రైల్వే వంతెలను పలు రకాలుగా ఉంటాయి. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఈ వంతెనలను నిర్మిస్తారు. నిర్మించే స్థానం, పొడవు, ఎత్తు, వంతెన మీది నుంచి వెళ్లే బరువు, ట్రాఫిక్ పరిమాణం సహా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని వీటని నిర్మిస్తారు. ఒక్కో వంతెనకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రైల్వే వంతెనల్లో ఎన్ని రకాలు ఉంటాయి. ఏ రకమైన వంతెన బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వే వంతెనల రకాలు
⦿ ఆర్చ్ వంతెనలు
ఇవి చాలా బలంగా వంపు తిరిగిన డిజైన్ తో ఉంటాయి. తరచుగా పొడవైన స్పాన్లకు వీటిని ఉపయోగిస్తారు. ఈ రకం వంతెనలు ఒకటి అంతకు మించి వంపులను కలిగి ఉంటాయి. గతంలో వీటిని రాయి, ఇటుకలతో నిర్మించే వాళ్లు. ఇప్పుడు ఐరన్, స్టీస్, కాంక్రీట్ తో కూడిన వంపులను నిర్మిస్తున్నారు. ఎక్కువ బలంగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కానీ నిర్మించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
⦿ బీమ్ వంతెనలు
ఇది చాలా సరమైళన వంతెన రకం. ఖర్చుతో కూడుకున్నది. వీటి నిర్మాణంలో స్పాన్ ను కవర్ చేయడానికి అవసరమైన పొడవు గల క్రాస్ బీమ్, ప్రతి చివరన కింద అబ్యూట్ మెంటను నుంచి సపోర్టు ఉంటుంది. ఒక బీమ్ బ్రిడ్జి మీద ఉన్న డెక్ కు సపోర్టు చేయడానికి సమాంతరంగా నడుస్తున్న అనేక బీమ్ లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటి నిర్మాణం చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా నిర్మించే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ బ్రిడ్జిలు వంగిపోయే అవకాశం ఉంటుంది.
⦿ కాంటిలివర్ వంతెనలు
ఇవి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వంతెనను నిర్మించడానికి ఉపయోగపడుతాయి. మధ్యలో ఓవర్ హాంగింగ్ బీమ్ లను కలిగి ఉంటాయి. సెంటర్ సపోర్టు లేకుండా పొడవైన స్పాన్ లకు కలిగి ఉంటాయి. ఈ వంతెనను భూమికి సురక్షితంగా లంగరు వేసిన స్తంభాలను ఉపయోగించి నిర్మిస్తారు. లోతైన రాతి లోయలు, వరదలకు గురయ్యే ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి నిర్మాణం చాలా రిస్క్ తో పాటు ఖర్చుతో కూడుకుని ఉంటుంది.
⦿ సస్పెన్షన్ వంతెనలు
ఇవి ప్రధానంగా సస్పెన్షన్ కేబుల్స్ సపోర్టుతో నిర్మించబడుతాయి. డెక్ కు సపోర్టు ఇవ్వడానికి టవర్ల మధ్య సస్పెండ్ చేయబడిన కేబుల్ లను ఉపయోగిస్తారు. చాలా పొడవైన స్పాన్ లకు అనుకూలంగా ఉంటాయి. కనీస స్తంభాలతో పొడవైన స్పాన్ లను సృష్టించడానికి సాయపడుతాయి. ఒకవేళ ఒక్క కేబుల్ ప్రమాదవశాత్తు కూలిపోయినా మొత్తం వంతెన కూలిపోయే అవకాశం ఉంది.
⦿ కేబుల్ స్టేడ్ వంతెనలు
సస్పెన్షన్ వంతెనల మాదిరిగానే ఉంటాయి. కానీ, టవర్లకు బదులుగా డెక్ కు నేరుగా లంగరు వేయబడిన కేబుల్స్ తో వీటిని నిర్మిస్తారు. ఈ కేబుల్స్ డెక్ పైభాగం నుండి దిగువకు వస్తారు. ఇతర వంతెనలతో పోల్చితే వేంగా నిర్మాణం జరుపుకుంటాయి. తక్కువ, మధ్యస్థ దూరాలకు అనుకూలంగా ఉంటాయి.
⦿ టైడ్ ఆర్చ్ వంతెనలు
ఆర్చ్, సస్పెన్షన్ వంతెన డిజైన్ ను మిక్స్ చేసి ఉంటుంది. సాంప్రదాయ వంపు వంతెన మాదిరిగా కాకుండా డెక్ పైన ఉంటుంది. ఇది చాలా బలంగా ఉంటుంది. అయితే, ఒక హ్యాంగర్ విరిగిపోతే మొత్తం బ్రిడ్జి ప్రమాదంలో పడుతుంది.
⦿ ట్రస్ వంతెనలు
బలం, దృఢత్వం కోసం ఇంటర్ కనెక్టడ్ ట్రాయాంగిల్ నెట్ వర్క్ ను ఉపయోగిస్తారు. ఇవి చిన్న స్పాన్ల రైల్వే వంతెనలకు ఉపయోగపడతాయి. వీటిని ఉక్కుతో బలంగా నిర్మిస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. అయితే, వీటిని నిర్మించడానికి చాలా స్థలం అవసరం.
Read Also: భలే.. ఈ పడవ వంతెనలా మారిపోతుంది, ఈ అద్భుతం ఎక్కడో తెలుసా?