Illu illaalu Pillalu Dheeraj : బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకున్న డిమాండ్ ఇప్పుడు సీరియల్స్ కి పెరగడంతో ఎక్కువ మంది సీరియల్స్ ని చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చిన్న పెద్ద, ఆడ మగ అని తేడా లేకుండా ఈ మధ్య సీరియల్స్ ని ఎక్కువగా చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొంతమంది. అయితే స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి కూడా ఫాన్స్ ఎక్కువే.. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న ధీరజ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు ధీరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే ధీరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడా? లేక ఇవి కేవలం సోషల్ మీడియా వార్తలేనా? అన్నది కాస్త వివరాలు తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది ఇందులో నటిస్తున్న హీరో ధీరజ్ క్యారెక్టర్ ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. తన కాళ్ళ మీద తను నిలబడి ఎలాగైనా సరే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న కోరికతో ధీరజ్ తన తండ్రిని కూడా లెక్కచేయకుండా ముందుకు వెళుతూ ఉంటాడు. చాలామంది యువతకు ధీరజ్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఇటీవల కాలంలో ధీరజ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ధీరజ్ ప్రస్తుతం సీరియల్స్ మీద మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది మరో విషయం ఏంటంటే సినిమాల్లో కూడా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఏంటి సమయంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో లేడు అని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం.. అయితే ఇప్పుడు ధీరజ్ పెళ్లి గురించి వచ్చిన వార్తలు అవాస్తవమే అని అర్థమవుతుంది మరి దీనిపై ధీరజ్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్న ధీరజ్ కున్న క్రియేటివ్ మామూలుగా లేదు సోషల్ మీడియాలో ఇతనికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇల్లు ఇల్లాలు పిల్లలు హీరో ధీరజ్ తెలుగులో అనేక సీరియల్స్లో నటించారు.. ఇతను తెలుగు యాక్టర్ కాదు. కన్నడ యాక్టర్ నితిన్ అద్వి.. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన మొదటగా స్టార్ మా లో ప్రసారం అయిన కుంకుమపువ్వు సీరియల్లో నటించారు.. ఈ సీరియల్ స్టార్ మా లో సూపర్ హిట్ అవడంతో నితిన్ కు అవకాశాలు వరుసగా వచ్చి పలకరించాయి. అలా ఈ హీరోకి వరుసగా అవకాశాలు క్యూ కట్టడంతో క్రేజ్ కూడా భారీగా పెరిగింది.. ఇకపోతే ఈ హీరో కి రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ఒక్కరోజుకి దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. లెక్కన చూస్తే నితిన్ నెలకి లక్షలని సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు.