రైలు ప్రయాణం చేసే వారికి ట్రాన్స్ జెండర్లు ఎదురవుతూనే ఉంటారు. వారు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ ఉంటారు. కొంతమంది వారి బాధపడలేక ఇచ్చేస్తారు. మరికొందరు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆస్కార్ లెవెల్ యాక్టింగ్‌తో ట్రాన్స్ జెండర్ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఇలాంటివ సినిమాల్లోనే కాదు బయట కూడా మన దగ్గర కమల్ హాసన్ లాంటి ఉత్తమ నటులు ఉన్నారని ఇలాంటి వీడియోలు చెబుతూ ఉంటాయి.
ట్రాన్స్ జెండర్ డబ్బులు అడగ్గానే
ఈ వీడియోలో ఒక ట్రాన్స్ జెండర్ రైల్లోని ప్రతి ప్రయాణికుడి దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతోంది. అలాగే ఒక వ్యక్తి దగ్గర కూడా వచ్చి డబ్బులు అడిగింది. అతడు ట్రాన్స్ జెండర్‌ను చూసిన వెంటనే తను మూగ, చెవిటి వాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దాంతో ఆ ట్రాన్స్ జెండర్ మనసు కరిగిపోయింది. అతని తలపై చేతులు వేసి దీవించి వెళ్ళిపోయింది ఆమె వెళ్లిపోగానే తన అసలు రూపాన్ని చూపించాడు. ప్రయాణికుడు అతనికి మాటలు వచ్చు. చెవిటివాడు కూడా కాదు. కేవలం ట్రాన్స్ జెండర్ నుంచి తప్పించుకోవడం కోసమే అలా యాక్టింగ్ చేశాడు.
బాగా నవ్వించేశాడు
చెవిటి, మూగవాడిలా నటించడం అంత సులువైన విషయం కాదు. ఇతడు మాత్రం నిజమైన మూగవాడిలా, చెవిటివాడులా నటించాడు. తన హావ భావాలతో ఎదుటివారిని నమ్మించేసాడు. ఆమె మాట వినబడడం లేదని మూగ భాషలో వివరించడానికి ప్రయత్నించాడు. మరొక ప్రయాణికుడు ఆ వీడియోను తన ఫోన్లో తీశాడు. ట్రాన్స్ జెండర్ అతని నటనకు తేలికగానే పడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన ప్రయాణికులు మాత్రం నవ్వసాగారు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేస్తే వేలాది మంది లైక్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కొంతమంది ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తూ కామెంట్లు పెడితే.. మరికొందరు ఇలా రైళ్లల్లో ట్రాన్స్ జెండర్ లు ఎందుకు డబ్బులు అడుగుతారు అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు పెట్టారు. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఖచ్చితంగా నవ్వు వస్తుంది.