయి. ఇంతకీ ఆ రైళ్లు ఏ మార్గాల్లో నడుస్తాయి. టైమింగ్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ముంబై- పుణె సూపర్ ఫాస్ట్: ముంబై నుండి ఉదయం 7:30 గంటలకు బయల్దేరి ఫుణె వరకు వెళ్తుంది.
⦿హైదరాబాద్- విజయవాడ ఎక్స్ ప్రెస్: హైదరాబాద్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:00 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
⦿ఢిల్లీ- జైపూర్ ఎక్స్ ప్రెస్: ఢిల్లీ నుంచి ఉదయం 6:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1:30 గంటలకు జైపూర్ చేరుకుంటుంది.
⦿లక్నో-వారణాసి ఎక్స్ ప్రెస్: లక్నో నుంచి ఉదయం 7:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1:30 గంటలకు వారణాసి చేరుకుంటుంది.
⦿కోల్ కతా- పాట్నా ఇంటర్ సిటీ: కోల్ కతా నుంచి ఉదయం 5:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2:00 గంటలకు పాట్నా చేరుకుంటుంది.
⦿అహ్మదాబాద్- సూరత్ సూపర్ ఫాస్ట్: అహ్మదాబాద్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12:30 గంటలకు సూరత్ చేరుకుంటుంది.
⦿పాట్నా- గయ ఎక్స్ ప్రెస్: ఉదయం 6:00 గంటలకు పాట్నా నుంచి బయల్దేరి రాత్రి 9:30 గంటలకు గయ చేరుకుంటుంది.
⦿జైపూర్- అజ్మీర్ సూపర్ ఫాస్ట్: ఉదయం 8:00 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి రాత్రి 11:30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది.
⦿చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్: ఉదయం 8:00 గంటలకు చెన్నై నుండి బయల్దేరి మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
⦿భోపాల్- ఇండోర్ ఇంటర్ సిటీ: ఉదయం 6:30 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:00 గంటలకు ఇండోర్ చేరుకుంటుంది.
Read Also: మీ టికెట్ తో వేరే వాళ్లు కూడా జర్నీ చెయ్యొచ్చు, ఇండియన్ రైల్వే కొత్త రూల్ గురించి తెలుసా?
టికెట్లు ఎలా తీసుకోవాలి?
⦿తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు స్టేషన్ టికెట్ కౌంటర్ లో తీసుకోవచ్చు.
⦿మీరు స్టేషన్ కౌంటర్ ముందుక క్యూలో నిలబడటం ఇష్టం లేకపోతే UTS (అన్‌రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿అటు ఈ సమీపంలోని జన సేవా కేంద్రం (పబ్లిక్ సర్వీస్ సెంటర్) నుంచి కూడా టికెట్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
Read Also: పాపం, చవకగా వచ్చాయని కొంటే.. పాత సామాన్లుగా మారిన 20 చైనా మేడ్ రైళ్లు!