E-Paper
Advertisement

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?
Advertisement

Vande Bharat Sleeper vs Rajdhani Express: భారతీయ రైల్వే రోజు రోజుకు అప్ గ్రేడ్ అవుతోంది. రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం ఇటీవల తీసుకొచ్చింది. దీంతో ఇన్నాళ్లు అత్యంత ఖరీదైన, వీఐపీ సర్వీసుగా పేరుగాంచిన ‘రాజధాని ఎక్స్ ప్రెస్’ రైలుతో వందేభారత్ స్లీపర్ రైలును పోలుస్తున్నారు. కాబట్టి ఈ అత్యంత విలాసవంతమైన రైళ్లకు సంబంధించి ఛార్జీలు, వేగం, సౌకర్యాల పరంగా ఉన్న తేడాలేంటో ఇక్కడ పరిశీలిద్దాం.

వందేభారత్ స్లీపర్ ఛార్జీలు

వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక సౌకర్యాల పరంగా చూస్తే వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ థర్డ్ ఏసీ (3AC).. కిలోమీటరుకు రూ.2.53 చొప్పున లెక్కిస్తే 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ దాదాపు రూ.2,530 ఖర్చు కానుంది. అదే సెకండ్ ఏసీ ప్రతీ కి.మీకు రూ.3.26 చొప్పున రూ.3,260, ఫస్ట్ ఏసీ రూ.4000 (కి.మీ రూ.4) వరకు అవుతుందని అంచనా.

రాజధాని ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు

Advertisement

వందే భారత్ స్లీపర్ తో పోలిస్తే రాజధాని ఎక్స్ ప్రెస్ ధర కాస్త తక్కువగా ఉంది. 1,000 కిలోమీటర్ల దూరానికి గాను థర్డ్ ఏసీకి సుమారు రూ.1,900, సెకండ్ ఏసీకి రూ.2,600, ఫస్ట్ ఏసీకి రూ.3,200 వరకు టికెట్ ఛార్జీ ఉండనుంది. అయితే ‘ఫ్లెక్సీ ఫేర్’ సిస్టమ్ కారణంగా మార్గాలను బట్టి రాజధాని ఎక్స్ ప్రెస్ ఛార్జీలు మారుతుండటం గమనార్హం.

వేగంలో దేనిది పైచేయి?

గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడంలో సెమీ హైస్పీడ్ రైలైన వందే భారత్ స్లీపర్ ముందంజలో ఉంది. వందే భారత్ స్లీపర్ రైలును గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. కాబట్టి వారణాసి నుంచి న్యూఢిల్లీ మధ్య ప్రయాణాన్ని ఇది కేవలం 9 – 20 గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలదు. మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 130 కిలోమీటర్లకు పరిమితమై ఉంది. వేగం కాస్త తక్కువైనా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి ప్రధాన మార్గాల్లో ఇతర సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే రాజధాని చాలా వేగంగా ప్రయాణికులను చేరవేస్తుంది.

Advertisement

Also Read: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ మోసాలపై బీ అలర్ట్.. తెలంగాణ సైబర్ బ్యూరో వార్నింగ్!

సదుపాయాలు, భద్రత పరంగా..

వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో పూర్తి కవచ్ (Kavach) యాంటీ కొలిజన్ సిస్టమ్, ఆటోమేటిక్ తలుపులు, శబ్దం తక్కువగా వచ్చేలా డిజైన్ చేసిన కోచ్‌లు, అధునాతన ఇంటీరియర్స్ వంటి అనేక ప్రీమియం వసతులు కల్పించారు. ఇక టికెట్ కేటాయింపు నిబంధనలలో ఈ రెండు రైళ్ల మధ్య ప్రధానమైన తేడా కూడా ఉంది. వందే భారత్ స్లీపర్ రైలులో ఆర్‌ఏసీ సదుపాయం ఉండదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు వేరే ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే కన్ఫర్మ్ సీటు దక్కుతుంది. అదే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ ఏసీ కోచ్‌ల మాదిరిగానే ఆర్‌ఏసీ విధానం అందుబాటులో ఉండటం విశేషం.

Also Read: వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

Tags

Related News

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?

ముంబై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ డోర్లతో కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

Big Stories

Advertisement
×