Digital Arrest : సైబర్ క్రైమ్, సైబర్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్.. ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త రకాలుగా స్కామర్స్ రెచ్చిపోయి ఎందరినో మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్, ఈ మెయిల్ స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులతో పాటు కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. ఎక్కడో ఒకచోట ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫేక్ ఆఫీసర్స్ ముసుగులో ఎంతో మంది మోసపోగా తాజాగా గుజరాత్ లో ఇలాంటి మరో ఘటన బయటపడింది.
ఎప్పటికప్పుడు కొత్త స్కామ్స్ బయటపడుతూనే వస్తున్నాయి. డిజిటల్ అరెస్టులో ఫేక్ ఆఫీసర్స్ పేరుతో మోసాలు చేస్తుంటారని, వాట్సప్ వీడియో కాల్స్ చేస్తూ భయపడతారని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఏదో ఒకచోట మోసాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ట్రాయ్ ఆఫీసర్ అంటూ ఓ 25 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ ను నేరగాళ్లు తమ బుట్టలో వేసుకొని అతని నుంచి రూ.3 లక్షలు దోచేశారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ చార్టెడ్ అకౌంట్ ను స్కామర్స్ తమ వలలో వేసుకున్నారు. టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నామంటూ ఆ వ్యక్తికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డు నెంబర్ పై ఎన్నో సిమ్స్ ఉన్నాయని.. వీటన్నిటికీ పర్మిషన్స్ లేవని.. ఎన్నో సైబర్ నేరాలు ఈ ఫోన్ నెంబర్స్ తో జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఆ చార్టెడ్ అకౌంటెంట్ నమ్మకపోవటంతో స్కామర్స్ అతనికి మరొక వ్యక్తి నుంచి కాల్ చేసి.. ఆఫీసర్ కు కనెక్ట్ చేసి వీడియో కాల్ ద్వారా లైవ్ లోకి తీసుకున్నారు. ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి పెద్ద ఆఫీసర్ లా కనిపించడంతో పాటు అక్కడ రూమ్ అంతా ట్రాయ్ సెటప్ ఉండటంతో ఆ వ్యక్తి నిజంగా పెద్ద ఆఫీసర్ అని నమ్మి తానే తప్పు చేయలేదంటూ కావాలంటే వెరిఫై చేసుకోమని చెప్పాడు.
అయితే ఇది పెద్ద కేసు అవుతుందని అప్రమత్తంగా ఉండకపోతే సీబిఐ ఎంక్వైరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. తనకు ఏదైనా మార్గం ఉంటే చెప్పమని ఆ అకౌంటెంట్ అడగడంతో అప్పటి వరకూ మాట్లాడుతున్న వ్యక్తి ముందుగా కొంత అమౌంట్ను డిపాజిట్ చేస్తే వెరిఫై చేస్తామని ఆపై తిరిగి ఇస్తామని నమ్మించారు. ఈ విషయం నిజమని నమ్మిన ఆ చార్టెడ్ అకౌంటెంట్ వారి అకౌంట్ లోకి రూ. 2.92 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు.
ఇక ఎప్పుడైతే చార్టెడ్ అకౌంటెంట్ ఆ డబ్బులు పంపించాడో ఆపై ఆ వ్యక్తుల నుంచి మళ్లీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అదే నెంబర్ కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయాననే విషయం అర్థమయ్యి.. ఈ విషయంపై వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చాడు.
ఇక ఇలాంటి నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కడికక్కడే జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తో పాటు చార్టెడ్ అకౌంటెంట్స్, ఉద్యోగస్తులు మోసపోతున్నారు. ప్రతీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి నేరాలు జరగడంతో జాగ్రత్త అవసరమని సైబర్ పోలీసులు తెలుపుతున్నారు.
ALSO READ : మొబైల్ ఛార్జింగ్ లో ఈ తప్పులు చేస్తున్నారా!