BigTV English

Trump USA President Oath : అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్‌.. కంబ్యాక్ ప్రెసిడెంట్‌గా రికార్డ్

Trump USA President Oath : అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్‌.. కంబ్యాక్ ప్రెసిడెంట్‌గా రికార్డ్

Trump USA President Oath | అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో సోమవారం అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, టెక్ మేధావులు, ప్రముఖులు హాజరయ్యారు. వారి సమక్షంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. 2024 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల ట్రంప్‌ నకు, అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.


ఈ సందర్భంగా ట్రంప్ 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణస్వీకారం కోసం ఉపయోగించిన చారిత్రక బైబిల్‌ను, అలాగే తన వ్యక్తిగత బైబిల్‌ను చేతిలో పట్టుకొని బాధ్యతలు చేపట్టారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు విచ్చేయగా, క్యాపిటల్ హిల్ రోటుందా సందడిగా మారింది.

తన హయాంలో అమెరికా స్వర్ణ యుగంగా ఉంటుందని వాగ్దానాలు చేసిన ట్రంప్ బైడెన్ తరువాత అత్యంత వృద్ధ ప్రెసిడెంట్ గా చరిత్ర సృష్టించారు. అలాగే ఒకసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి మరోసారి విజయం సాధించిన రెండో అమెరికన్ ప్రెసిడెంట్ గా రికార్డ్ నెలకొల్పారు. అంతకుముందు 1893లో అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ కూడా అధ్యక్ష పదవి ఒకసారి కోల్పోయి మరోమారు ఎన్నికల్లో గెలుపొందారు.


ట్రంప్-బైడెన్ భేటీ
ప్రమాణస్వీకారోత్సవానికి ముందు ట్రంప్ జో బైడెన్‌ను కలిసేందుకు శ్వేతసౌధానికి వెళ్లారు. బైడెన్ దంపతులు ట్రంప్‌ను సాదరంగా ఆహ్వానించగా, ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అనంతరం శ్వేతసౌధం నుంచి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండాలో నిర్వహించిన ప్రమాణస్వీకార వేడుకకు ఇద్దరూ ఒకే వాహనంలో చేరుకున్నారు.

భారత ప్రతినిధులు వేడుకలో భాగం
భారత దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున హాజరైన జైశంకర్, మోదీ రాసిన శుభాకాంక్షల లేఖను ట్రంప్‌కు అందజేశారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకార వేడుకకు భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని జైశంకర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు.

ప్రముఖులు, మాజీ అధ్యక్షులు హాజరు
ఈ వేడుకలో పలువురు మాజీ అమెరికా అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొన్నారు. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, లారా బుష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే బరాక్ ఒబామా ఈ వేడుకకు హాజరైనా, మిచెల్లీ ఒబామా మాత్రం ఈ కార్యక్రమానికి రావడం లేదని ముందే ప్రకటించారు.

ట్రంప్ ప్రమాణస్వీకార వేడుక సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమాలు, పరేడ్‌లు విచ్చేసిన అతిథులను ఎంతో ఆకట్టుకున్నాయి. వేడుకలో అమెరికా సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ట్రంప్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న నేతలతో పాటు, ప్రముఖ వ్యాపార దిగ్గజాలు వివేక్ రామస్వామి, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ట్రంప్ ప్రమాణస్వీకార వేడుక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా చరిత్రలో మరో జ్ఞాపకంగా నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×