BigTV English
Advertisement

Garib Rath vs Vande Bharat: గరీబ్ రథ్ to వందేభారత్.. ఈ రైళ్ల టికెట్ ధరలు ఎంతో తెలుసా? రేట్లు మధ్య తేడాకు ఇవే కారణాలు

Garib Rath vs Vande Bharat: గరీబ్ రథ్ to వందేభారత్.. ఈ రైళ్ల టికెట్ ధరలు ఎంతో తెలుసా? రేట్లు మధ్య తేడాకు ఇవే కారణాలు

Big TV Live Originals: రైళ్లలో తరచుగా ప్రయాణించే వారు వాటి టికెట్ల ధరలను పరిశీలించే ఉంటారు. ఒక్కో రకం ట్రైన్‌కి ఒక్కో ధర ఉంటుంది. ఇండియన్ రైల్వేలో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, గరీబ్ రథ్, వందేభారత్, దురంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇలా చాలా రకాల రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు ప్రయాణించే వేగం, వాటిలో ఉండే సౌకర్యాలను బట్టి ఒక్కో రకం ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఒక్కో ధర ఉంటుంది. అసలు ఎక్కువ ధర ఉండే రైళ్లలో అంత మంచి సౌకర్యాలు ఏముంటాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


ధరల మధ్య తేడా ఇదే..
రైలు రకాన్ని బట్టి వాటి ధరల పరిధి ఉంటుంది. సుమారు 500 కి.మీ ప్రయాణించాలంటే ఏ రకం ట్రైన్‌లో ఏ రేంజ్ వరకు ధరలు ఉంటాయంటే..

ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో వెళ్లాలంటే రూ.200–రూ.1,500 వరకు టికెట్ ధర ఉంటుంది. వీటిలో స్లీపర్, ఏసీ ఉంటాయి. అంతేకాకుండా తక్కువ ధరతో ప్రయాణం చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రైన్‌లో సాధారణ సౌకర్యాలు ఉంటాయి. ఎక్కువ స్టాప్‌లు ఉంటాయి, సర్‌ఛార్జ్ ఉండదు.


సూపర్‌ఫాస్ట్ ట్రైన్స్‌లో ట్రావెల్ చేయడానికి రూ.250–రూ.1,800 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో స్లీపర్, ఏసీ కంపార్ట్మెంట్‌లు ఉంటాయి. సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లో రూ.10- రూ.45 వరకు సర్‌ఛార్జ్ ఉంటుంది. తక్కువ స్టాప్‌లు ఉండడమే కాకుండా ఈ రైళ్లు చాలా వేగంగా కూడా ప్రయాణిస్తాయి.

గరీబ్ రథ్ అనే ట్రైన్‌లలో ప్రయాణించాలంటే రూ.150–రూ.1,200 వరకు టికెట్ ధర ఉంటుంది. తక్కువ ధరలోనే ఏసీ ఉండే ట్రైన్‌లో వెళ్లాలి అనుకునే వారికి గరీబ్ రథ్ బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. కానీ, బెడ్డింగ్ సౌకర్యం ఉండదు.

వందేభారత్ రైళ్లో ప్రయాణించాలంటే టికెట్ ధర రూ.1,000–రూ.3,000 వరకు ఉంటుంది. వీటిని సెమీ-హైస్పీడ్ ట్రైన్స్ అని కూడా పిలుస్తారు. వై-ఫై, ఆహారం అందుబాటులో ఉంటాయి.

దురంతో ట్రైన్స్‌లో ట్రావెల్ చేయాలంటే టికెట్ ధర రూ.300–రూ.2,000 ఉంటుంది. ఇవి కూడా స్లీపర్ రైళ్లే, ఏసీ కూడా ఉంటుంది. తక్కువ స్టాప్‌లలో ఆగుతుంది. మంచి ఆహారం ఉంటుంది. సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లో రూ.1,200–రూ.3,500 టికెట్‌కు చెల్లించి ప్రయాణించొచ్చు. ఇందులో ప్రీమియం సౌకర్యాలు ఉంటాయి. పూర్తిగా ఏసీ ఉంటుంది. మంచి ఆహారం కూడా అంబాటులో ఉంటుంది. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తే రాజధాని ఎక్స్‌ప్రెస్ బెస్ట్ ఆప్షన్.

ALSO READ: డైలీ సికింద్రాబాద్ నుంచి ఎన్ని రైళ్లు రాకపోకలు చేస్తాయో తెలుసా?

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లో దాదాపు 500 కిలో మీటర్లు ప్రయాణించాలంటే రూ.800–రూ.2,500 వరకు టికెట్ ధర ఉంటుంది. ఇందులో కూడా ఏసీ ఉంటుంది. మంచి ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే టికెట్ల ధరలు దూరం, క్లాస్ డైనమిక్ ప్రైసింగ్ ఆధారంగా మారతూ ఉంటాయి.

ధరల్లో తేడాలు ఎందుకు?
వందేభారత్ ట్రైన్ గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది సెమీ-హైస్పీడ్ ట్రైన్ కాబట్టి తక్కువ సమయంలో గమ్యం చేరుతుంది. ఇందులో ఆటోమేటిక్ డోర్స్, వై-ఫై, జీపీఎస్ ఇన్ఫో సిస్టమ్, రిక్లైనింగ్ సీట్లు, ఆహారం ఉంటాయి.

రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో, గరీబ్ రథ్ రైళ్లు గంటకు 130–140 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. చాలా దూరం ప్రయాణించేందుకు ఈ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి. కానీ, వీటి టికెట్స్ ధర ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రైన్‌లో ఫుడ్, బెడ్డింగ్, కొన్ని రైళ్లలో వై-ఫై, శుభ్రమైన కోచ్‌లు ఉంటాయి. ప్రీమియం కాబట్టి ధర ఎక్కువ.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గంటకు 130–155 కి.మీ వేగంతో వెళ్తుంది. దీని ధర రాజధాని కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఫుడ్, వాటర్ బాటిల్ కూడా లభిస్తాయి. దీని ధర ధర రాజధాని కంటే తక్కువగా ఉంటుంది.

సూపర్‌ఫాస్ట్ రైళ్లు గంటకు 55 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి చాలా తక్కువ స్టాప్‌లు ఉంటాయి. సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ వల్ల ఎక్స్‌ప్రెస్ కంటే దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఎక్స్‌ప్రెస్ రైలు 55 కి.మీ/గం కంటే తక్కువ వేగంతో వెళ్తుంది. దీనికి ఎక్కువ స్టాప్‌లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలి అనుకునే వారు ఇందులో ట్రావెల్ చేయొచ్చు.

ట్రైన్ ప్రయాణించే వేగం, అందులో ఉండే సౌకర్యాలు, కోచ్ డిజైన్, అందులో లభించే ఆహారం వంటి వాటిని బట్టి వాటి టికెట్ల ధర ఉంటుందట. వందేభారత్, రాజధాని, శతాబ్ది రైళ్లలో ఉండే లగ్జరీ ఫెసిలిటీస్, టెక్నాలజీ కారణంగా టికెట్ ధర ఉంటుంది. బడ్జెట్‌లో జర్నీ చేయాలనుకునే వారి కోసం గరీబ్ రథ్ రైళ్లో రూపొందించబడ్డాయి. సామాన్యుల కోసం ఎక్స్‌ప్రెస్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దురంతో రైళ్లు చాలా ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉంటాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Big Stories

×