E-Paper
Advertisement

ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!

ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!
Advertisement

Best Road Trips in Andhra Pradesh: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రోడ్డు ప్రయాణం చేయాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పొగమంచు కప్పుకున్న కొండలు, పచ్చని అడవులు, అందమైన జలపాతాలు, లోతైన లోయలు.. ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా తూర్పు కనుమల అందాల మధ్య సాగే రోడ్ ట్రిప్‌లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.  అలాంటి వాటిలో ఐదింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.విశాఖపట్నం – అరకు – లంబసింగి

ఆంధ్రప్రదేశ్‌ లో అత్యంత అందమైన రోడ్ ట్రిప్‌లలో విశాఖపట్నం నుంచి అరకు మీదుగా లంబసింగి వెళ్లే రూట్ ఒకటి. సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు చేరుకోవడానికి దాదాపు 3.5 గంటల సమయం పడుతుంది. మధ్యలో కనిపించే కొండలు, హెయిర్‌ పిన్ మలుపులు, కాఫీ తోటలు ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తాయి.

Advertisement

అరకు సమీపంలోని బొర్రా గుహలు, చాపరాయి జలపాతం తప్పక చూడాల్సిన ప్రదేశాలు. అక్కడి నుంచి లంబసింగి వెళ్తే పొగమంచుతో కప్పుకున్న లోయలు, చల్లని వాతావరణం, స్ట్రాబెర్రీ తోటలు కనువిందు చేస్తాయి. ఈ ప్రయాణానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైమ్.

2.నల్లమల ఫారెస్ట్ – శ్రీశైలం

అడవుల మధ్య ప్రయాణం ఇష్టపడేవారికి నల్లమల అడవి మీదుగా శ్రీశైలం వెళ్లే రూట్ బెస్ట్ ఆప్షన్. దట్టమైన చెట్లు, కొండల మధ్య మలుపులు, కృష్ణా నది అందాలు ఈ ప్రయాణంలో స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. శ్రీశైలం డ్యామ్, చుట్టుపక్కల లోయల దృశ్యాలు పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. అయితే, ఈ మార్గంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫారెస్ట్ రూట్ గేట్లు మూసివేస్తారు. సో, ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.

3.రాజమండ్రి – మారేడుమిల్లి

Advertisement

పచ్చని ప్రకృతి, జలపాతాలు చూడాలనుకునేవారు రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ప్రయాణాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గోదావరి ప్రాంతం నుంచి తూర్పు కనుమల అడవుల్లోకి సాగే ఈ మార్గంలో వెదురు చెట్లు, అందమైన కొండలు కనిపిస్తాయి. అమృతధార జలపాతం, శోలేరు వాగు వ్యూ పాయింట్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. స్థానిక గిరిజన వంటకాలను కూడా టేస్టీ చేయవచ్చు.

4.గండికోట – బెలూం గుహలు

చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు రెండింటినీ చూడాలనుకునేవారికి గండికోట మంచి ఎంపిక. పెన్నా నది మధ్యలో ఏర్పడిన లోతైన ఎర్రటి రాతి లోయను చూడటం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఇక్కడి చారిత్రక కోటతో పాటు బెలూం గుహలను కూడా సందర్శించవచ్చు.

5.బెంగళూరు – హార్స్లీ హిల్స్

చల్లని వాతావరణం, కొండల అందాలు ఇష్టపడేవారు హార్స్లీ హిల్స్‌ కు వెళ్లవచ్చు. యూకలిప్టస్ చెట్ల మధ్య సాగే మలుపుల రహదారులు, అందమైన సూర్యాస్తమయ దృశ్యాలు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Read Also: ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

Tags

Related News

రన్‌వే పైకి దూసుకొచ్చిన శునకం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులో ఘటన

లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

Big Stories

Advertisement
×