BIG TV LIVE Originals: ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. రోజూ దేశ వ్యాప్తంగా 20 వేల రైళ్లు ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం 2.5 కోట్ల మందికి పైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైలు ప్రయాణం ఇప్పుడు అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్ల వరకు చేరుకుంది. త్వరలో అత్యంత వేగంగా నడిచే వందేభారత స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. హైడ్రోజన్ రైళ్లతో పాటు, బుల్లెట్ ట్రైన్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
దేశంలో పట్టాలెక్కిన మొట్ట మొదటి ప్యాసింజర్ రైలు
మన దేశంలో తొలి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16, 1953లో పట్టాలు ఎక్కింది. బ్రిటిషర్లు ఈ రైలును బొంబాయిలోని బోరి బందర్(ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) నుంచి థానే వరకు నడిపించారు. మొత్తం 34 కిలో మీటర్ల మేర ప్రయాణించింది. అప్పట్లో రైల్వే వ్యస్థకు గ్రేట్ ఇండియన్ పెనిస్సులా రైల్వే అనే పేరు ఉండేది. ఈ రైలు మొత్తం 14 బోగీలను కలిగి ఉంది. మొత్తం 400 మంది ఈ రైల్లో ప్రయాణించారు. ఈ బోగీలను సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే మూడు ఆవిరి లోకోమోటివ్‌లు ముందుకు తీసుకెళ్లాయి. సగటున 27 కి.మీ వేగంతో సుమారు 1 గంట 15 నిమిషాల పాటు ఈ రైలు ప్రయాణించింది. భారత దేశపు తొలి ప్యాసింజర్ రైలు 21 గన్ సెల్యూట్ తో ప్రారంభించబడింది. ఇది ఆసియా ఖండంలోనే పట్టాలు ఎక్కిన తొలి రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
తొలి ప్యాసింజర్ రైల ఛార్జీల వివరాలు
ఇక ఈ రైలులో మూడు క్లాసుల సీటింగ్ ఉంది. ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, థర్డ్ క్లాస్. కుషన్డ్ సీట్లు కలిగిన ఫస్ట్ క్లాస్ లో బ్రిటిష్ అధికారులు, సంపన్న భారతీయులు, ఉన్నత వర్గాలు ప్రయాణించారు. సెకండ్ క్లాస్ లో ప్రైమరీ సీటింగ్ ఉంది. ఇందులో మధ్యతరగతి ప్రయాణీకులు వెళ్లారు. ఇక థర్డ్ క్లాస్ లో చెక్క బెంచీలు ఉండేవి. ఇందులో సాధారణ ప్రయాణీకులు వెళ్లేవారు. థర్డ్ క్లాస్ టికెట్ల ధరలు చాలా సరసంగా ఉండేవి. 1853 ప్రయాణానికి సంబంధించి కచ్చితమైన ఛార్జీల రికార్డులు లేవు. కానీ, థర్డ్ క్లాస్ ధరలు 1853లో సుమారు 4 నుంచి 8 అణాలు(1 రూపాయికి 16 అణాలు) ఉండేది. సెకెండ్ క్లాస్ లో సుమారు రూ. 1 నుంచి రూ. 2 వరకు ఉండేది. ఫస్ట్ క్లాస్ లో రూ. 2 నుంచి రూ. 5 వరకు ఉండేది.
పరిమిత సౌకర్యాలు
ఇక తొలి రైలులో బోగీలలో ఎలాంటి వసతులు ఉండేవి కాదు. రాను, రాను వసతులను మెరుగు పరిచారు. అదే సమయంలో బోరి బందర్- థానే లైన్ ను మరింతగా ఆధునీకరించారు. ఆ తర్వాత హౌరా- హూగ్లీ(1854), మద్రాస్- ఆర్కాట్(1856)లో రైల్వే మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: విమానం దిగితే రూ. 2.5 లక్షలు ఇస్తాం, ఎయిర్ లైన్స్ ఆఫర్ కు ప్రయాణీకుడు ఏం చేశాడంటే?