ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో భారతీయ రైల్వే ఒకటి. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ లోనే ఎక్కువగా రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. నిత్యం రైల్వే ప్రయాణం ద్వారా కోట్లాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తక్కువ టికెట్ ధరలు, మెరుగైన సౌకర్యాల కారణంగా చాలా మంది ప్రయాణీకులు రైల్వే జర్నీని ఎంచుకుంటున్నారు. సుదూర ప్రయాణాలు చేసేవాళ్లలో ఎక్కు వ మంది రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ప్రతి రోజూ వేలాది రైళ్లను నడుపుతున్నది. దేశ వ్యాప్తంగా సుమారు 7000 రైల్వే స్టేషన్లను నిర్వహిస్తున్నది. అయితే, గత కొంతకాలంగా భారతీయ రైల్వే సంస్థ పలు రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నది. ఇంతకీ రైల్వే స్టేషన్లు ఎందుకు మూతబడుతున్నాయి? రీసెంట్ గా భారత్ లో ఎన్ని రైల్వే స్టేషన్లు క్లోజ్ అయ్యాయి.? రైల్వే స్టేషన్ మూసివేయడానికి పాటించాల్సిన రూల్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్టేషన్లను మూసి వేయడానికి పాటించాల్సిన రూల్స్ ఏంటి?
రైల్వేలో ఏ పని చేయాలన్నా, చేయకూడదన్నా తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్లు క్లోజ్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ పాటించాలి. రైల్వే యంత్రాంగం యథేచ్ఛగా స్టేషన్లు మూసివేస్తామంటే కుదరదు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒక స్టేషన్ లాభదాయకం కాదని భావించినట్లయితే లేదంటే ప్రయాణీకుల అవసరాలను తీర్చకపోతే వాటిని మూసివేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక స్టేషన్ లో బ్రాంచ్ లైన్లలో రోజుకు 25 కంటే తక్కువ మంది ప్రయాణీకులు ఉండటం, మెయిన్ లైన్లలో 50 మంది ప్రయానీకులు ఉంటే క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, సదరు స్టేషన్ ను మూసివేయాలా? వద్దా? అని తుది నిర్ణయం తీసుకునేది మాత్రం రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోనే ఉంటుంది.
ఇటీవల భారత్ లో ఎన్ని రైల్వే స్టేషన్లు మూసివేయబడ్డాయి?
దేశంలో రీసెంట్ గా రెండు రైల్వే స్టేషన్లను క్లోజ్ చేస్తూ భారతీయ రైల్వే సంస్థ నిర్ణయం తీసుకుంది. వాటిలో ఒకటి పశ్చిమ బెంగాల్ లోని కల్యాణ్ పూర్ రైల్వే స్టేషన్ కాగా, మరొకటి యూపీలోని రావత్ పూర్ రైల్వే స్టేషన్. ప్రస్తుతం ఈ స్టేషన్ల మూసివేత ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక ఏపీలో 2020-21లో ఏపీలో ఏకంగా ఏడు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ మూసి వేసింది. తక్కువ ప్రజాదరణ, లాభదాయక కాకపోవం మూలంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తమిళనాడులోని సేలం-కరూర్ లైన్ లో ఉన్న వంగల్ స్టేషన్ ను కూడా మూసివేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర రైల్వేశాఖ ఈ స్టేషన్ ను క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రయాణీకుల రద్దీ లేని స్టేషన్లు మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. అంతేకాదు, అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆదరణ లేని రైల్వే స్టేషన్లను క్లోజ్ చేయాలని నిర్ణయించింది. లాభదాయం కాని మరికొన్ని స్టేషన్లను కూడా రైల్వే అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది. వాటిని కూడా త్వరలో మూసివేయనున్నట్లు తెలుస్తున్నది.
Read Also: కుర్రాళ్లకు క్రేజీ న్యూస్.. హైదరాబాద్ నుంచి గోవాకు వందే భారత్?