OTT Movie : ఓటిటిలో మలయాళం సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. మలయాళం సినిమాలంటే ముందుగా గుర్తుకొచ్చేది మమ్ముట్టి, మోహన్ లాల్. వీళ్ళిద్దరూ మలయాళం ఇండస్ట్రీకి లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ మూవీలో స్వలింగ సంపర్కుడిగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జ్యోతిక ఇందులో కథానాయికగా నటించింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘కథల్: ది కోర్’ (Kaathal : The Core). 2023 లో విడుదలైన ఈ మలయాళం మూవీకి జియో బేబీ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి కంపానీ బ్యానర్‌పై మమ్ముట్టి ఈ మూవీని నిర్మించారు. ఇందులో మమ్ముట్టి, జ్యోతిక, సుధీ కోళికోడ్, పూజా మోహన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 23 నవంబర్ 2023న థియేటర్లలో విడుదల అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఓటీటీలో 2024 జనవరి 4 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
స్టోరీ లోకి వెళితే
హీరో, హీరోయిన్ లకు పెళ్లి జరిగి ఇరవై సంవత్సరాలు అవుతుంది. వీళ్ళిద్దరికీ టీనేజ్ కు వచ్చిన కూతురు కూడా ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య మాటలు పెద్దగా ఉండవు. హీరో బ్యాంకు ఎంప్లాయ్ గా మంచి పేరు తెచ్చుకొని రిటైర్డ్ అవుతాడు. అతనికి మంచి పేరు ఉండటంతో ఎలక్షన్లో వార్డ్ మెంబర్ గా నిలబెడతారు. ఇంతలో హీరోయిన్ భర్త మీద విడాకుల కోసం అప్లై చేస్తుంది. ఈ వయసులో విడాకులు అవసరమా అని భార్యను అడుగుతాడు హీరో. ఆమె మాత్రం నేను ఇప్పటికే చాలా కోల్పోయానని అంటూ బాధపడుతుంది. విడాకులకు కారణం తెలుసుకొని ఊర్లో వాళ్లంతా గుసగుసలు ఆడుతూ ఉంటారు. దగ్గర్లో ఎలక్షన్స్ ఉండటంతో ఈ కేసు వీటిపై ప్రభావం చూపిస్తుంది అనుకుంటాడు హీరో. ఎలక్షన్లు వచ్చే లోపు ఈ కేసును ముగించాలని లాయర్ ని మాట్లాడుతాడు. అయితే వాళ్ల దగ్గర ఏదో నిజం దాస్తూ మాట్లాడుతుంటాడు.
హీరోయిన్ మాత్రం తనకు భర్త ఫిజికల్ గా దూరంగానే ఉన్నాడని, అందుకే విడాకులు తీసుకుంటున్నానని చెప్తుంది. హీరో ఒక స్వలింగ సంపర్కుడని హీరోయిన్ భావిస్తూ ఉంటుంది. అదే ఊర్లో ఉండే మరో వ్యక్తితో ఈ వ్యవహారం జరుగుతుందని అందరూ అనుకుంటారు. ఎలక్షన్లలో కూడా హీరో గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు అపోజిషన్ వాళ్ళు. ఎలెక్షన్ల ముందే కోర్టులో ఈ కేసు విచారణ కూడా మొదలవుతుంది. చివరికి వీళ్ళిద్దరికీ విడాకులు వస్తాయా? హీరో నిజంగా స్వలింగ సంపర్కుడా? ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కథల్: ది కోర్’ (Kaathal : The Core) అనే ఈ మలయాళం మూవీని మిస్ కాకుండా చూడండి.