E-Paper
Advertisement

లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!

లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!
Advertisement

Mumbai Local Train Horror: ముంబై లోకల్ ట్రైన్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ప్రతిఘటించినందుకు ఆమెను ఏకంగా రైలు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటనలో బాధిత యువతి తన ఎడమ చేతిని కోల్పోవడమే కాకుండా.. తలకు 16 కుట్లు పడేంత తీవ్రంగా గాయపడింది.

వివరాల్లోకి వెళ్తే..

బాధిత యువతి ముంబయిలోని బోరివలి నుంచి విరార్ వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో నాయిగావ్ ఈస్ట్‌కు చెందిన 53 ఏళ్ల జితేంద్ర హిర్ముఖే అనే వ్యక్తి ఆమెను అసభ్యకరంగా తాకుతూ వేధించడం మొదలుపెట్టాడు. మొదట యువతి నిలదీసినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితురాలు చెప్పుతో అతడిపై దాడి చేసింది. ఆపై నిందితుడు అసభ్య పదజాలంతో యువతిని దూషిస్తూ తన చెప్పుతో ఆమెపై తిరిగి దాడి చేశాడు.

నాయిగావ్ స్టేషన్‌లో విషాదం

Advertisement

రైలు నాయిగావ్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా వీరి మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో నిందితుడు ఆమెను ఒక్కసారిగా కిందికి తోసేశాడు. దీంతో ఆమె రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయింది. తిరిగి ప్లాట్‌ఫారమ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే రైలు కదలడంతో, ఆమె ఎడమ చేయి రైలు చక్రాల కింద నలిగిపోయింది. మోచేయి వరకు చేయి తెగిపడటంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసు అధికారి, స్టేషన్ లోని ప్రయాణికులు ఆమెను పైకి తీసుకొచ్చి.. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఈ గందరగోళం మధ్య చాకచక్యంగా తప్పించుకున్న నిందితుడ్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఆవేదన

మరోవైపు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న బాధితురాలు.. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు. ‘నేను బోరివలిలో రైలు ఎక్కా. నాయిగావ్ స్టేషన్ సమీపిస్తుండగా అతను నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. రైలు దిగిన తర్వాత కూడా నా వెంటపడి వేధించాడు. నీ ఇంట్లో తల్లి, చెల్లి లేరా? అని ప్రశ్నించినా వినలేదు. నేను తిట్టడంతో అతడు కూడా నన్ను తిట్టి, చెప్పుతో కొట్టి కిందకు తోసేశాడు. నా జీవితమే నాశనమైంది. నాకు న్యాయం కావాలి. అతడికి కఠిన శిక్ష పడాలి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Also Read: మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

పోలీసుల తీరుపై అనుమానాలు!

అయితే ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసు తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం బాధిత కుటుంబం.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీని ఆశ్రయించింది. దీంతో ఆ పార్టీ నేతలు రైల్వే పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్‌ను కలిసి నిందితుడిపై కఠిన సెక్షన్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!

Tags

Related News

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?

ముంబై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ డోర్లతో కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×