E-Paper
Advertisement

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?
Advertisement

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లో ఉంటున్న తెలుగు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయ్. ఎందుకంటే.. ఆ తేదీలకు రైలు టికెట్లు దొరకడం అంత ఈజీ కాదు. పోనీ బస్సులో వెళ్దామంటే.. ప్రైవేట్ ఆపరేటర్లు ధరలు పెంచేసి నిలువు దోపిడీ చేస్తారు. అందుకే.. అన్ని కష్టాలతో ఊరెళ్లడం మా వల్ల కాదంటూ ముందుగానే టికెట్లు బుక్ చేసుకోడానికి ప్రయత్నిస్తారు. రైల్వే అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్ అలా స్టార్ట్ చేయగానే.. ఇలా బుకింగ్‌లు చేసేస్తారు. దీనికి కూడా చాలా పెద్ద పోటీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ స్టార్టయిన క్షణాల్లోనే టికెట్లన్నీ బుక్ అయిపోతాయి. మీకు అలాంటి పరిస్థితి రాకూడదంటే.. ముందుగానే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.

2027లో సంక్రాంతి ఎప్పుడు?

ఇప్పటికే మీరు 2027లో సంక్రాంతి ఎప్పుడు రాబోతుందో తెలుసుకొనే ఉంటారు. వచ్చే ఏడాది జనవరి 14న బోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. ఆ పండగలకు అందుకోవాలంటే మీరు జనవరి 13వ తేదీనే టికెట్లు బుక్ చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండేవారు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. స్పెషల్ ట్రైన్లలో వెళ్దాంలే అనుకుంటే అడ్డంగా బుక్కైపోతారు.

బుకింగ్స్ ఎప్పుడు మొదలు?

Advertisement

వచ్చే ఏడాది సంక్రాంతికి టికెట్లు రిజర్వు చేసుకోవాలంటే.. నవంబరు 14 వరకు వేచి చూడాలి. ఎందుకంటే.. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. 60 రోజుల ముందుగా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ లెక్కన జనవరి 13వ తేదీన ప్రయాణించాలి అనుకుంటే.. నవంబర్ 14 నుంచి టికెట్ల బుకింగ్‌కు ప్రయత్నించాలి. 14వ తేదీన ప్రయాణించాలి అనుకుంటే 15వ తేదీ నుంచి రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది.

పోటీ తప్పదా?

సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఆ రూట్‌లో రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో టికెట్లు బుక్ చేయడం అంటే పెద్ద టాస్కే. అలాగే, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకుండా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇందుకు కాస్త టైమ్ పడుతుంది. రోడ్డు మార్గంలో సొంత వాహనాల్లో వెళ్లాలన్నా ఆ తేదీల్లో కష్టమే. భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి.

Advertisement

Also Read: 1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

Tags

Related News

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

ప్రకృతి అందాల మధ్య ప్రయాణం.. దేశంలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్!

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?

ముంబై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ డోర్లతో కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

Big Stories

Advertisement
×